Love marriage: అక్క ఆరంజ్ పండు, బావ బెండకాయ, నో మ్యాచింగ్, పక్కా స్కెచ్ తో ఫినిష్, బ్యాంకులో!
బెంగళూరు/ కోప్పళ: బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు స్నేహితుల సహకారంతో పెళ్లి చేసుకుని వేరుగా కాపురం పెట్టారు. అక్క ఆరంజ్ పండు అయితే బావ బెండకాయ, మ్యాచింగ్ ఏ మాత్రం లేదని యువతి సోదరుడు కక్ష పెంచుకున్నాడు. కులాలు వేరు, ఆస్తులు, అంతస్తులు వేరు, చివరికి మా అక్క కంటే బావకు వయసు చాలా తక్కువ అంటూ యువతి సోదరుడు కక్ష పెంచుకున్నాడు. అంతే ఫ్రెండ్స్ సహాయంతో అక్క, బావను లేపేయాలని స్కెచ్ వేశాడు. తమ్ముడి దెబ్బకు అక్క ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో బావ చావుబ్రతుకుల మధ్య మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు.

ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులు
కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలని ముధోళ తాలుకాలో వినోద్ (31) అనే యువకుడు, త్రివేణి (34) అనే యువతి నివాసం ఉంటున్నారు. ముధోళలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో త్రివేణి, వినోద్ కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు. వయసులో తనకంటే పెద్దదైన త్రివేణిని వినోద్ ప్రేమించాడు. కొంత కాలానికి త్రివేణి కూడా వినోద్ ను ప్రేమించింది.

పాత సినిమా స్టోరీనే.... కాని ?
వినోద్, త్రివేణి కులాలు వేరు. కులాలు వేరైనా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నామని, పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి జీవించాలని వినోద్, త్రివేణి నిర్ణయించారు. అయితే వినోద్, త్రివేణి పెళ్లికి వారి కుటుంబ సభ్యులు నిరాకరించారు. పాత సినిమాలో లాగే పెద్దలు పెళ్లికి అంగీకరించడం లేదని, పెళ్లి చేసుకుని ఓ పాపను కనేస్తే అన్నీ సర్దుకుంటాయని త్రివేణి, వినోద్ నిర్ణయించారు.

లాక్ డౌన్ ముందే పెళ్లి
గత మార్చి నెలలో కరోనా వైరస్ వ్యాపించక ముందు, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించక ముందు వారంలో కర్ణాటకలోని గంగావతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్నేహితుల సహాయంతో వినోద్, త్రివేణి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తరువాత ముధోళలో సాంప్రధాయ బద్దంగా కాపురం పెట్టారు. త్రివేణి, వినోద్ ఇద్దరూ ఒకే బ్యాంకులో ఉద్యోగాలు చేస్తుండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటూ కాపురం చేసుకుంటున్నారు.

అక్క ఆరంజ్ పండు.... బావ బెండకాయ..... నో మ్యాచింగ్
త్రివేణికి అవినాష్ (27) అనే తమ్ముడు ఉన్నాడు. తన అక్క బంగారంలాగా ఉందని, ఆమె పెళ్లి చేసుకున్న వినోద్ బెండకాయ లాగా ఉన్నాడని, అతను మాకంటే తక్కువ కులం వాడు, ఆస్తీ అంతస్తులో మా కంటే చాల తక్కువవాడని అవినాష్ పగ పెంచుకున్నాడు. వినోద్ ను పెళ్లి చేసుకున్న మా అక్క త్రివేణి మా పరువు తీసిందని, ఇద్దర్నీ చంపేస్తే ఓ పనైపోతుందని అవినాష్ స్నేహితులతో కలిసి స్కెచ్ వేశాడు.

అక్కను స్పాట్ లో చంపేసిన తమ్ముడు
ఈనెల 17వ తేదీన వినోద్, త్రివేణి ఇంటి నుంచి బయట వాకింగ్ చెయ్యడానికి బయలుదేరారు. ఆ సయంలో త్రివేణి తమ్ముడు అవినాష్, అతని మరో ఇద్దరు స్నేహితులు కలిసి వారిని బసవేశవర్ నగర్ లో అడ్డుకుని ఇనుప రాడ్లు తీసుకుని దాడి చేశాడు. అక్క అనే కనికరంకూడా లేకుండా అవినాష్ ఇనుప రాడ్ తో త్రివేణి తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. తీవ్రగాయాలైన త్రివేణి భర్త వినోద్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. త్రివేణి పరువు హత్యకు గురైయ్యిందని, ఈ కేసులో ఆమె సొంత సోదరుడు అవినాష్ ను అరెస్టు చేశామని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని కోప్పళ జిల్లా ఎస్పీ శ్రీధర్ మీడియాకు చెప్పారు.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications