సిద్దూకు చెక్ పెట్టడానికి భలే స్కెచ్ వేసిన డీకేశీ ?, తెర మీదకు కొత్త సీఎం పేరు, ఆలౌట్!

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు ? అనే విషయంలో జోరుగా చర్చ జరుగుతున్నది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కావాలని మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే. శివకుమార్ ల మధ్య గట్టి పోటీ ఉంది.

సీఎం కుర్చి కోసం సిద్దరామయ్య, డీకే. శివకుమార్ పీకులాడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కర్ణాటకలో రాజకీయాలు తెలిసిన సామాన్యుడిని అడిగినా ఇదే మాట చెబుతున్నారు. అయితే తనకు సీఎం కుర్చి దక్కకపోతే సిద్దరామయ్యకు కూడా దక్కకూడదని డీకే. శివకుర్ పవర్ ఫుల్ స్కెచ్ వేశారని వెలుగు చూసిందని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

KPCC president DK Shivakumar is planning to make Mallikarjuna Kharge the CM of Karnataka ?

తనకు సీఎం కుర్చి దక్కకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేని ముఖ్యమంత్రి చెయ్యాలని డీకే. శివకుమార్ ఇప్పటి నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటున్నారు. దళితుడు. పైగా సీనియర్ అయిన మల్లికార్జున ఖార్గేని సీఎం చెయ్యాలని డీకే. శివకుమార్ పతిపాధిస్తే కాంగ్రెస్ పార్టీలో సిద్దరామయ్యతో పాటు అడ్డు చెప్పేవారు ఉండని డీకే. శివకుమార్ ఇలా స్కెచ్ వేశారని తెలిసింది.

అంతే కాకుండా లోకల్, నాన్ లోకల్ (జేడీఎస్ నుంచి వలస వచ్చిన సిద్దరామయ్య) నినాదంతో ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న వారిలో ఎవరికి సీఎం సీటు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని డీకే. శివకుమార్ ఆయన సన్నిహితుల దగ్గర చెబుతున్నారని తెలిసింది. మొత్తం మీద డీకే శివకుమార్ సిద్దరామయ్యకు సీఎం సీటు చిక్కకుండా ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు గుసగుసలాడుతున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+