బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lovers: లవ్ మ్యారేజ్, ప్రియుడు చిక్కలేదని అన్నను పట్టుకుని ?, కులం తక్కువని!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ కోప్పళ: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. మూడు సంవత్సరాలు ప్రేమించుకున్న యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అమ్మాయి కంటే అబ్బాయి కులం విషయంలో తక్కువాడు అని పెళ్లి విషయంలో ప్రియురాలి కుటుంబ సభ్యులు చిందులు వేశారు.

మా అమ్మాయి వెంట తిరిగితే నరికేస్తామని ఆమె కుటుంబ సభ్యులు ప్రియుడిని హెచ్చరించారు. ప్రేమికులు ఊరు వదిలి పారిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రియుడు అతని ప్రియురాలితో పారిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు రగిలిపోయారు. ప్రియుడి కోసం రెండు రోజులు గ్యాప్ లేకుండా వెతికారు. ప్రియుడు చిక్కకపోవడంతో అతని అన్నను ఇష్టం వచ్చినట్లు కత్తులతో పొడిచేయడం కలకలం రేపింది.

Illegal affair: లేడీ టీచర్, లేడీ లీడర్, విలన్ ఎవరంటే ?, సీన్ రివర్స్, మ్యాటర్!Illegal affair: లేడీ టీచర్, లేడీ లీడర్, విలన్ ఎవరంటే ?, సీన్ రివర్స్, మ్యాటర్!

ఒకే ఊరిలో లవర్స్

ఒకే ఊరిలో లవర్స్

కర్ణాటకలోని కోప్పళ తాలుకాలోని ఇందిరానగర్ ప్రాంతంలో శ్రీనివాస్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఊరిలోనే రమ్యశ్రీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్, రమ్యశ్రీకి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది.

కులం విషయంలో తేడాలు

కులం విషయంలో తేడాలు

మూడు సంవత్సరాలు ప్రేమించుకున్న శ్రీనివాస్, రమ్యశ్రీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో స్నేహితుల సహాయంతో శ్రీనివాస్, రమ్యశ్రీ కొంతకాలం రహస్యంగా కలుసుకుంటున్నారు. రమ్యశ్రీ కంటే శ్రీనివాస్ కులం విషయంలో తక్కువాడు కావడంతో ప్రేమికులు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

పారిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమికులు

పారిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమికులు

మా అమ్మాయి వెంట తిరిగితే నరికేస్తామని ఆమె కుటుంబ సభ్యులు ప్రియుడు శ్రీనివాస్ ను తీవ్రస్థాయిలో ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించారు. ప్రేమికులు శ్రీనివాస్, రమ్యశ్రీ ఊరు వదిలి పారిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. స్నేహితుల సహాయంతో రహస్యప్రాంతంలో కొత్త జంట కాపురం పెట్టారు. రమ్యశ్రీ కుటుంబ సభ్యులకు మరుసటి రోజు విషయం తెలిసింది.

తమ్ముడు చిక్కలేదని అన్నను

తమ్ముడు చిక్కలేదని అన్నను

శ్రీనివాస్ మా అమ్మాయిని లేపుకునిపోయి పెళ్లి చేసుకున్నాడని ఆమె కుటుంబ సభ్యులు రగిలిపోయారు.శ్రీనివాస్ కోసం రెండు మూడు జిల్లాల్లో గ్యాప్ లేకుండా వెతికినా అతను మాత్రం అమ్మాయి కుటుంబ సభ్యులకు చిక్కలేదు. ప్రియుడు శ్రీనివాస్ చిక్కకపోవడంతో అతని అన్న హనుమేష్ ను పట్టుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అతన్ని ఇష్టం వచ్చినట్లు కత్తులతో పొడిచేయడం కలకలం రేపింది.

కత్తిపోట్లు ఎక్కువగా పడటంతో హనుమేష్ పరిస్థితి విషమంగా ఉందని, కోప్పళ జిల్లా ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడని, అతని మీద దాడి చేసిన బసవరాజ్, యల్లప్ప అనే ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

English summary
Lovers: Inter caste marriage, boyfriends’s brother brutally attacked near Koppal in Karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X