Aishwarya:డీకే కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం, పొలిటికల్ వార్ పక్కనపెట్టి హాజరైన సీఎం, అందరూ హ్యాపీ!

బెంగళూరు: కేపీసీసీ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య, కాఫీడే కింగ్, దివంగత సిద్దార్థ హెగ్డే కుమారుడు అమార్థల వివాహ నిశ్చితార్థం అదిరిపోయే లెవల్లో జరిగింది. మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ కుటుంబ సభ్యులు, డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరైనారు.

పొలిటికల్ వార్ పక్కన పెట్టిన కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప, కొందరు మంత్రులు ఈ శుభకార్యానికి హాజరై ఐశ్వర్య, అమార్థలను ఆశీర్వదించారు. పలువురు నాయకులు పార్టీలకు అతీతంగా ఐశ్వర్య, అమార్థల నిశ్చితార్థం వేడుకకు హాజరైనారు. కాబోయే వధూవరులతో పాటు శుభకార్యం జరిగిన స్టార్ హోటల్ మొత్తం గులాబీ రంగులతో కలకలలాడింది.

మాజీ సీఎం మనుమడు

మాజీ సీఎం మనుమడు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం. కృష్ణ కుమార్తె భర్త వీజీ. సిద్దార్థ. కాఫిడే వ్యవస్థాపకుడైన వీజీ. సిద్దార్థ అనేక వ్యాపారాలు చేశారు. కాఫీడే కింగ్ గా పేరు తెచ్చుకున్న సిద్దార్థ కుమారుడు అమార్థ. గత ఏడాది వీజీ. సిద్దార్థ నేత్రావతి నదీలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి సిద్దార్థ మరణించిన తరువాత ఆయన వ్యాపారాలను అమార్థ చూసుకుంటున్నాడు. మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ కూతురి కుమారుడే ఈ అమార్థ.

ట్రబుల్ షూటర్

ట్రబుల్ షూటర్

కార్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దృష్టిలో ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న డీకే. శివకుమార్ ప్రస్తుతం కేపీసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. డీకే. శివకుమార్ కు రాజకీయ గురువు కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ అనే విషయం తెలిసిందే. మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ. డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు ఒక్కటి అయ్యాయి. డీకే. శివకుమార్, కాఫీడే కింగ్ సిద్దార్థ 20 ఏళ్లకు పైగా మంచి స్నేహితులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

పొలిటికల్ వార్ పక్కన పెట్టి హాజరైన సీఎం

పొలిటికల్ వార్ పక్కన పెట్టి హాజరైన సీఎం

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు ఎయిర్ పోర్టు) సమీపంలోని ప్రముఖ ప్రైవేట్ స్టార్ హోటల్ లో డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య, అమార్థల నిశ్చితార్థం వేడుక జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, కర్ణాటక రెవెన్యూ శాఖా మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఆర్. అశోక్ తదితరులు ఈ వేడుకకు హాజరై ఐశ్వర్య, అమార్థలను ఆశీర్వదించారు. ఐశ్వర్య నిశ్చితార్థం సందర్బంగా సీఎం బీఎస్. యడియూరప్ప పొలిటికల్ వార్ పక్కన పెట్టి డీకే. శివకుమార్ ఇంట జరిగిన శుభకార్యానికి హాజరైనారు.

యూపీ జోతిష్యుడు పెట్టిన ముహూర్తం

యూపీ జోతిష్యుడు పెట్టిన ముహూర్తం

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు చూసిన ముహూర్తంలో ఐశ్వర్య, అమార్థల నిశ్చితార్థం జరిగింది. మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ. డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరైనారు. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఈ శుభకార్యానికి హాజరైనారు. కరోనా వైరస్ దెబ్బతో కేవలం 250 మందిని మాత్రమే ఆహ్వానించారని సమాచారం.

Recommended Video

    Andhra Pradesh: అర్హులంద‌రికీ డిసెంబ‌ర్ 25న ఇళ్ల ప‌ట్టాల పంపిణీ... 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా...!!
    2021 ఫిబ్రవరిలో పెళ్లి

    2021 ఫిబ్రవరిలో పెళ్లి

    కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం. కృష్ణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. డీకే శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడు. ఈ శుభకార్యానికి కాంగ్రెస్, బీజేపీల కార్యకర్తలు, నాయకులు చాలా మందిని ఆహ్వానించలేదు. 2021 ఫిబ్రవరి నెలలో ఐశ్వర్య, అమార్థల వివాహం వైభవంగా జరిపించాలని, అప్పుడు అందర్నీ ఆహ్వానించాలని డీకే. శివకుమార్ నిర్ణయించారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+