KCR: సీఎం కేసీఆర్ కు చాన్స్ చిక్కింది, కర్ణాటకలో ఇక దబిడిదబిడే, డేట్ ఫిక్స్ చేసి, ఎంత మంది అంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ తో పాటు ఆయన మంత్రి వర్గంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారు.

బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతున్నది. అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు నువ్వానేనా ? అంటూ పోటాపోటీగా ప్రచారం చేస్తూ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కొత్తకొత్త ప్లాన్లు వేస్తున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని స్కెచ్ లు వేస్తున్నారు.

ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ తో పాటు ఆయన మంత్రి వర్గంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. అయితే కేసీఆర్ ఓ డేట్ ఫిక్స్ చేసుకుని టైమ్ చూసి కర్ణాటకలో అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారని తెలిసింది.

డేట్ ప్రకటించిన తరువాతే?

డేట్ ప్రకటించిన తరువాతే?

కర్ణాటకలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఇంకా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చెయ్యలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరపున భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతలు ప్రచారం చెయ్యడానికి పక్కాప్లాన్ చేసుకుంటున్నారని వెలుగు చూసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన తరువాతే బీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది.

పంచరత్న రథయాత్ర

పంచరత్న రథయాత్ర

కర్ణాటకలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొనింది. జేడీఎస్ తో ఎంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న బీఆర్‌ఎస్‌కు జాతీయ పార్టీగా అవతరించేందుకు కర్ణాటకలో మొదటిసారి చక్కటి అవకాశం చిక్కింది.

కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హెచ్ డీ కుమారస్వామి గత ఏడాది డిసెంబర్ నుండి కర్ణాటకలో పంచరత్న రథయాత్ర నిర్వహించడం ద్వారా కర్ణాటకలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

డుమ్మా కొట్టిన బీఆర్ఎస్

డుమ్మా కొట్టిన బీఆర్ఎస్

పంచరత్న రథయాత్రలో పాల్గొనాలని కుమారస్వామి బీఆర్ ఎస్ నాయకులను ఆహ్వానించారని, అయితే వారు మాత్రం ప్రచారంలో పాల్గొనలేదని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా టైమ్ ఉందని, బీఆర్ఎస్ నాయకులు కొన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని జేడీఎస్ పార్టీకి చెందిన మరి కొంతమంది నాయకులు అంటున్నారు.

అంత మంది వస్తే దబిడిదబిడే

అంత మంది వస్తే దబిడిదబిడే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ నుంచి ప్రచారం చెయ్యడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కర్ణాటకకు వస్తారని తెలిసింది, అయితే ఇంత వరకు కేసీఆర్ ఎప్పుడు ప్రచారానికి వస్తారు అనే విషయంలో క్లారిటీ లేదని జేడీఎస్ నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సుమారు 60 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని జేడీఎస్ నాయకులు అంటున్నారు.

అయితే భారత ఎన్నికల కమీషన్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు డేట్ ఫిక్స్ చేసిన తరువాతే బీఆర్ఎస్ నాయకులు కర్ణాటకలోకి ఎంట్రీ ఇస్తారని తెలిసింది.

మోదీ ఎఫెక్ట్ తో దూసుకుపోతున్న బీజేపీ

మోదీ ఎఫెక్ట్ తో దూసుకుపోతున్న బీజేపీ

ఇక అధికార బీజేపీకి చెందిన నాయకులు ఢిల్లీ నుంచి అగ్రనాయకులను రంగంలోకి దింపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు నాయకులు ఇప్పటికే కర్ణాకటకు వెళ్లి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలను రంగంలోకి దింపడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+