Lovers: హిందూ అమ్మాయి, ముస్లీం అబ్బాయి రిజిస్టర్ మ్యారేజ్, లవ్ జీహాద్ ?, సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్!
బెంగళూరు/హుబ్బళి: హిందూ మతానికి చెందిన యువతి, ముస్లీం యువకుడికి పరిచయం అయ్యింది. రానురాను ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్న హిందూ యువతి, ముస్లీం యువకుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఇద్దరి మతాలు వేరుకావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు డిసైడ్ అయ్యారు. గుడిలో కాకుండా స్నేహితుల సహాయంతో ప్రేమికులు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు, హిందూ సంఘ, సంస్థ ప్రతినిధులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అమ్మాయికి మాయమాటలు చెప్పిన ముస్లీం యువకుడు ఆమెను నమ్మించి పెళ్లి చేసుకుని లవ్ జీహాద్ లో భాగంగా హిందూ అమ్మాయిని ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రేమికులకు పెళ్లి చేసిన వాళ్ల స్నేహితులు ఇప్పుడు ఎస్కేప్ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఇరు వర్గాల వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.

హిందూ అమ్మాయి..... ముస్లీం అబ్బాయి
కర్ణాటకలోని హుబ్బళి నగరంలోని ఉపనగర్ లో ఇబ్రహీం అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో స్వప్నా అనే యువతి నివాసం ఉంటున్నది. ఇబ్రహీంకు, స్వప్నాకు కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. రానురాను ఇబ్రహీం, స్వప్నాల పరిచయం ప్రేమకు దారితీసింది.

రిజిస్టర్ మ్యారేజ్
కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్న హిందూ యువతి స్వప్నా, ముస్లీం యువకుడు ఇబ్రహీం పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే స్వప్నా, ఇబ్రహీం మతాలు వేరుకావడంతో వాళ్ల పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు ఇబ్రహీం, స్వప్నా డిసైడ్ అయ్యారు.

పోలీస్ స్టేషన్ ముందు ధర్నా
గుడిలో కాకుండా స్నేహితుల సహాయంతో ప్రేమికులు స్వప్నా, ఇబ్రహీం హుబ్బళిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్వప్నా కుటుంబ సభ్యులు, హిందూ సంఘ, సంస్థ ప్రతినిధులు హుబ్బళిలోని ఉపనగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మా అమ్మాయి స్వప్నాను మోసం చేసి ఆమె జీవితాన్ని నాశనం చెయ్యడానికి ఇబ్రహీం స్కెచ్ వేశాడని వారు ఆరోపించారు.

లవ్ జీహాద్ స్కెచ్
స్వప్నాకు మాయమాటలు చెప్పిన ముస్లీం యువకుడు ఇబ్రహీం ఆమెను నమ్మించి పెళ్లి చేసుకుని లవ్ జీహాద్ లో భాగంగా హిందూ అమ్మాయిని ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రేమికులు స్వప్నా, ఇబ్రహీంకు పెళ్లి చేసిన వాళ్ల స్నేహితులు ఇప్పుడు ఎస్కేప్ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఇరు వర్గాల వారికి నచ్చచెప్పడాని ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications