Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady officer: జస్ట్ రూ. 5 లక్షల లంచం అడ్వాన్స్, రాజుతో లక్షల్లో డీల్, మేడమ్ వర్షా అందర్ !

బెంగళూరు: బెంగళూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. వ్యవసాయ భూములనుప చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. భూముల ఖాతాలు మార్చిన తరువాత కమర్షియల్ కట్టడాలు అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్నారు. ఓ వ్యక్తి అతను కొనుగోలు చేసిన వ్యవసాయ భూములు ఖాతాలలో పేరు మార్చుకోవడానికి తహసిల్దార్ ను సంప్రధించాడు. మీకు చెందిన భూములకు కోట్ల రూపాయల విలువ ఉంది, ఎకరాకు రూ. 10 లక్షలు లంచం ఇస్తే మీ ఖాతాల పేర్లు మార్చుతామని తహసిల్దార్ డిమాండ్ చేశారు. అడ్వాన్స్ గా రూ. 5 లక్షలు లంచం తీసుకుంటున్న లేడీ తహసిల్దార్ ను లోకాయుక్త పోలీసులు వలపన్ని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

బెంగళూరులో భూములకు రెక్కలు

బెంగళూరులో భూములకు రెక్కలు

బెంగళూరు నగరంలో ఇంటి స్థలం కొనుగోలు చెయ్యాలంటే కనీసం రూ. 60 లక్షలకు పైగా ఉంది. బెంగళూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల ధరలు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. వ్యవసాయ భూములను చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. భూముల ఖాతాలు మార్చిన తరువాత కమర్షియల్ కట్టడాలు అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్నారు.

రెండు ఎకరాల భూమి

రెండు ఎకరాల భూమి

బెంగళూరు ఉత్తర తాలుకాలోని దాసపుర సమీపంలోని కంగేనహళ్లి గ్రామంలో లలిత్ కుమార్ అనే వ్యక్తికి రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. లలిత్ కుమార్ కు చెందిన భూములను కాంతరాజు అనే వ్యక్తి ఇటీవల కొనుగోలు చేశాడు. లలిత్ కుమార్ పేరుతో ఉన్న భూముల ఖాతాలను కాంతరాజు అతని పేరుతో మార్చుకోవాలని బెంగళూరు ఉత్తర తాలుకా ప్రత్యేక తహసిల్దార్ వర్షా ఒడయార్ ను సంప్రధించాడు.

రూ. 20 లక్షలు లంచం డిమాండ్ !

రూ. 20 లక్షలు లంచం డిమాండ్ !

లేడీ తహసిల్దార్ వర్షా ఒడయార్ కాంతరాజ్ కొనుగోలు చేసిన భూముల ధరలు ఎలా ఉన్నాయి అంటూ ఆమె కిందిస్థాయి ఉద్యోగుల దగ్గర ఆరా తీయించారు. మీరు కొనుగోలు చేసిన భూములకు కోట్ల రూపాయల విలువ ఉంది, ఎకరాకు రూ. 10 లక్షలు లంచం ఇస్తే మీ ఖాతాల పేర్లు మార్చుతామని లేడీ తహసిల్దార్ వర్షా ఒడయార్ భూములు కొనుగోలు చేసిన కాంతరాజ్ ను డిమాండ్ చేశారు.

ఆసుపత్రి దగ్గర రూ. 5 లక్షల లంచం అడ్వాన్స్

ఆసుపత్రి దగ్గర రూ. 5 లక్షల లంచం అడ్వాన్స్

రూ. లక్షల్లో లంచం డిమాండ్ చెయ్యడంతో కాంతరాజు బెంగళూరు లోకాయుక్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బెంగళూరులోని మారథాస్ ఆసుపత్రి కారు పార్కింగ్ స్థలంలో కాంతరాజు నుంచి లేడీ తహసిల్దార్ మధ్యవర్తి రమేష్ రూ. 5 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త పోలీసులు పట్టుకున్నారు.

వర్షా మేడమ్ అరెస్టు

వర్షా మేడమ్ అరెస్టు

రూ. 5 లక్షల లంచం లేడీ తహసిల్దార్ వర్షా ఒడయార్ తీసుకోమంటే తాను తీసుకున్నానని రమేష్ లోకాయుక్త అధికారులకు చెప్పారు. నేరుగా కందాయ భవన్ లోని బెంగళూరు ఉత్తర తాలుకా తహసిల్దార్ కార్యాలయం చేరుకున్న కాంతరాజు మేడమ్ వర్షా ఒడయార్ తో మాట్లాడి మేడమ్ రమేష్ కు రూ. 5 లక్షలు ఇచ్చానని చెప్పాడు. మేడమ్ ఓకే అని చెప్పడంతో అక్కడే ఉన్న లోకాయుక్త పోలీసులు లేడీ తహసిల్దార్ వర్షా ఒడయార్ ను అరెస్టు చేశారు. బెంగళూరులో లేడీ తహసిల్దార్ అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్మింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+