Karnataka News: ప్రభుత్వ ఉద్యోగినితో పంచాయతీ సభ్యుడి సరసాలు..! వీడియో లీక్..
సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాపతినిధి, ప్రభుత్వ ఉద్యోగిని చేసిన పనికి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకా జేసీపూర్ గ్రామపంచాయతీ ఆఫీస్ లో మహిళ పీడీఓ, గ్రామపంచాయతీ సభ్యుడు ప్రసన్నకుమార్ సరసాలకు దిగారు. అయితే వారు అక్కడున్న సీసీ కెమెరాను గమనించకుండా సరసకల్లాపాల్లో మునిగి తేలారు. ఎవరో సీసీ ఫుటేజీలను లీక్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వీడియోలో ఉన్న తేదీలను బట్టి ఈ ఘటన మే 7న జరిగినట్లు తెలుస్తుంది.
మహిళ పీడీఓను ప్రసన్నకుమార్ బలవంతంగా ముద్దు పెట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి జిల్లా పంచాయతీ సీఈవో డా. విద్యాకుమారిపై నివేదిక ఇవ్వాలని చిక్కనాయకనహళ్లి తాలూకా పంచాయతీ ఈఓను ఆదేశించారు. అయితే ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.













Click it and Unblock the Notifications