బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Leader: మిషన్ గన్ తో వార్నింగ్, లీడర్ ఇంట్లో రూ. 25 లక్షలు, 1 కేజీ నగలు, ఆంధ్రా బార్డర్ లో, ఐటీ అని !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/కోలారు: ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడు వ్యాపారాలు చేస్తున్నాడు. రాజకీయాల్లో ఉన్న పరిచయాలతో ఆయన వ్యాపారాలు జోరుగా చేస్తున్నాడు. ఖరీదైన కార్లు, బంగారు, భూములు కొనుగోలు చేస్తున్న ఆ రాజకీయ నాయకుడు నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. సంపాధిస్తున్న ఆస్తులకు ఆ రాజకీయ నాయకుడు సక్రమంగా ఆదాయపన్ను చెల్లించడం లేదని, ఏదో కొంచెం ఆదాయపన్ను చెల్లిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యులు విలాసవంతమైన కార్లలో తిరుగుతూ ఖరీదైన దుస్తులు వేసుకుంటూ శరీరం మీద భారీ మొత్తంలో బంగారు నగలు వేసుకుంటున్నారని తెలిసింది. రాత్రి పొద్దుపోయిన తరువాత ఆ రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్లిన కొందరు మేము ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి వస్తున్నామని, మీరు సక్రమంగా ఆదాయపన్ను చెల్లించడం లేదని మాకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.

ఆ రాజకీయ నాయకుడు ఎవరికో ఫోన్లు చెయ్యడానికి ప్రయత్నించడంతో మిషన్ గన్ తో బెదిరించిన నిందితులు రాజకీయ నాయకుడు, ఆయన భార్య, పిల్లలను ఒక రూమ్ పెట్టి లాక్ చేశారు. బీరువాలో ఉన్న రూ. 50 లక్షల విలువైన 1 కేజీకి పైగా ఉన్న బంగారు నగలు, రూ. 25 లక్షల క్యాష్ లూటీ చేసి అక్కడి నుంచి వారు వెళ్లిన కార్లలోనే పరారైనారు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులో మిషన్ గన్ పెట్టుకుని ఓ రాజకీయ నాయకుడి ఇల్లు లూటీ చెయ్యడం కలకలం రేపింది.

Aunty: ఇద్దరు ప్రియులు ఒకేసారి ఎంట్రీ, రచ్చరచ్చ, పాలడైరీ వ్యాపారితో ?, వీడియో తీసి యువకుడు !Aunty: ఇద్దరు ప్రియులు ఒకేసారి ఎంట్రీ, రచ్చరచ్చ, పాలడైరీ వ్యాపారితో ?, వీడియో తీసి యువకుడు !

మాజీ ఏపీఎంసీ అధ్యక్షుడు

మాజీ ఏపీఎంసీ అధ్యక్షుడు

కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు నగరంలో భైరేగౌడ నగర్ లో ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు రమేష్ నివాసం ఉంటున్నాడు. రమేష్ తో పాటు ఆయన భార్య, పిల్లలు నివాసం ఉంటున్నారు. ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడైన రమేష్ వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. రాజకీయాల్లో ఉన్న పరిచయాలతో రమేష్ ఆయన వ్యాపారాలు జోరుగా చేస్తున్నాడని తెలిసింది.

ఆ ఫ్యామిలీ మీద అందరికళ్లు పడ్డాయి

ఆ ఫ్యామిలీ మీద అందరికళ్లు పడ్డాయి

ఖరీదైన కార్లు, బంగారు, భూములు కొనుగోలు చేస్తున్న ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడు రమేష్ నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. సంపాధిస్తున్న ఆస్తులకు ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు రమేష్ సక్రమంగా ఆదాయపన్ను చెల్లించడం లేదని, ఏదో కొంచెం ఆదాయపన్ను చెల్లిస్తున్నాడని, మిగిలిన సొమ్ము దాచుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

రాత్రి లీడర్ ఇంట్లోకి ఎంట్రీ

రాత్రి లీడర్ ఇంట్లోకి ఎంట్రీ

రాజకీయ నాయకుడు రమేష్ కుటుంబ సభ్యులు విలాసవంతమైన కార్లలో తిరుగుతూ ఖరీదైన దుస్తులు వేసుకుంటూ శరీరం మీద భారీ మొత్తంలో బంగారు నగలు వేసుకుంటున్నారని తెలిసింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత రమేష్ ఇంటికి వెళ్లిన కొందరు మేము ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి వస్తున్నామని పరిచయం చేసుకున్నారు.

మిషన్ గన్ తో వార్నింగ్

మిషన్ గన్ తో వార్నింగ్

మీరు సక్రమంగా ఆదాయపన్ను చెల్లించడం లేదని మాకు ఫిర్యాదులు వచ్చాయని నిందితులు ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు రమేష్ నున భయభ్రాంతులకు గురి చేశారు. రాజకీయ నాయకుడు రమేష్ ఎవరికో ఫోన్లు చెయ్యడానికి ప్రయత్నించడంతో మిషన్ గన్ తో బెదిరించిన నిందితులు రాజకీయ నాయకుడు రమేష్, ఆయన భార్య, పిల్లలను ఇంట్లోని ఒక బెడ్ రూమ్ పెట్టి లాక్ చేశారు.

 కేజీ బంగారు నగలు, రూ. 25 లక్షలు లూటీ

కేజీ బంగారు నగలు, రూ. 25 లక్షలు లూటీ

రమేష్ ఇంట్లోని బీరువాలో ఉన్న రూ. 50 లక్షల విలువైన 1 కేజీకి పైగా ఉన్న బంగారు నగలు, రూ. 25 లక్షల క్యాష్ లూటీ చేసిన నిందితులు అక్కడి నుంచి వారు వెళ్లిన కార్లలోనే పరారైనారు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని కోలారు నగరంలో మిషన్ గన్ పెట్టుకుని రాజకీయ నాయకుడు రమేష్ ఇల్లు లూటీ చెయ్యడం కలకలం రేపింది.

విషయం తెలుసుకున్న కోలారు జిల్లా ఎస్పీ దేవరాజ్ రమేష్ ఇంటికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితులు నకిలీ ఐడీ కార్డులు చూపించారని, హిందీలో మాట్లాడారని బాధితుడు రమేష్ సమాచారం ఇచ్చాడని, కేసు దర్యాప్తులో ఉందని కోలారు జిల్లా ఎస్సీ దేవరాజ్ చెప్పారు.

English summary
Leader: Rs 25 lakh money and 1kg of gold robbery in Kolar in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X