Lady police: ఇన్స్ పెక్టర్ మీద రేప్ కేసు పెట్టిన లేడీ పోలీసు, పెళ్లి పేరుతో సర్వం స్వాహా ?, ఎస్కేప్!

బెంగళూరు: పోలీసు శాఖలో ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇంటిలిజెన్స్ విభాగానికి బదిలి అయ్యాడు. లేడీ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న యువతి ఇన్స్ పెక్టర్ కు పరిచయం అయ్యింది. ఇద్దరూ పోలీసు శాఖలోనే ఉద్యోగాలు చేస్తుండటంతో టచ్ లో ఉన్నారు. ఇదే సమయంలో ఇన్స్ పెక్టర్ లేడీ కానీస్టేబుల్ అందం చూసి ఆమెకు వల వేశాడు. పై ఉద్యోగి తనకు దగ్గర అవుతున్నాడని, తనకు మంచి జరుగుతుందని ఆ లేడీ పోలీసు కూడా అయనకు దగ్గర అయ్యింది. వివాహం చేసుకుంటానని నమ్మించిన ఇన్స్ పెక్టర్ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని సమాచారం.

ఐటీ హబ్ లో అద్దె ఇంటిని తీసుకుని ఆమెతో కలిసి ఉంటూ ఎంజాయ్ చేశాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే తనను చంపేస్తానని రివాల్వర్ తో బెదిరిస్తున్నాడని లేడీ పోలీసు ఇన్స్ పెక్టర్ ప్రియుడి మీద కేసు పెట్టడం కలకలం రేపింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన మీద పదేపదే అత్యాచారం చేశాడని, తనతో బలవంతంగా అబార్షన్ చేయించాడని లేడీ పోలీసు ఇన్స్ పెక్టర్ ప్రియుడి మీద కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో రసికరాజు ఇన్స్ పెక్టర్ పరారుకావడం పోలీసు శాఖలో హాట్ టాపిక్ అయ్యింది.

ఐటీ హబ్ లో ఇన్స్ పెక్టర్

ఐటీ హబ్ లో ఇన్స్ పెక్టర్

కర్ణాటక పోలీసు శాఖలో ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్న మదుసూధన్ అనే వ్యక్తి ఇంటిలిజెన్స్ విభాగానికి బదిలి అయ్యాడు. బెంగళూరులోనే విధులు నిర్వహిస్తున్న ఇన్స్ పెక్టర్ మదుసూధన్ కు లేడీ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న యువతికి 2017లో పరిచయం అయ్యిందని సమాచారం. ఇద్దరూ పోలీసు శాఖలోనే ఉద్యోగాలు చేస్తుండటంతో టచ్ లో ఉన్నారు.

అందంగా ఉన్న లేడీ పోలీసుకు వల?

అందంగా ఉన్న లేడీ పోలీసుకు వల?

ఇదే సమయంలో ఇన్స్ పెక్టర్ మదుసూధన్ ఆ లేడీ కానీస్టేబుల్ అందం చూసి ఆమెకు వల వేశాడు. పై ఉద్యోగి మదుసూధన్ తనకు దగ్గర అవుతున్నాడని, తనకు మంచి జరుగుతుందని ఆ లేడీ పోలీసు కూడా అయనకు దగ్గర అయ్యింది. అప్పటి నుంచి ఇన్స్ పెక్టర్ మదుసూధన్, ఆ లేడీ పోలీసు కలిసి తిరుగుతున్నారని సాటి ఉద్యోగులు కొందరు అంటున్నారు.

ప్రియుడితో ఒకే ఇంట్లో కాపురం

ప్రియుడితో ఒకే ఇంట్లో కాపురం

వివాహం చేసుకుంటానని నమ్మించిన ఇన్స్ పెక్టర్ మదుసూధన్ లేడీ పోలీసుతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని సమాచారం. ఐటీ హబ్ బెంగళూరులోని మూడళపాళ్యలో అద్దె ఇంటిని తీసుకుని ఆమెతో కలిసి ఉంటూ ఎంజాయ్ చేశాడని తెలిసింది. చాలాకాలం నుంచి ఇన్స్ పెక్టర్ మదుసూధన్, ఆ లేడీ పోలీసు అక్కడే కలిసి ఉంటున్నారని సమాచారం.

సీఐ ప్రియుడి మీద కేసు పెట్టిన లేడీ పోలీసు

సీఐ ప్రియుడి మీద కేసు పెట్టిన లేడీ పోలీసు

ఇటీవల తనను పెళ్లి చేసుకోవలని లేడీ పోలీసు ఇన్స్ పెక్టర్ మదుసూధన్ మీద ఒత్తిడి చెయ్యడంతో అతను తప్పించుకుని తిరగడం మొదలు పెట్టాడని తెలిసింది. పెళ్లి చేసుకోవాలని తాను ఒత్తిడి చేస్తే తనను చంపేస్తానని ఇన్స్ పెక్టర్ మదుసూధన్ రివాల్వర్ తో బెదిరిస్తున్నాడని లేడీ పోలీసు ఇన్స్ పెక్టర్ ప్రియుడి మీద బెంగళూరులోని గోవిందరాజ నగర పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం కలకలం రేపింది.

లేడీ పోలీసు దెబ్బతో సీఐ ఎస్కేప్?

లేడీ పోలీసు దెబ్బతో సీఐ ఎస్కేప్?

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన మీద పదేపదే అత్యాచారం చేశాడని, 2019లో తనను కారులో చిక్కబళ్లాపురం పిలుచుకుని వెళ్లితనతో బలవంతంగా అబార్షన్ చేయించాడని లేడీ పోలీసు ఇన్స్ పెక్టర్ ప్రియుడు మదుసూదన్ మీద కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో రసికరాజు ఇన్స్ పెక్టర్ మదుసూధన్ పరారుకావడం పోలీసు శాఖలో హాట్ టాపిక్ అయ్యింది.

ఇంటెలిజెన్స్ ఇన్స్ పెక్టర్ మదుసూధన్ మీద కేసు నమోదు అయ్యిందని, కేసు విచారణలో ఉందని బెంగళూరు సిటీ పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+