Leader: అధికార పార్టీ హత్యకు స్కెచ్ వేసింది వీళ్లే, పక్కాస్కెచ్ తో ఫినిష్, హత్య చేసింది ఎవరంటే!

బెంగళూరు/ మంగళూరు: కర్ణాటకలో బీజేపీ నాయకుడి హత్య కేసు కలకలం రేపింది. బీజేపీ నాయకుడి హత్యను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, హోమ్ మంత్రి, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, హిందూ సంఘ, సంస్థ నాయకులు ఖండించారు. కర్ణాటకను కుదిపేసిన బీజేపీ యువమోర్చ నాయకుడి హత్య కేసులో పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులు బీజేపీ నాయకుడి హత్యకు స్కెచ్ వేశారని, హత్య మరో ఇద్దరు చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే బీజేపీ నాయకుడి హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

కర్ణాటకను కుదిపేసింది

కర్ణాటకను కుదిపేసింది

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సూళ్య తాలుకాలోని బెళ్లారే పట్టణంలో ప్రవీణ్ నెట్టూరు అలియాస్ ప్రవీణ్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ యువమోర్చ నాయకుడిగా పని చేస్తున్న ప్రవీణ్ బీజేపీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సామాజిక కార్యకర్తగా అందరికి దగ్గర అయ్యాడు.

షాపు దగ్గర అందరి మందు హత్య

షాపు దగ్గర అందరి మందు హత్య

దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ బెళ్లార పట్టణంలోని బెరువాజీ క్రాస్ లో కోళ్ల అంగడి నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. కేరళ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన బైక్ లో వెళ్లిన ముగ్గురు వ్యక్తులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ మీద వేటకొడవళ్లతో దాడి చేశారు. ఆ సందర్బంలో తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకుడు ప్రవీణ్ ను వెంటాడి వెంటాడి వేటకొడవళ్లతో నరికి చంపేశారు.

 సహనం కోల్పోయిన యువకులు

సహనం కోల్పోయిన యువకులు

బుధవారం ప్రవీణ్ శవానికి పోస్టుమార్టం నిర్వహించి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, ప్రవీణ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రవీణ్ అంతిమ యాత్ర సందర్బంగా కొందరు యువకులు రాళ్ల వర్షం కురిపించారు. ఆ సందర్బంలో రాళ్లతో దాడులు చెయ్యకూడదని పోలీసులు మనవి చేసినా కొందరు పట్టించుకోలేదు. ఆ సందర్బంలో పోలీసులు లాఠీలను పని చెప్పడంతో అనేక మందికి తీవ్రగాయాలైనాయి.

ఉలిక్కిపడిన బీజేపీ నాయకులు

ఉలిక్కిపడిన బీజేపీ నాయకులు

బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్యతో కర్ణాటకలోని బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. కర్ణాటకలో బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసు కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్యను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, హోమ్ మంత్రి, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, హిందూ సంఘ, సంస్థ నాయకులు ఖండించారు.

హత్యకు స్కెచ్ వేసింది వీళ్లే

హత్యకు స్కెచ్ వేసింది వీళ్లే

కర్ణాటకను కుదిపేసిన బీజేపీ యువమోర్చ నాయకుడు ప్రవీణ్ హత్య కేసులో పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. సవణూరుకు చెంది జాకీర్, హత్యకు గురైన ప్రవీణ్ ఊరు బెళ్లారేలో నివాసం ఉంటున్న షఫిక్ అనే ఇద్దరు నిందితులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్యకు స్కెచ్ వేశారని పోలీసులు అన్నారు. ప్రవీణ్ ను మరో ఇద్దరు హత్య చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే బీజేపీ నాయకుడి హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+