khiladi: వెయిటింగ్ చార్జ్ ఇస్తే చాలు సార్, వెయిట్ చెయ్యకుండా జంప్, బ్యాగ్ లో లక్షల్లో డబ్బు, పత్రాలు!
ఆటో డ్రైవర్ ను నమ్మిన ప్రయాణికుడు బ్యాగ్ ఆటోలో వదిలి ఆసుపత్రిలోకి వెళ్లాడు. డాక్టర్ దగ్గర చూపించుకుని వచ్చి చూస్తే ఆటో డ్రైవర్ మాయం అయ్యాడు.
బెంగళూరు: ఆటోలో ఓ ప్రయాణికుడు ఎక్కాడు. ఆసుపత్రి దగ్గరకు వెళ్లిన ప్రయాణికుడు మీరు కొద్ది నిమిషాలు ఇక్కడే ఉంటే తాను మళ్లీ తిరిగి వస్తానని, తాను ఎక్కడ ఆట్ ఎక్కానో మళ్లీ అక్కడే దింపాల్సి వస్తుందని ఆటో డ్రైవర్ కు చెప్పాడు. అలాగే సార్ మీరు డాక్టర్ దగ్గర చూపించుకుని రండి నేను ఇక్కడే ఉంటాను, తనకు వెయిటింగ్ చార్జ్ ఇస్తే సరిపోతుందని ఆటో డ్రైవర్ చెప్పాడు.
ఆటో డ్రైవర్ ను నమ్మిన ప్రయాణికుడు బ్యాగ్ ఆటోలో వదిలి ఆసుపత్రిలోకి వెళ్లాడు. డాక్టర్ దగ్గర చూపించుకుని వచ్చి చూస్తే ఆటో డ్రైవర్ మాయం అయ్యాడు. బ్యాగ్ లో లక్షల రూపాయల నగదుతో పాటు విలువైన పత్రాలు ఉండటంతో ఆ ప్రయాణికుడు హడలిపోయాడు.

ఆసుపత్రికి వెళ్లిన ప్రయాణికుడు
డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. ఇటీవల సాయంత్రం గాంధీబజార్ నుంచి మల్లేశ్వర్‌లోని విజయ హోమియోపతి క్లినిక్‌కి రవి అనే వ్యక్తి ఓ ఆటోలో వెళ్లాడు. ఆ సందర్భంలో తాను క్లినిక్ లోకి వెళ్లి డాక్టర్ దగ్గర చూపించుకుని వస్తానని, తనను మళ్లీ గాంధీబజార్ లో డ్రాప్ చెయ్యాలని రవి ఆటో డ్రైవర్ కు చెప్పాడు. ఆటో డ్రైవర్ సరే సార్ నేను ఇక్కడే ఉంటానను అని రవికి చెప్పాడు.

ఆటో డ్రైవర్ మాయం
డాక్టర్ దగ్గర చూపించుకున్న రవి 20 నిమిషాల తరువాత వెళ్లి చూశాడు. రోడ్డు మీద ఎక్కడా ఆటో డ్రైవర్ కనపడలేదు. ఆటో లో వెనుక సీటులో ఉన్న బ్యాగ్ లో రూ. 2 లక్షల నగదుతో పాటు విలువైన పత్రాలు ఉండటంతో రవి హడలిపోయాడు. రవి చికిత్స చేసుకుని తిరిగి వచ్చేసరికి నిందితుడు ఆటో డ్రైవర్ బ్యాగుతో సహ పారిపోవడంతో రవికి గుండె ఆగిపోయినంత పని అయ్యింది, వెంటనే రవి మల్లేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సీసీటీవీ కెమెరాల్లో?
సమాచారం తెలుసుకున్న మల్లేశ్వరం పోలీసులు ఆయుర్వేదిక్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. త్యాగరాజ నగర్ లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ రంగస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు రంగస్వామి అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, ఆటో నడపటం ద్వారా వచ్చే ఆదాయం అప్పులు తీర్చడానికి సరిపోవడం లేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

డబ్బులు ఏం చేశాడంటే?
ప్రయాణికుడు రవి ఆసుపత్రిలోకి వెళ్లిన తరువాత అతని బ్యాగును ఆటో డ్రైవర్ రంస్వామి తనిఖీ చేయగా అందులో రూ. 2 లక్షలు డబ్బు ఉన్నట్లు గుర్తించాడు. డబ్బులు దొంగిలిస్తే అప్పులు తీర్చేయాలని అనుకున్న రంగస్వామి బ్యాగుతో సహ ఆటోలో పరారయ్యాడు.
చోరీ చేసిన 2 లక్షల్లో ఆటోరిక్షాల మరమ్మతులు, చిన్నపాటి రుణాలు చెల్లించారు. మిగిలిన .1. 50 లక్షలు రంగస్వామి ఇంట్లోనే దాచిపెట్టాడని పోలీసు అధకిధికారులు అన్నారు. బాధితుడు రవికి రూ. 1. 50 లక్ష అప్పగించిన పోలీసులు రంగస్వామిని విచారణ చేస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications