బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi lady: ఇంటిచుట్టూ తిప్పుకున్న లేడీ లీడర్, 55 మందికి కుచ్చుటోపి, రూ. 1.61 కోట్లు స్వాహా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ నాయకురాలి ముసుగులో పలువురు యువకులకు ఆమె కుచ్చుటోపీ పెట్టిందని ఆలస్యంగా వెలుగు చూసింది. విధానసౌధలో, హోం శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఐటీ హబ్ కు చెందిన యువకులకు మాయమాటలు చెప్పిన కిలాడీ లేడీ వారిని ఆమె వెంటతిప్పుకునింది. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆశతో ఆమె అడిగినప్పుడల్లా ఆ యువకులు అప్పులు చేసిమరీ ఆ నాయకురాలికి డబ్బులు ఇచ్చారు. ఈరోజు, రేపు అంటూ ఆమె వారిని ఆమె ఇంటి చట్టూ తిప్పించుకుంది. చివరికి కొన్ని నకిలీ పత్రాలు వేరి చేతిలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చేతులు దుపులుపోవడానికి ప్రయత్నించిందని ఆరోపణలు ఉన్నాయి.

ఉద్యోగం వచ్చిందని ఆనందంలో కొందరు విధానసౌధకు వెళ్లి అధికారులను కలిసి ఆ పత్రాలు చూపించారు. ఓరి పిచ్చోడా ఈ కాగితాలు నాలక గీచుకోవడానికి తప్పా దేనికీపనికిరావని అధికారులు చెప్పడంతో ఆ యువకులు షాక్ అయ్యారు. ఇప్పటికే కిలాడీ లేడీ రూ. కోట్ల రూపాయలు నిరుద్యోగుల నుంచి వసూలు చేసిందని వెలుగు చూడటంతో ఆ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారని తెలిసింది.

Illegal affair: ఇంట్లో భర్త శవం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసిన ఆంటీ, కామపిచాచి క్లోజ్!Illegal affair: ఇంట్లో భర్త శవం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసిన ఆంటీ, కామపిచాచి క్లోజ్!

బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు

బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు

ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని కుమారస్వామి లేఔట్ లో నివాసం ఉంటున్న మంజునాథ్ అనే వ్యక్తి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కేపీసీసీ ( కర్ణాటక కాంగ్రెస్ పార్టీ) కార్మిక శాఖ ఉపాధ్యక్షురాలు అంటూ రాధా ఉమేష్ అనే మహిళ కొందరు నిరుద్యోగులను పరిచయం చేసుకుంది.

విధాన సౌధాలో నాకు అందరూ తెలుసు

విధాన సౌధాలో నాకు అందరూ తెలుసు

విధాన సౌధా (కర్ణాటక అసెంబ్లీ)లోని చాలా మంది అధికారులు తనకు తెలుసని రాధా అనేక మంది నిరుద్యోగులకు చెప్పింది. మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనది అని వారికి హామీ ఇచ్చిందని సమాచారం. ఇదే సమయంలో కుమారస్వామి లేఔట్ లో నివాసం ఉంటున్న మంజునాథ్ అనే వ్యక్తికి విధాన సౌధాలో డైలీ లేబర్ కాంట్రాక్టు మీకు ఇప్పిస్తానని రాధా ఉమేష్ నమ్మించిందని సమాచారం.

అడ్వాన్స్ గా రూ. 15 లక్షలు

అడ్వాన్స్ గా రూ. 15 లక్షలు

విధాన సౌధాలో డైలీ లేబర్ కాంట్రాక్టు మీకు దక్కితే నెలనెల లక్షల రూపాయాలు మీరు సంపాధించుకోవచ్చని, మీరు లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రాధా ఉమేష్ మంజునాథ్ ను నమ్మించింది. కాంట్రాక్టు ఇప్పించడానికి తన దగ్గర రెండున్నర సంవత్సరాల క్రితం రాధా ఉమేష్ రూ. 15 లక్షలు నాలుగు కంతుల్లో అడ్వాన్స్ తీసుకుందని మంజునాథ్ ఆరోపిస్తున్నాడు.

నిరుద్యోగులకు కుచ్చుటోపీ

నిరుద్యోగులకు కుచ్చుటోపీ

కొంతకాలం తరువాత మీకు విధాన సౌధాలో కాంట్రాక్టు పని వద్దని, హోమ్ శాఖలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని శ్రీలేఖ, రాధా ఉమేష్ నమ్మించారని తెలిసింది. కర్ణాటక హోమ్ శాఖలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు హోమ్ గార్డుల ఉద్యోగాలను ఎలాంటి ఇంటర్వూలు లేకుండా ఇప్పిస్తానని రాధా ఉమేష్, శ్రీలేఖ, సంపత్ కుమార్ పలువురిని నమ్మించారని ఆరోపణలు ఉన్నాయి.

55 మందికి నామం...... రూ. 1. 61 కోట్లు స్వాహా?

55 మందికి నామం...... రూ. 1. 61 కోట్లు స్వాహా?

ప్రభుత్వ ఉద్యోగాల సంపాధించాలని ప్రయత్నిస్తున్న 55 మంది ఇప్పటి వరకు రాధా ఉమేష్, శ్రీలేఖ, సంపత్ కుమార్ కు రూ. 1. 61 కోట్లు విడతల వారిగా ఇచ్చారని సమాచారం. ఉద్యోగాలు ఈరోజు, రేపు వస్తాయి అంటూ రాధా ఉమేష్, శ్రీలేఖ వారిని ఇంటి చట్టూ తిప్పించుకుంది. నిరుద్యోగులకు కొన్ని నకిలీ పత్రాలు ఇచ్చిన ఈ ముగ్గురు తరువాత చేతులు దుపులుకున్నారని తెలిసింది.

ఓరి పిచ్చోడా దేనికీ పనికిరావు.....ఇంటికి పో

ఓరి పిచ్చోడా దేనికీ పనికిరావు.....ఇంటికి పో

ఉద్యోగం వచ్చిందని ఆనందంలో కొందరు సెప్టెంబర్ 22వ తేదీన విధానసౌధకు వెళ్లి అధికారులను కలిసి ఆ పత్రాలు చూపించారు. ఓరి పిచ్చోడా ఈ కాగితాలు నాలక గీచుకోవడానికి తప్పా దేనికీపనికిరావని అధికారులు చెప్పడంతో ఆ యువకులు షాక్ అయ్యారు. ఇప్పటికే కిలాడీ లేడీ రూ. కోట్ల రూపాయలు నిరుద్యోగుల నుంచి వసూలు చేసిందని వెలుగు చూడటంతో ఆ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారని తెలిసింది.

కిలాడీ లేడీ మీద చీటింగ్ కేసు

కిలాడీ లేడీ మీద చీటింగ్ కేసు

కుమారస్వామి లేఔట్ లో నివాసం ఉంటున్న మంజునాథ్ మేము మోసపోయామని విధాన సౌధా పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేపీసీసీ కార్మిక శాఖ ఉపాధ్యక్షురాలిగా చెప్పుకుని తిరుగుతున్న రాధా ఉమేష్, శ్రీలేఖ, సంపత్ కుమార్ ల మీద చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Khiladi lady: Rs 1.61 crore fraud to people in the name of Congress lady leader in Bengaluru city Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X