మా పార్టీ సిటీ బస్సు కాదు, బస్సు ఎక్కి ఎక్కడపడితే అక్కడ దిగడానికి, డీకే ఫైర్, టార్గెట్!

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక రాష్ట్రంలో మళ్లీ పార్టీ ఫిరాయింపుల పర్వం మొదలైంది. ముఖ్యంగా ఇప్పటికే ఓటమి ఊబిలో కూరుకుపోయిన బీజేపీకి షాక్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ, జేడీఎస్ నాయకులకు గాలం వేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతున్నది. ఈ సందర్భంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఘాటుగా మాట్లాడటం హాట్ టాపిక్ అయ్యింది.

మేం కాంగ్రెస్ పార్టీకి చెందినవాళ్లం, ఆ పార్టీలో చేరుతున్నాము అని చెప్పకుంటే సరిపోదని అన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరుతున్న నాయకులు ప్రతి స్టాప్‌లో దిగి బస్సు ఎక్కేలా చేయ్యకూడదని, మీకు కాంగ్రెస్ పార్టీ అనే బస్సు ఎక్కిన తరువాత చివరి బస్ స్టాప్ వరకు ప్రయాణించడానికి సిద్దంగా ఉండాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు.

Karnataka DCM DK Shivakumar gave a sharp reply that the Congress party is not a city bus

కాంగ్రెస్ పార్టీ అనే బస్సు ఎక్కిన తరువాత ప్రతి బస్ స్టాప్ లో దిగి ఎక్కడానికి కదురదని, కాంగ్రెస్ పార్టీ అనేది సిటీ బస్సు కాదని డీకే శివకుమార్ ఘాటుగానే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని సిద్దాంతాలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతో విలువ ఉందని, ఎప్పుడు పడితే అప్పుడు వాళ్లు సిటీ బస్సు ఎక్కిదిగినట్లు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తరువాత ఎక్కడపడితే అక్కడ దిగడానికి వీలులేదని డీకే శివకుమార్ చెప్పారు.

బెంగళూరు నగరంలోని క్వీన్స్‌ రోడ్డులోని కేపీసీసీ కార్యాలయంలో గురువారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీలో ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు డీసీఎం డీకే శివకుమార్‌ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఇదే సమయంలో జేడీఎస్‌ నేత, మాజీ విదాన పరిషత్‌ సభ్యుడు ఆయనూరు మంజునాథ్‌ కూడా కాంగ్రెస్ పార్టీలో చేశారు.

Karnataka DCM DK Shivakumar gave a sharp reply that the Congress party is not a city bus

ఈ సందర్బంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం కొనసాగితే సీనియారిటీ, బాధ్యత, గౌరవం పెరుగుతాయని, పార్టీలోకి రావడం, వెళ్లడం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఆ ప్రభావం చూపుతుంది డీసీఎం డీకే శివకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించన విధంగా మెజారిటీ సీట్లలో విజయం సాధించి ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తామని, ఆ టైమ్ దగ్గరలోనే ఉందని డీకే శివకుమార్ చెప్పారు. ఇదే సమయంలో శివమొగ్గకు చెందిన అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+