సీఎం వెంట స్టార్ హీరో, జాతీయ అధ్యక్షుడు కూడా, ముహుర్తం ఫిక్స్, భారీ ర్యాలీతో !

బెంగళూరు/శిగ్గావి: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఆయన సొంత నియోజక వర్గం నుంచి మరోసారి పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. సెంటిమెంట్లు ఎక్కువగా పాటించే కర్ణాటక రాజకీయ నాయకులు ముందుగానే నామినేషన్లు వెయ్యడానికి ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటున్నారు. నామినేషన్ వేస్తున్న సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వెయ్యడానికి చివరికి రోజు ఈనెల 20వ తేదీ. అయితే ఈనెల 20వ తేదీ గురువారం అమావాస్య రావడంతో ముందుగానే అందరూ దాదాపుగా నామినేషన్లు వేస్తున్నారు. బుధవారం కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ నామినేషన్ వెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.

Kannada star hero Kiccha Sudeep participating in the CM Basavaraj Bommai nomination

మా మామ బసవరాజ్ బోమ్మయ్ గెలుపు కోసం తాను శక్తి వంచనలేకుండా పని చేస్తానని ఇప్పటికే ప్రముఖ కన్నడ స్టార్ హీరో, దర్శకుడు కిచ్చా సుదీప్ ప్రకటించారు. బుధవారం సీఎం బసవరాజ్ బోమ్మయ్ నామినేషన్ వేస్తున్న సందర్బంగా ఆయన వెంట కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నామినేషన్ ర్యాలీలో పాల్గొంటున్నారు.

నామినేషన్ వేసే ముందు సీఎం బసవరాజ్ బోమ్మయ్ శిగ్లావి పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇదే రోడ్ షోలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో పాటు కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా పాల్గొంటారని, వేలాది మంది బీజేపీ కార్యకర్తలు వెంట ఉంటారని కర్ణాటక బీజేపీ నాయకులు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి తాను మద్దతు ప్రకటిస్తానని ఇప్పటికే కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం బసవరాజ్ బోమ్మయ్ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ, నడ్డాను కూడా ఆహ్వానించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న జేపీ. నడ్డా, హీరో సుదీప్ తదితరులు సీఎం బసవరాజ్ బోమ్మయ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్బంగా
శిగ్గావిలో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+