Khiladi: పూజా కన్ను పడితే ఫినిష్, కండలు తిరిగిన ఒళ్లు, ఎముక లేని నాలుక, 50 మందికి, గోవింద గోవింద!

బెంగళూరు: పేరు పూజా అలియాస్ గాడీ పూజా (బండి పూజా) అలియాస్ భగవతి పూజా. మేడమ్ పూజా కన్ను పడిందంటే ఎదుటి వాళ్లు ఫినిష్. జలదరించే మంచి కండలు తిరిగిన సైజులో ఉన్న పూజా ఆంటీ ఒంటి నిండా బంగారం నింపుకుని ఎదుటి వాళ్లను ఎముకలు లేని నాలుక తిప్పుతూ ఇట్లే ఆకట్టుకుంటుంది. తన మాయమాటలతో అమాయకులను వలలో వేసుకున్న ఖరీదైన విలాసవంతమైన కార్లు 50% తక్కువకు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పింది.

కిలాడీ పూజా మాయలో పడిన సుమారు 50 మందికి పైగా అమాయకులు ఆమెకు లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. గాడి పూజాను అరెస్టు చేసిన పోలీసులు 43 ఖరీదైన కార్లు సీజ్ చేశారు. ఇన్ని కార్లు ఇప్పిస్తానని మోసం చేసిన పూజా వ్యవహారం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

బెంగళూరు అంటే మాటలా ?

బెంగళూరు అంటే మాటలా ?

బెంగళూరులోని హెచ్ఏఎల్ సమీపంలో భగవతి పూజా అలియాస్ గాడీ పూజా ఆంటీ నివాసం ఉంటున్నది. మంచి మంచి సిల్క్ చీరలు, ఒంటి నిండా బంగారం పెట్టుకుని పూజా ఎదుటి వారిని పలకరిస్తోంది. పూజాను చూస్తే శ్రీమంతుల కుటంబానికి చెందినదని అందరూ అనుకుంటారు. అయితే పూజా స్కెచ్ లు భలే ఉంటాయి. చూడటానికి కండలు తిరిగిన పూజా ఆంటీ మంచి మాటకారి కూడా కావడంతో ఆమె స్కెచ్ లుకు ఎదురే లేకుండా పోయింది.

పర్చూర్ కార్లు.... సూపర్ స్కెచ్

పర్చూర్ కార్లు.... సూపర్ స్కెచ్

రెండు సంవత్సరాల క్రితం బెంగళూరులోని బాణసవాడిలోని జనరల్ మోటార్స్ షోరూమ్ కు వెళ్లిన పూజా అక్కడ సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్న అనంతరాజ్ తో పరిచయం పెంచుకుంది. పూజా ఆంటీ, అనంత్ రాజ్ కలిసి భలే స్కెచ్ వేశారు. షోరూమ్ లో కార్లు కొనుగోలు చేసే వాళ్లను టార్గెట్ చేసుకుని పర్చూర్ కార్లతో పాటు ఖరీదైన, విలాసవంతమైన కార్లు షోరూమ్ ధర కంటే అతి తక్కువ ధరకు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు.

పూజా ఆంటీ అకౌంట్ లో డబ్బులు

పూజా ఆంటీ అకౌంట్ లో డబ్బులు

పూజా, ఆనంత్ రాజ్ మాయమాటలు నమ్మిన అమాయకులు షోరూమ్ కంటే కొన్ని లక్షల రూపాయల తక్కువకు కార్లు వస్తున్నాయని గుడ్డిగా నమ్మేశారు. తరువాత పూజా అకౌంట్ కు డబ్బులు డిపాజిట్ చేశారు. పూజా తెలివితేటలతో ఆ కార్లు వారి పేర్లు మీద కొనుగోలు చేసి వేరే వాళ్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.

 పూజా ఆంటీ కలెక్షన్ క్వీన్

పూజా ఆంటీ కలెక్షన్ క్వీన్

పూజా ఆంటీ ఈ మొత్తం వ్యవహారం అంతా బెంగళూరులోని కొన్ని ఫేమస్ హోటల్స్ లో డీల్ చేసింది. ఈ గోల్ మాల్ వ్యవహారంపై ఓ ప్రైవేట్ షోరూమ్ కంపెనీ మేనేజర్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేసిన హెచ్ఏఎల్ పోలీసులు కిలాడీ పూజాను అరెస్టు చేశారు. మహమ్మద్ రఫీ అనే వ్యక్తికి పర్చూర్ కారు రూ. 4 లక్షల తక్కువకు ఇప్పిస్తామని నమ్మించి అతని నుంచి రూ. 12 లక్షల డీడీ తీసుకుని పంగనామాలు పెట్టారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

మేడమ్ దెబ్బకు 43 కార్లు సీజ్

మేడమ్ దెబ్బకు 43 కార్లు సీజ్

పూజా ఆంటీ అండ్ గ్యాంగ్ నగరంలో అనేక మందికి తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తామని ఇలాగే మోసం చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పూజా అండ్ టీమ్ ఇప్పటి వరకు రూ. 50 లక్షలకు పైగా ఇలా అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారని కేసులు నమోదైనాయని పోలీసులు అన్నారు. మేడమ్ పూజా మోసం చేసి గోల్ మాల్ చేసిన 43 ఖరీదైన కార్లును పోలీసులు సీజ్ చెయ్యడం కలకలం రేపింది.

పూజా దెబ్బకు మాయం

పూజా దెబ్బకు మాయం

పూజా అరెస్టు కావడంతో ఈ దందాలోని మిగిలిన నిందితులు, తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన నిందితులు ఎక్కడ పోలీసులు అరెస్టు చేస్తారో అనే భయంతో మాయం అయిపోయారని తెలిసింది. మొత్తం మీద కిలాడీ పూజా ఆంటీ దెబ్బకు ఇంకా ఎంత మంది భాదితులు బయటకు వస్తారో చూడాలి అంటున్నారు బెంగళూరు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+