షాకింగ్: ఏఎస్పీపైకి కారు ఎక్కించేందుకు యత్నం, కాంగ్రెస్ నేత సహా ఐదుగురి అరెస్ట్
బెంగళూరు: కర్ణాటకలో ఓ పోలీసు ఉన్నతాధికారిపై ఓ వ్యక్తి కారు ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ ఘటనలో నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఓ కాంగ్రెస్ నేత కూడా ఉన్నాడు.
ఉత్తర కన్నడ జిల్లా హట్టికేరి టోల్‌గేట్ సిబ్బందితో వాహనదారుడు గొడవకు దిగాడు. ఈ వివాదాన్ని గమనించిన ఏఎస్పీ భద్రీనాథ్ అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులతోనూ వాదనకు దిగిన సదరు వ్యక్తి ఒక్కసారిగా ఏఎస్పీ మీదకు కారు ఎక్కించేందుకు ప్రయత్నించాడు.

కారు తగిలి ఏఎస్పీ భద్రీనాథ్ కిందపడగా గన్‌మెన్ పైకి లేపాడు. అయినా ఆగని వాహనదారుడు ఆపకుండా అక్కడ్నుంచి పారిపోయాడు. అయితే, నిందితులను వెంబడించి పట్టుకున్నారు పోలీసులు.

ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ కాంగ్రెస్ నేత కూడా ఉన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications