Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady leader: మాజీ కార్పోరేటర్ ఐశ్వర్య భర్త మిస్సింగ్, మదనపల్లె రోడ్డులో ?, ఫ్యాంట్ బెల్డ్, కారులో రక్తం!

బెంగళూరు/హోస్ కోటే/మదనపల్లె: వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. రియల్ వ్యాపారి భార్య మాజీ కార్పోరేటర్. ఐటీ హబ్ మాజీ కార్పోరేటర్ భర్తగా, స్థానికంగా మాస్ లీడర్ గా అతనికి మంచి గుర్తింపు ఉంది. బెంగళూరు-మదనపల్లె రోడ్డులో లేడీ లీడర్ భర్తకు కోట్ల రుపాయల విలువ చేసే భూములు ఉన్నాయి. కారు చిన్న రిపేర్ ఉందని, కారు రిపేర్ చేయించుకుని తన స్నేహితుడి దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకుని అలాగే మన భూముల దగ్గరకు వెళ్లి చూసుకుని వస్తానని లేడీ లీడర్ కు చెప్పిన ఆమె భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లిన అతను అడ్రస్ లేకుండా పోయాడు. లేడీ లీడర్ తమ్ముడు వెళ్లి పరిశీలించగా రోడ్డు పక్కన నిర్జనప్రదేశంలో బావ కారు పంచర్ అయ్యి నిలబెట్టి ఉన్న విషయం గుర్తించాడు. కారు డోర్ లకు రక్తపు మరకలు ఉండటం, సమీపంలోని గుడి దగ్గర లేడీ లీడర్ భర్త చెప్పులు, అతని ప్యాంట్ బెల్డ్ పడిఉండటం చూపి హడలిపోయారు.

అయినా మాజీ కార్పోరేటర్ భర్త ఆచూకి చిక్కకపోవడంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. పోలీసు జాగిలాలు, వేలిముద్రల నిపుణులు రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. లేడీ లీడర్ భర్త కోసం ఎంత వెతుకుతున్నా అతని ఆచూకి కాని, అతని శవం కాని చిక్కకపోవడం కలకలం రేపుతోంది.

బెంగళూరులో మాజీ కార్పోరేటర్

బెంగళూరులో మాజీ కార్పోరేటర్

ఐటీ హబ్ బెంగళూరు సిటీలోని బిన్నీపేట్ లో జేడీఎస్ లేడీ లీడర్, మాజీ కార్పోరేటర్ ఐశ్వర్య నాగరాజ్ అలియాస్ ఐశ్వర్య నివాసం ఉంటున్నారు. జేడీఎస్ పార్టీ నాయకురాలిగా, మాజీ కార్పోరేటర్ గా ఐశ్వర్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఐశ్వర్య భర్త లోహిత్ అలియాస్ లోహి అన్న కూడా మాస్ లీడర్ గా ఆ ప్రాంతంలో మంచి గుర్తింపె తెచ్చుకున్నాడు.

లేడీ లీడర్ ఐశ్వర్య భర్త మాస్ లీడర్

లేడీ లీడర్ ఐశ్వర్య భర్త మాస్ లీడర్

మాజీ కార్పోరేటర్ ఐశ్వర్య భర్త లోహిత్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. రియల్ వ్యాపారి భార్య ఐశ్వర్య మాజీ కార్పోరేటర్ కావడంతో వాళ్లకు వ్యాపారం కలిసి వచ్చింది. ఐటీ హబ్ మాజీ కార్పోరేటర్ ఐశ్వర్య భర్త గా, స్థానికంగా మాస్ లీడర్ గా లోహిత్ కు మంచి గుర్తింపుతో పాటు పలుకుబడి కూడా బాగానే ఉంది.

మదనపల్లె రోడ్డులో కోట్ల విలువైన ఆస్తులు

మదనపల్లె రోడ్డులో కోట్ల విలువైన ఆస్తులు

బెంగళూరు-మదనపల్లె రోడ్డులో (చింతామణి రోడ్డు(లో లేడీ లీడర్ ఐశ్వర్య భర్త లోహిత్ కు కోట్ల రుపాయల విలువ చేసే భూములు ఉన్నాయి. మార్చి 29వ తేదీన కారు చిన్న రిపేర్ ఉందని, కారు రిపేర్ చేయించుకుని కేఆర్ పురంలోని తన స్నేహితుడి దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకుని అలాగే చింతామణి రోడ్డులో ఉన్న మన భూముల దగ్గరకు వెళ్లి చూసుకుని వస్తానని లేడీ లీడర్ ఐశ్వర్యకు చెప్పిన లోహిత్ బెంగళూరులోని బిన్నీపేట్ లోని అతని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

హడలిపోయిన కుటుంబ సభ్యులు

హడలిపోయిన కుటుంబ సభ్యులు

రాత్రి అయినా లోహిత్ ఇంటికి రాకపోవడం, అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతని భార్య, జేడీఎస్ పార్టీ నాయకురాలు ఐశ్వర్య ఆందోళనకు గురైయ్యింది. వెంటనే లోహిత్ స్నేహితులు, బంధువులు, తెలిసినవాళ్లు అందరికి ఫోన్లో చేసి ఆరా తీసినా ఫలితం లేకుండాపోయింది. చివరికి ఐశ్వర్య ఆమె తమ్ముడు అభికి ఫోన్ చేసి చింతామణి రోడ్డులోని భూముల దగ్గరకు వెళ్లి చూసి రావాలని చెప్పింది.

కారు ఉంది కాని.... మనిషి మాయం

కారు ఉంది కాని.... మనిషి మాయం

చింతామణి రోడ్డులోని లోహిత్ భూములు ఉన్న ప్రాంతంలో సమీపంలో అతని కారు నిలిపి ఉంది. కారు పంచర్ కావడంతో వెనుక టైర్ విప్పి ఉండటం. స్టెప్నీ టైర్ బయటకు తీసి ఉండటాన్ని అభి గుర్తించాడు. అయితే కారు డోర్లకు రక్తపు మరకలు ఉండటం. లోహిత్ చెప్పులు, అతని ఫ్యాంట్ కు వేసుకున్న బెల్ట్ సమీపంలోని గుడి దగ్గర పడిఉండటంతో అభి హడలిపోయి వెంటనే నందగుడి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

లేడీ లీడర్ భర్త అడ్రస్ లేడు

లేడీ లీడర్ భర్త అడ్రస్ లేడు

బెంగళూరు మాజీ కార్పోరేటర్ ఐశ్వర్య భర్త లోహిత్ ఆచూకి చిక్కకపోవడంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. పోలీసు జాగిలాలు, వేలిముద్రల నిపుణులు రంగంలోకి దిగి కారు పార్క్ చేసిన ప్రాంతంలో, చెప్పులు, బెల్ట్ చిక్కిన ప్రాంతంలో ఆధారాలు సేకరించారు. జేడీఎస్ పార్టీ లేడీ లీడర్ ఐశ్వర్య భర్త లోహిత్ కోసం ఎంత వెతుకుతున్నా అతని ఆచూకి కాని, అతని శవం కాని చిక్కకపోవడం కలకలం రేపుతోంది.

 డబ్బులు తీసుకుని వెళ్లాడు.... కాని?

డబ్బులు తీసుకుని వెళ్లాడు.... కాని?

ఆ రోజు లోహిత్ కేఆర్ పురంలోని స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. మొత్తం మీద రాజకీయ నాయకురాలు ఐశ్వర్య భర్త, వ్యాపారి లోహిత్ వారం రోజుల నుంచి మాయం కావడం ఇప్పుడు బెంగళూరు నగరంలో, హోసకోటేలో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+