Woman: సీక్రేట్ గా భారత్ లోకి పాకిస్తాన్ మహిళ ఎంట్రీ, ముగ్గురు పిల్లలు, షరతులతో లేడీకి బెయిల్!
బెంగళూరు/ భత్కల్: పాస్ పోర్టు లేకుండా భారత్ కు చేరుకున్న పాకిస్తాన్ మహిళ ఓ వ్యక్తిని వివాహం చేసుకుని కాపురం చేసింది. ముగ్గురు పిల్లలు పుట్టే వరకు, పోలీసులు ఎంట్రీ ఇచ్చే వరకు ఆమె పాకిస్తాన్ మహిళ అని స్థానికులకు ఏమాత్రం తెలీదు. పాకిస్తాన్ మహిళతో కలిసి కాపురం చేస్తున్న భర్త కూడా ఆమె పక్క రాష్ట్రానికి చెందినదని అందరిని నమ్మించాడు. అయితే ఇంటిలిజెన్స్ వర్గాలకు పాకిస్తాన్ మహిళ గురించి తెలిసింది. పాకిస్తాన్ మహిళను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇటీవల పాకిస్తాన్ మహిళ భర్త చనిపోయాడు. కోర్టు పాకిస్తాన్ మహిళకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

పాకిస్తాన్ పౌరసత్వం
కర్ణాటకలోని భత్కల్ లో నివాసం ఉంటున్న దంపతులకు ఖతిజా మెహరీన్ రుక్కుద్దీన్ అలియాస్ ఖతీజ అనే అమ్మాయి పుట్టింది. చాలా సంవత్సరాల క్రితం ఖతిజ ఆమె తల్లిదండ్రులతో కలసి పాకిస్తాన్ వెళ్లిపోయింది. పాకిస్తాన్ వెళ్లిపోయిన ఖతిజ ఆ దేశం పౌరసత్వం తీసుకుని అక్కడే పెరిగి పెద్దది అయ్యింది. ఖతీజ పాకిస్తాన్ మహిళ అయ్యింది.

భత్కల్ లో కాపురం
భత్కల్ లోని నవాయ్ కాలనీలో జావెద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. జావెద్ కొన్ని సంవత్సరాలు సౌదీలో పని చేశాడు. అదే సమయంలో ఖతిజ కూడా సౌదీలో పని చేసింది. ఆ సందర్బంలో ప్రేమించుకున్న జావెద్, ఖతిజ వివాహం చేసుకున్నారు. 2015లో పాస్ పోర్టు లేకుండా పాకిస్తాన్ మహిళ ఖతిజ నేపాల్ మీదుగా భారత్ కు చేరుకుని భత్కల్ కు వచ్చి ఆమె భర్త జావెద్ తో కాపురం పెట్టింది.

మ్యాటర్ లీక్ కాలేదు
జావెద్ ను వివాహం చేసుకున్న ఖతిజ భత్కల్ లో అతనితో గుట్టుచప్పుడు కాకుండా కాపురం చేసింది. ముగ్గురు పిల్లలు పుట్టే వరకు, పోలీసులు ఎంట్రీ ఇచ్చే వరకు ఖతీజ పాకిస్తాన్ మహిళ అని స్థానికులకు ఏమాత్రం తెలీదు. పాకిస్తాన్ మహిళ ఖతీజతో కలిసి కాపురం చేస్తున్న ఆమె భర్త జావెద్ కూడా ఆమె మహారాష్ట్రకు చెందిన మహిళ అని అందరిని నమ్మించాడు.

జైలుకు కంపించిన పోలీసులు
గత సంవత్సరం ఇంటిలిజెన్స్ వర్గాలకు పాకిస్తాన్ మహిళ ఖతీజ గురించి తెలిసింది. గత ఏడాది జూన్ లో భత్కల్ లో పాకిస్తాన్ మహిళ ఖతీజను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటి నుంచి ఖతీజ కారవార జైలులో ఉంటున్నది. బెయిల్ తీసుకుని బయటకు రావాలని ఖతీజ అనేక ప్రయత్నాలు చేసింది.

షరతులు...... అక్కడే కాపురం ఉండాలి
ఇటీవల పాకిస్తాన్ మహిళ ఖతీజ భర్త జావెద్ గుండెపోటుతో చనిపోయాడు. కోర్టు పాకిస్తాన్ మహిళ ఖతీజ షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న చోటే ఖతీజ కాపురం ఉండాలని, పోలీసుల అనుమతి లేకుండా అక్కడి నుంచి బయటకు వెళ్లకూడదని, లిఖితపూర్వకంగా షరతులు అంగీకరించాలని, రూ. 1 లక్ష బాండ్ పూచీకత్తు సమర్పించాలని ధారవాడ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఖతీజకు బెయిల్ మంజూరు చేసింది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications