బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటకలో కరోనా మరణాల డేటా ఆలస్యం: మాగ్జిమమ్ నెలరోజుల వరకు, కారణాలివేనా..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌తో చనిపోయిన వారి వివరాలు ప్రకటించడంలో గందరగోళం నెలకొంది. వైరస్‌తో చనిపోతే మార్గదర్శకాలు పాటిస్తోన్న.. కొన్ని రాష్ట్రాల్లో తప్పులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం మరణాల సంఖ్యను ఆలస్యంగా ప్రకటిస్తుందనే విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే 3800 మంది వైరస్ సోకి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే కొందరి మరణాల ధృవీకరించేందుకు నెలరోజుల సమయం పడుతుందనే అంశం సందేహాలకు తావిస్తోంది.

బులెటిన్ ఇలా..

బులెటిన్ ఇలా..

కర్ణాటకలో కరోనా వైరస్ రోగులు, మరణాలపై ఇంగ్లీష్ పత్రిక ప్రతినిధి వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం ఆరోగ్యశాక బులెటిన్ విడుదల చేసింది. ఆగస్ట్ 9 నుంచి 15వ తేదీ వరకు 741 మరణాలు సంభవించాయని తెలిపింది. అందులో 388 మంది ఆగస్ట్ 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు చనిపోయారని పేర్కొన్నది.

చనిపోయిన వారి వివరాలు..

చనిపోయిన వారి వివరాలు..

జూలై 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 120 మంది, జూలై 15వ తేదీకి ముందు 133 మంది చనిపోయారని తెలిపారు. దీనినిబట్టి జూలై 15వ తేదీకి ముందు కనీసం 10 మందికి పైగా చనిపోయారు. తర్వాత 10 మంది 15 రోజులకు.. 66 మంది ఆగస్టులో చనిపోయారని పేర్కొన్నది. ఆగస్ట్ 15వ తేదీన బులెటిన్ ఇచ్చే రెండురోజుల ముందు 75 శాతం మరణాలు సంభవించాయని అర్థమవుతోంది. దీనిని బట్టి చనిపోయిన రోజున మాత్రం డేటా ఇవ్వకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారు.

కారణం ఇదే..

కారణం ఇదే..

దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కానీ వాటిని అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కొన్ని శాంపిల్స్ చనిపోయిన తర్వాత కూడా సేకరిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు. మరణాలకు సంబంధించి ఆలస్యంగా రిపోర్ట్ చేయడం ఈ నెల మొదటివారంలో కనిపించింది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో తేడా వైద్యారోగ్య శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

మరునాడు రిపోర్ట్

మరునాడు రిపోర్ట్

పాజిటివ్ కేసులు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.59 గంటల వరకు పరిగణిస్తామని.. అయితే పాజిటివ్ కేసులు, డిశ్చార్జ్, మరణాలకు సంబంధించి డేటా ల్యాబ్‌లో ఉంటుందని తెలిపారు. దీంతో కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందని వివరించారు. కొన్ని సందర్భాల్లో రోగి చనిపోయిన తర్వాత శాంపిల్ సేకరిస్తున్నామని.. దీంతో రిపోర్ట్ ఆ రోజు రాదు కదా అని అధికారులు తెలిపారు. దీనికి తమ సాప్ట్ వేర్ అప్ డేషన్ కూడా ఒక కారణం అని పేర్కొన్నారు.

English summary
Karnataka, which has over 3,800 Covid-19 fatalities, has been acknowledging deaths very late, in some cases by over a month, giving rise to doubts of underreporting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X