హిందూ అబ్బాయి, ముస్లీం అమ్మాయి, గుడిలో పెళ్లి చేసుకున్నారు. మణిరత్నం సినిమా, క్లైమాక్స్ లో ?

బెంగళూరు/ధారవాడ: యువతి, యువకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. మతాలు వేరు అయినా ఇద్దరూ స్నేహితులు అయ్యారు. తరువాత స్నేహితులు రానురాను ప్రేమికులు అయ్యారు. కొన్ని ఏళ్లుగా యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రుల వ్యతిరేకతతో వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయి స్నేహితుల సహాయంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయినా ఇరువైపుల తల్లిదండ్రుల నుంచి ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఎదరైయ్యింది. ఎక్కువ బెదిరింపులు రావడంతో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కర్ణాటకలో హిందూ, ముస్లింల మధ్య లవ్ జిహాద్ లాంటి ఘటనలతో గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి గొడవలు కర్ణాటకలో అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. కర్ణాటకలోని ధారవాడ తాలూకాలోని హెబ్బల్లి గ్రామంలో ఓ హిందూ అబ్బాయి, ముస్లిం యువతి ప్రేమించుకున్నారు. అయితే వారిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలిసి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇద్దరు ప్రేమికులు ఏం చెయ్యాలో అర్థంకాక చివరికి సతమతం అయ్యారు.

Lovers married in a temple, A few days after the wedding, the lovers committed suicide in Karnataka.

హెబ్బల్లి గుడ్డదపాళు గ్రామానికి చెందిన మైలారి కలాద్ అలియాస్ మైలారీ (23) అనే హిందూ యువకుడు, మదీనా కొన్నూరు అలియాస్ మదీనా అనే యువతికి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు మైలారీ, మదీనా అనుకున్నారు. అయితే ప్రేమికుల తల్లిదండ్రుల నుంచి పెళ్లి చేసుకోవడానికి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది.

కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే పెద్దలు కొండ ఎక్కి కుర్చోవడంతో కొద్ది రోజుల క్రితమే ఊరు వదిలి పారిపోయిన మైలారీ, మదీనా స్నేహితుల సహాయంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా హెబ్బల్లి గ్రామంలోని కొండపై ఉన్న ఓ పాడుబడిన ఇంట్లో మదీనా, మైలారీ ఇద్దరూ శవమై కనిపించారు.

రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన మైలారీ, మదీనా దంపతుల మృతదేహాలు మరుసటి రోజు ఉదయం అటువైపు వెళ్లిన కొందరు గుర్తించడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ధారవాడ రూరల్‌ స్టేషన్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు. ఇంటి నుంచి పారిపోయిన ప్రేమికులు తరువాత ధైర్యంగా పెళ్లి చేసుకుని కొన్ని రోజులకే అదే గ్రామానికి చేరుకుని సమీపంలోని కొండ మీద ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు ? అని ఇప్పుడు ధారవాడలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+