IT Hub: కార్లలో గంజాయి, ఆంధ్రా గ్యాంగ్ సీక్రెట్, కాలేజ్ అమ్మాయిలు, ఐటీ ఉద్యోగులు టార్గెట్ !

బెంగళూరు: ఐటీ హబ్ లోని టెక్కీలు, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులు, కాలేజ్ విద్యార్థులు, అమ్మాయిలు, పీజీలో ఉంటున్న యువకులను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారు. ప్రముఖ హోటల్స్, గెస్ట్ హౌస్ లోకి వస్తున్న వారికి గంజాయి విక్రయిస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్న ఆంధ్రా గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా గంజాయి తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా ఐటీ హబ్ లో అమ్మేస్తున్న గ్యాంగ్ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది.

ఐటీ హబ్ బెంగళూరులో!

ఐటీ హబ్ బెంగళూరులో!

ఐటీ హబ్ బెంగళూరులో సీక్రెట్ గా గంజాయి విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. బెంగళూరు నగరంలోని కోణెనేకుంట సమీపంలో గంజాయి విక్రయిస్తున్న నాగేష్ (30), బోంజి బాబు అలియాస్ ఫిలిప్స్ (23), సీమంత్ (32) అనే ముగ్గురిని బెంగళూరులోని కోణేనేకుంట పోలీసులు అరెస్టు చేశారు.

ఆంధ్రా టూ బెంగళూరు

ఆంధ్రా టూ బెంగళూరు

నిందితులు ముగ్గురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారని పోలీసులు అన్నారు. గుట్టుచప్పుడు కాకుండా కార్లలో గంజాయి నింపుకుని అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టుల్లో ఉన్న సిబ్బంది కళ్లుకప్పి నిందితులు బెంగళూరు చేరుకుంటున్నారని పోలీసులు అన్నారు. బెంగళూరులోకి గంజాయి తీసుకు వచ్చిన తరువాత వాటిని చిన్నచిన్న ప్యాకెట్లు చేసి విక్రయిస్తున్నారని పోలీసులు చెప్పారు.

బెంగళూరులో వీళ్లే టార్గెట్

బెంగళూరులో వీళ్లే టార్గెట్

ఐటీ హబ్ లోని టెక్కీలు, కొన్ని కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులు, కాలేజ్ విద్యార్థులు, హాస్టల్ లో, పీజీల్లో ఉంటున్న ఉద్యోగులను టార్గెట్ చేసుకుని ఆంధ్రా గ్యాంగ్ గంజాయి విక్రయిస్తున్నారని పోలీసులు అన్నారు. ప్రముఖ హోటల్స్, గెస్ట్ హౌస్ ల్లోకి వస్తున్న వారికి గంజాయి విక్రయిస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నారని విచారణలో ఈ ముగ్గురు అంగీకరించారని పోలీసులు చెప్పారు.

ఆంధ్రా నుంచి సీక్రెట్ గా గంజాయి సప్లే

ఆంధ్రా నుంచి సీక్రెట్ గా గంజాయి సప్లే

బెంగళూరులో చాలా ప్రాంతాల్లో గంజాయి సీక్రెట్ గా విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా గంజాయి బెంగళూరు వస్తోందని ఇప్పటకే చాలాసార్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. విశాఖపట్టణం, పశ్చిమ గోదావరి, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా గంజాయి బెంగళూరు వస్తోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు ముగ్గురిని విచారణ చేస్తున్నామని, ఈ బ్యాచ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు ? అని ఆరా తీస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+