Lovers: గుడిలో ప్రేమికులకు సీఎం పీఏ హితోపదేశం, అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి, వైరల్ !
బెంగళూరు: పెద్దలు లవ్ మ్యారేజ్ కు నో చెప్పడంతో ప్రేమికులు సతమతం అయ్యారు. అదే సమయంలో ఓ టాప్ లీడర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే, పైగా ముఖ్యమంత్రి రాజకీయ ప్రధాన కార్యదర్శి. అంతే ప్రేమికులను పిలిచి పెళ్లి చేసి వాళ్లకు పాఠాలు చెప్పారు. ఎక్కడ లవ్ మ్యారేజ్ జరిగిందో అక్కడి నుంచి అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి నేను అనుకన్నది చేశాను, నేను చెప్పింది మీరు చెయ్యండి అన్నారు. ప్రేమికులకు సీఎం కార్యదర్శి హితోపదేశం చేస్తున్న సమయంలో తీసిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

అయోమయంలో లవర్స్
కర్ణాటకలోని హున్నాళి శాసన సభ నియోజక వర్గంలోని కుంకువే ప్రాంతంలో నివాసం ఉంటున్న భూమిక అనే యువతి, శివకుమార్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన ప్రేమికులు భూమిక, శివకుమార్ కు వాళ్ల కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని సంతోషంగా కాపురం చెయ్యలేమని భూమిక, శివకుమార్ అయోమయంతో ఆందోళన చెందారు.

టాప్ లీడర్ ఎంట్రీతో సీన్ రివర్స్
హోన్నాళి నియోజక వర్గం బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఎంపీ. రేణుకాచార్యకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు రాజకీయ కార్యదర్శి అయిన బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ. రేణుకాచార్య గతంలో మంత్రిగా పని చేసి చక్రం తిప్పారు. సోషల్ మీడియాలో చరుకుగా ఉండే రాజకీయ నాయకుల జాబితాలో ముందు వరుసులో ఉండే రేణుకాచార్యకు ఈ ప్రేమికుల విషయం తెలిసింది. వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య జోక్యం చేసుకున్నారు.

లవ్ మ్యారేజ్ చేసిన ఎమ్మేల్యే
ప్రేమికులు భూమిక, శివకుమార్ ను దేవాలయంలోకి పిలిపించిన ఎమ్మెల్యే రేణుకాచార్య దగ్గరుండి వాళ్ల పెళ్లి జరిపించారు. ఎమ్మెల్యే అనుచరులు, ఆయన స్నేహితులు, ప్రేమికులు స్నేహితులు ప్రేమపెళ్లికి సాక్షులుగా నిలిచారు. సొంత ఖర్చులతో ప్రేమ పెళ్లి జరిపించిన ఎమ్మెల్యే రేణుకాచార్య వాళ్లను ఆశీర్వదించారు.

ప్రేమికులకు పాఠాలు చెప్పిన లీడర్
ప్రేమ పెళ్లి చేసిన తరువాత బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య గుడిలోనే పెళ్లి కొడుక్కు హితోపదేశం చేశారు. చూడు నాయనా శివకుమార్ తల్లిదండ్రులను కాదనుకుని ధైర్యంగా ఇంటి నుంచి బయటకు వచ్చి నీతో కలిసి జీవితం సాగించాలని అనుకుంటున్నది. ఇక నుంచి భూమికకు నువ్వు భర్త మాత్రమే కాదు, తల్లి, తండ్రి అన్నీ నువ్వేకావాలి, నీకు ఏ కష్టం వచ్చినా పెద్దన్నలాగా నేను ఉన్నాను, భూమికను పువ్వుల్లో పెట్టుకుని చూసుకో, ఎక్కడా తేడా రాకూడదని, జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎమ్మెల్యే రేణుకాచార్య పెళ్లి కొడుక్కి గీతోపదేశం చేశారు.

పెళ్లి కూతురి తండ్రికి ఫోన్ చేసి !
గుడిలో నుంచే పెళ్లి కుమార్తె భూమిక తండ్రికి ఎమ్మెల్యే రేణుకాచార్య ఫోన్ చేశారు. నీ కూతురు భూమిక పెళ్లి నేను దగ్గర ఉండి జరిపించి ఆశీర్వదించాను. ఇప్పుడు వాళ్లు నేరుగా మీ ఇంటికి వస్తున్నారు, వాళ్లను నువ్వు, నీ కుటుంబ సభ్యులు ఆశీర్వదించాలి, అంతే కాని వాళ్లను దూరం పెట్టి కష్టపెట్టకూడదు, నీ కూతురు శివకుమార్ తో సంతోషంగా కాపురం చేసేలా నేను చూసుకుంటాను అని చెప్పారు.

వేల సంఖ్యలో లైక్స్.... షేర్
కర్ణాటక సీఎం యడియూరప్ప రాజకీయ కార్యదర్శి రేణేకాచార్య లవ్ మ్యారేజ్ చెయ్యడమే కాదు రెండు కుటుంబాలను రాజీ చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎమ్మెల్యే తీరును మెచ్చుకుంటున్న నెటిజన్లు లవ్ మ్యారేజ్ ఫోటోలు, వీడియోను వేల సంఖ్యలో షేర్ చేస్తు లైక్ చేస్తున్నారు. మొత్తం మీద ఎప్పుడు ఏదో ఒక రకంగా హాట్ టాపిక్ అయ్యే రేణేకాచార్య ఈసారి లవ్ మ్యారేజ్ తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.
-
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications