Lovers: నీతో ఎంజాయ్ చేశాను, నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పిన ప్రియురాలు, ప్రియుడు ఏం చేశాడంటే!

బెంగళూరు/ శివమొగ్గ: ఒకే చోట ఉద్యోగం చేస్తున్న యువతికి, యువకుడికి పరిచయం అయ్యింది. ప్రతిరోజు కలుస్తున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాలు ప్రేమించుకున్న ప్రేమికులు పెళ్లి చేసుకునే విషయంలో చర్చించారు. ఆ సమయంలో పెళ్లి చేసుకుందామని చెప్పిన ప్రియురాలు తరువాత ఉద్యోగం మానేసి సొంత ఊరికి వెళ్లిపోయింది. నీతో ఎంజాయ్ చేశాను, అయితే నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను అని ప్రియుడికి అతని ప్రియురాలు తేల్చి చెప్పింది. ప్రియురాలిని కలవాలని, ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు అనేక ప్రయత్నాలు చేశాడు.

ప్రియుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రియురాలు మాత్రం అతని మాట వినలేదు. ఇక లాభం లేదని డిసైడ్ అయిన ప్రియుడు అతని ప్రియురాలు నివాసం ఉంటున్న ఊరికి వెళ్లాడు. నా ప్రియురాలు నన్ను మోసం చేసింది, నాకు అన్యాయం జరిగింది అంటూ ఇంత వరకు జరిగిన స్టోరీ మొత్తం చెబుతూ సెల్ఫీ వీడియో తీశాడు. ప్రియుడు అతని ప్రియురాలి ఊరిలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

బెంగళూరులో ఫ్యామిలీ

బెంగళూరులో ఫ్యామిలీ

కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని అరసికెరెలో దిలీప్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం దిలీప్ కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకుని నివాసం ఉంటున్నారు. దిలీప్ తో పాటు అతని తల్లిదండ్రులు బెంగళూరులోని ఒకే గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరారు. దిలీప్ ఐదు సంవత్సరాల నుంచి ఆ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు.

యువతితో పరిచయం

యువతితో పరిచయం

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సొరబ తాలుకాలోని బెట్టదకూర్లీ గ్రామంలో రూపా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. బెంగళూరు చేరుకున్న రూపా దిలీప్ ఉద్యోగం చేస్తున్న గార్మెంట్స్ ఫ్యాక్టరీలోనే ఉద్యోగంలో చేరింది. కొంతకాలం తరువాత ఒకే ఫ్యాక్టరీలో పని చేస్తున్న దిలీప్, రూపాకు పరిచయం అయ్యింది.

హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు

హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు

ప్రతిరోజు కలుస్తున్న దిలీప్, రూపా తరువాత ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాలు ప్రేమించుకున్న ప్రేమికులు దిలీప్, రూపా పెళ్లి చేసుకునే విషయంలో కొన్ని నెలలు చర్చించారు. ఆ సమయంలో పెళ్లి చేసుకుందామని చెప్పిన ప్రియురాలు రూపా ఆమె ప్రియుడు దిలీప్ ఖు ఒక్కమాట కూడా చెప్పకుండా గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం మానేసి శివమెగ్గ జిల్లాలోని సొరబ సమీపంలోని సొంత ఊరికి వెళ్లిపోయింది.

పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పిన ప్రియురాలు

పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పిన ప్రియురాలు

నీతో ఇంతకాలం ఎంజాయ్ చేశాను, అయితే నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను అని ప్రియుడు దిలీప్ కు అతని ప్రియురాలు రూపా తేల్చి చెప్పింది. ప్రియురాలు రూపాను కలవాలని, ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు దిలీప్ అనేక ప్రయత్నాలు చేశాడు. ప్రియుడు దిలీప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని ప్రియురాలు రూపా మాత్రం అతని మాట వినలేదు.

ప్రియురాలి ఊర్లో ప్రియుడు ఆత్మహత్య

ప్రియురాలి ఊర్లో ప్రియుడు ఆత్మహత్య

ఇక లాభం లేదని డిసైడ్ అయిన దిలీప్ అతని ప్రియురాలు రూపా నివాసం ఉంటున్న సొరబ సమీపంలోని ఊరికి వెళ్లాడు. నా ప్రియురాలు నన్ను మోసం చేసింది, నాకు అన్యాయం జరిగింది అంటూ ఇంత వరకు జరిగిన స్టోరీ మొత్తం చెబుతూ దిలీప్ సెల్ఫీ వీడియో తీసి దానిని స్నేహితులు, ప్రియురాలికి పంపించాడు. ప్రియురాలి ఊరిలోనే దిలీప్ విషం తాగి గ్రామం సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రియుడు దిలీప్ ఆత్మహత్య చేసుకోకముందు తీసిన సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+