Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ladies PG: లేడీస్ పీజీ యజమాని ఫ్రెండ్ ఏం చేశాడంటే ?, అమ్మాయిల బాత్ రూమ్ మీద కుర్చుని?

బెంగళూరు/చెన్నై: బెంగళూరులోని ఓ పీజీలో నివాసం ఉంటున్న అమ్మాయికి ఓ గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి ఆమె నగ్న ఫోటోలు షేర్ అయ్యాయి. ఆ అమ్మాయి ఆమె ఉంటున్న పీజీలోని బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలు కావడంతో ఆమె హడలిపోయింది.

ఆందోళనచెందిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పీజీ యజమానికి చాలా సన్నిహితుడిగా ఉన్న యువకుడు అరెస్టు కావడం కలకలం రేపింది. ఇప్పటికే ఆ లేడీస్ పీజీలోని చాలా మంది అమ్మాయిలను ఇలాగే బ్లాక్ మెయిల్ చేసిన కామాంధుడు అతని కోరికలు తీర్చుకున్నాడని వెలుగు చూడటంతో ఆ పీజీలో నివాసం ఉంటున్న అమ్మాయిలు హడలిపోయారు.

పీజీలో అమ్మాయిలు, అబ్బాయిలు

పీజీలో అమ్మాయిలు, అబ్బాయిలు

ఉద్యోగాలు చెయ్యడానికి ఇతర ప్రాంతాలకు వెలుతున్న అమ్మాయిలు వారి స్నేహితులతో కలిసి రూమ్ లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ హబ్ బెంగళూరు సిటీలో చాలా మంది అమ్మాయిలు పీజీల్లో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కువ మంది అమ్మాయిలు, అబ్బాయిలు ట్రాఫిక్ సమస్యలతో వారి ఆఫీసులకు దగ్గరగా ఉండే పీజీల్లోనే నివాసం ఉంటున్నారు.

పక్కపక్కనే లేడీస్ పీజీ, బాయ్స్ పీజీలు

పక్కపక్కనే లేడీస్ పీజీ, బాయ్స్ పీజీలు

బెంగళూరు సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ రోడ్డులోని బోమ్మనహళ్లిలో ఓ వ్యక్తి బాయ్స్ పీజీ, దాని పక్క భవనంలోనే లేడీస్ పీజీలు నడుపుతున్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి రెండు పీజీలు సొంతంగా నడుపుతున్నాడు. పుదుచ్చేరికి చెందిన నిరంజన్ అనే యువకుడు ఇతని బాయ్ పీజీలోకి నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాడు.

పీజీ యజమానికి దగ్గర అయ్యాడు

పీజీ యజమానికి దగ్గర అయ్యాడు

ఎలాంటి పనిపాట చెయ్యకుండా పీజీలో ఉంటున్న నిరంజన్ ప్రతిరోజు గాలికి తిరుగుతున్నాడు. పుదుచ్చేరిలో నివాసం ఉంటున్న కన్నతల్లి ప్రతినెల డబ్బులు పంపిస్తుండటంతో నిరంజన్ బెంగళూరులో జల్సా చేస్తున్నాడు. సంవత్సరం పాటు ప్రతినెల కరెక్ట్ గా పీజీ రెంట్ చెల్లించిన నిరంజన్ ఆ పీజీ యజమానికి దగ్గర అయ్యాడు.

లేడీస్ హాస్టల్ లోకి వెళ్లివస్తూ?

లేడీస్ హాస్టల్ లోకి వెళ్లివస్తూ?

తమిళ్, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, హిందీ మాట్లాడుతున్న నిరంజన్ పీజీ యజమాని లేని సమయంలో బాయ్స్ పీజీని చూసుకోవడం మొదలుపెట్టాడు. తరువాత లేడీస్ పీజీలో ఏమైనా పనులు ఉన్నా, టిఫిన్లు, భోజనాలు వడ్డించే సమయంలో సహాయం చెయ్యాలన్నా ఆ లేడీస్ పీజీలోకి నిరంజన్ వెళ్లి వస్తున్నాడు. ఇదే సందర్బంలో లేడీస్ పీజీలోని రిజిస్టర్ లో అమ్మాయిల ఫోన్ నెంబర్లు సేకరించాడు.

హడలిపోయిన యువతి

హడలిపోయిన యువతి

లేడీస్ పీజీ భవనంలో ప్రతి అంగులం నిరంజన్ గుర్తించాడు. ఇదే సమయంలో పక్కన ఉన్న బాయ్స్ పీజీ బిల్డింగ్ మీద నుంచి లేడీస్ పీజీ టెర్రాస్ మీదకు వెలుతున్న నిరంజన్ అమ్మాయిలు స్నానం చేస్తున్న సమయంలో సీక్రేట్ గా ఫోటోలు, వీడియోలు తీశాడు. లేడీస్ పీజీలో ఉన్న చాలా మంది అమ్మాయిలు స్నానం చేస్తున్న సమయంలో నిరంజన్ అతని మొబైల్ ఫోన్ లో వీడియోలు తీశాడు.

కామాంధుడు అందర్

కామాంధుడు అందర్

బెంగళూరులోని బోమ్మనహళ్లిలోని పీజీలో నివాసం ఉంటున్న అమ్మాయికి నిరంజన్ టెక్నాలజీ ఉపయోగించి అతని ఫోన్ నెంబర్ గుర్తించడానికి అవకాశం లేకుండా ఆమె ఫోన్ నెంబర్ నుంచి ఆమె నగ్న ఫోటోలు షేర్ చేశాడు. తాను నివాసం ఉంటున్న పీజీలోని బాత్ రూమ్ లో తాను స్నానం చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలు అని గుర్తించిన ఆమె హడలిపోయింది. ఆందోళనచెందిన ఆ యువతి వెంటనే బోమ్మనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నలుగురు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి?

నలుగురు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి?

పోలీసులు లోతుగా విచారణ చేశారు. లేడీస్ పీజీ యజమానికి చాలా సన్నిహితుడిగా ఉన్న నిరంజన్ ను పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. ఇప్పటికే ఆ లేడీస్ పీజీలోని చాలా మంది అమ్మాయిలను ఇలాగే బ్లాక్ మెయిల్ చేసిన కామాంధుడు నిరంజన్ నలుగురు యువతులను బెదిరించి లొంగ దీసుకుని వారితో శారీరకంగా అతని కోరికలు తీర్చుకున్నాడని వెలుగు చూడటంతో ఆ పీజీలో నివాసం ఉంటున్న అమ్మాయిలు హడలిపోయారు. నిరంజన్ ను అరెస్టు చేసి అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని బోమ్మనహళ్లి పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+