• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Employee: హైకోర్టు ఉద్యోగికి స్వర్గం చూపిస్తానని చెప్పిన అను, మధ్యలో కావ్యా ఎంట్రీ, వీడియోలు తీసి?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హనీట్రాప్ కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఎప్పుడు ఎవరు హనీట్రాప్ లో పడుతారో చెప్పడం చాలాకష్టం అయ్యింది. శ్రీమంతులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు హనీట్రాప్ వలలో పడి ఇప్పటికే లబోదిబో అంటు కొట్టుకుంటున్నారు. కిలాడీ లేడీ ఏకంగా హైకోర్టు ఉద్యోగికి గాలం వేసింది. కొంతకాలం హైకోర్టు ఉద్యోగితో చనువుగా ఉన్న కిలాడీ లేడీ అతన్ని ఆమె ఇంటికి పిలిపించుకుంది. మహిళ ఇంటికి వెళ్లిన ఉద్యోగికి కొంతసేటికే సినిమా చూపించేశారు.

కిలాడీ లేడీ, హైకోర్టు ఉద్యోగి ఫోటోలు, వీడియోలు తీసి అతన్ని బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. హైకోర్టు ఉద్యోగి తెగించడంతో ఇద్దరు కిలాడీ లేడీలతో పాటు మొత్తం 10 మంది పోలీసులకు చిక్కిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

Girlfriend: గిరిష్మా మైండ్ గిర్రున తిరిగిపోయింది, తమిళనాడుకు కేసు బదిలి, ఎందుకంటే ?, కేరళలో!Girlfriend: గిరిష్మా మైండ్ గిర్రున తిరిగిపోయింది, తమిళనాడుకు కేసు బదిలి, ఎందుకంటే ?, కేరళలో!

హనీట్రాప్ ఫ్యాషన్ అయిపోయింది

హనీట్రాప్ ఫ్యాషన్ అయిపోయింది

శ్రీమంతులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు హనీట్రాప్ వలలో పడి ఇప్పటికే లబోదిబో అంటు కొట్టుకుంటున్నారు. ఇప్పటికే వ్యాపారులు, శ్రీమంతులు హనీట్రాప్ లో చిక్కుకుని లక్షలు, కోట్ల రూపాయలు సమర్పించుకున్నారు. కొందరు రాజకీయ నాయకులు మంత్రి పదవులు పొగొట్టుకుని అధికారానికి దూరం అయ్యారు.

హైకోర్టు ఉద్యోగికి గాలం

హైకోర్టు ఉద్యోగికి గాలం

కర్ణాటక హైకోర్టులో జైరామ్ అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం జైరామ్ కు అనురాధ అలియాస్ అను అలియాస్ రాధా (28) అనే యువతి పరిచయం అయ్యింది. అప్పటి నుంచి అనురాధ, జైరామ్ టచ్ లో ఉన్నారు. అప్పుడప్పుడు జైరామ్, అనురాధ ఫోన్లు చేసుకుని మాట్లాడుకుంటున్నారు.

నమ్మకంగా డ్రామాలు ఆడింది

నమ్మకంగా డ్రామాలు ఆడింది

ఆరు నెలల క్రితం హైకోర్టు దగ్గరకు వెళ్లిన అనురాధ జైరామ్ కు ఫోన్ చేసింది. ఇంట్లో టీవీ, ఫ్రిజ్ తో పాటు విలువైన వస్తువులు షార్ట్ సర్కూట్ కారణంగా కాలిపోయానని చెప్పి రూ. 10 వేలు తీసుకుంది. కొన్ని రోజులకే అనురాధ రూ. 10 వేలు తీసుకెళ్లి జైరామ్ కు ఇచ్చేసింది. కొంతకాలం తరువాత తనకు రూ. 5 వేలు కావాలని చెప్పింది.

బట్టలు తీసేస్తే స్వర్గం చూపిస్తానని చెప్పింది

బట్టలు తీసేస్తే స్వర్గం చూపిస్తానని చెప్పింది

పనిలో పనిగా నువ్వు మా ఇంటికి రావాలని, ఇంట్లో ఎవ్వరూ లేరని అనురాధ ఆమె ఫ్రెండ్ జైరామ్ కు చెప్పింది. కామాక్షిపాళ్య సమీపంలోని కావేరిపుర వార్డులోని రంగనాథపురంలోని అనురాధ ఇంటికి హైకోర్టు ఉద్యోగి జైరామ్ వెళ్లాడు. కొంతసేపు ఇద్దరూ కుర్చుని మాట్లాడుకున్నారు. తరువాత జైరామ్ కు బట్టలు తీసేయాలని, నీకు స్వర్గం చూపిస్తానని అనురాధ రెచ్చగొట్టిందని తెలిసింది.

వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

కొంతసేటికే అనురాధ ఇంటిలోకి కావ్య, సిద్ద తదితరులు వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసి నానా హంగామా చేశారు. అందులో ఓ వ్యక్తి నా భార్య అనురాధతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావా ? అంటూ రెచ్చిపోయాడు. నీ భార్య, పిల్లలను ఇక్కడికి పిలిపించి పంచాయితీ పెడుతామని, ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, అలా చెయ్యకూడదు అంటే రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దెబ్బకు స్కెచ్ రివర్స్

దెబ్బకు స్కెచ్ రివర్స్

తరువాత జైరామ్ ను చితకబాది అతని దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని రూ. 2 లక్షలు ఇవ్వకుంటా నీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి నీ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. జైరామ్ ధైర్యం చేసి కామాక్షిపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనురాధ, కావ్యా, సిద్దతో పాటు మొత్తం 10 మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. హైకోర్టు ఉద్యోగి హనీట్రాప్ లో చిక్కుకున్నాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Khiladi lady:10 people arrested for Karnataka High Court employee honeytrap case in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X