Lady techie: పెళైన ఏడాదికే స్టోర్ రూమ్ లో శవమైన లేడీ టెక్కీ, ఆఫీసు ఒత్తిడి అని భర్త, అయితే!

బెంగళూరు/చిక్కబళ్లాపురం: యువకుడు ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. యువతి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. ఒకే జిల్లాకు చెందిన వారు కావడం, ఒకే కులం వారు కావడంతో యువతి, యువకుడికి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. 9 నెలల క్రితం ఇద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. వివాహం చేసుకున్న యువతి భర్త ఇంటికి వెళ్లింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఇంట్లో ఉంటూనే భార్య ఉద్యోగం చేస్తున్నది. భర్త మాత్రం ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. దంపతులతో పాటు యువకుడి తల్లిదండ్రులు ఒకే ఇంట్లోనే నివాసం ఉంటున్నారు.

వివాహం జరిగి సంవత్సరం కాకుండా లేడీ టెక్కి ఆమె నివాసం ఉంటున్న ఇంటి మూడో అంతస్తులోని స్టోర్ రూమ్ లో ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న లేడీ టెక్కీ కుటుంబ సభ్యులు, బంధువులు సహనం కోల్పోయి ఆమె భర్తను పట్టుకుని చితకబాదేశారు. వేలరూపాయల జీతం తీసుకు వెళ్లి అత్తకు ఇస్తోందని, అయినా లేడీ టెక్కీని ఆమె అత్తమామలు, భర్త ఇంటి పనిమనిషి లాగానే చూశారని, కట్నం తీసుకురావాలని వేదింపులకు గురి చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆఫీసు పని ఒత్తిడితో లేడీ టెక్కీ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివాహం జరిగి సంవత్సరం కాకుండా లేడీ టెక్కీ భర్త ఇంట్లో శవమై కనిపించడం కలకం రేపింది.

ఒకే జిల్లా.... మంచి ఉద్యోగాలు

ఒకే జిల్లా.... మంచి ఉద్యోగాలు

కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలోని ప్రశాంత్ నగర్ లో చేతన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చిక్కబళ్లాపురంలోని బాగేపల్లి తాలుకాలోని అడ్లవారిపల్లి (ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా సరిహద్దు)లో నవ్యా (23) అనే యవతి నివాసం ఉంటున్నది. చేతన్ ప్రవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. నవ్యా బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నది.

పెళ్లి చేసిన పెద్దలు

పెళ్లి చేసిన పెద్దలు

నవ్యా, చేతన్ ఇద్దరూ చిక్కబళ్లాపురం జిల్లాకు చెందిన వారు కావడం, ఒకే కులం వారు కావడంతో యువతి, యువకుడికి పెళ్లి చెయ్యాలని ఇరు కుటుంబ సభ్యుల పెద్దలు, బంధువులు నిర్ణయించారు. 9 నెలల క్రితం నవ్యా, చేతన్ ల వివాహం గ్రాండ్ గా జరిగింది. చేతన్ ను వివాహం చేసుకున్న నవ్యా చిక్కబళ్లాపురంలోని ప్రశాంత్ నగర్ లోని అత్తారింటికి వెళ్లింది.

స్టోర్ రూమ్ లో శవమైన లేడీ టెక్కీ

స్టోర్ రూమ్ లో శవమైన లేడీ టెక్కీ

వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఇంట్లో ఉంటూనే నవ్యా ఉద్యోగం చేస్తున్నది. నవ్యా భర్త చేతన్ మాత్రం ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. చేతన్, నవ్యా దంపతులతో పాటు యువకుడి తల్లిదండ్రులు చిక్కబళ్లాపురంలోనే ఒకే ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. వివాహం జరిగి సంవత్సరం కాకుండా లేడీ టెక్కి నవ్యా ఆమె నివాసం ఉంటున్న ఇంటి మూడో అంతస్తులోని స్టోర్ రూమ్ లో ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది.

కట్నం కోసం టార్చర్ పెట్టారు

కట్నం కోసం టార్చర్ పెట్టారు

విషయం తెలుసుకున్న లేడీ టెక్కీ నవ్యా కుటుంబ సభ్యులు, బంధువులు సహనం కోల్పోయి ఆమె భర్త చేతన్ ను పట్టుకుని చితకబాదేశారు. నవ్యా ప్రతినెల వేలరూపాయల జీతం తీసుకు వెళ్లి అత్తకు ఇస్తోందని, అయినా లేడీ టెక్కీని ఆమె అత్తమామలు, భర్త చేతన్ పెళ్లి జరిగినప్పటి నుంచి ఇంటి పనిమనిషి లాగానే చూశారని, కట్నం తీసుకురావాలని వేదింపులకు గురి చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించి పోలీసు కేసు పెట్టారు.

ఆఫీసు ఒత్తిడి అంటున్న భర్త

ఆఫీసు ఒత్తిడి అంటున్న భర్త

తన భార్య నవ్యా చాల మంచిదని, ఆమె ఇంట్లో అడుగు పెట్టిన తరువాత మా కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషంగా ఉంటున్నారని, ఆఫీసు పని ఒత్తిడితో నా భార్య ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆమె భర్త చేతన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.

నవ్యా శవమైన రెండు రోజుల క్రితం తనకు ఫోన్ చేసి అత్తారింటిలో టార్చర్ ఎక్కువ అయ్యిందని చెప్పిందని ఆమె తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వివాహం జరిగి సంవత్సరం కాకుండా లేడీ టెక్కీ నవ్యా భర్త ఇంట్లో శవమై కనిపించడం కలకం రేపింది. పోలీసుల విచారణలో నవ్యా చావుకు అసలు కారణం ఏమిటి ? అనే విషయం వెలుగు చూడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+