Lovers: ప్రియురాలు హ్యాండ్, గర్ల్ ఫ్రెండ్ కు రూ. లక్షలు ఖర్చు, చీటి రాసి వాయిస్ మెసేజ్ పంపించిన ప్రియుడు?!

బెంగళూరు/చిక్కమగళూరు: ఒకే ఊరిలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. చిన్నప్పటి స్నేహితులు కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు శారీరక సంబంధం పెట్టుకున్నారు. కొన్ని ఏళ్ల నుంచి ప్రేమికులు ఎంజాయ్ చేశారు. పెళ్లి చేసుకోవాలని ముందే డిసైడ్ కావడంతో ప్రియుడు ఆమెకు లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ఇటీవల ప్రియుడికి హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు వేరే యువకుడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. తన ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని ప్రియుడు ఆవేదన చెందాడు. ఆమెను పెళ్లికి ఒప్పించాలని ప్రియుడు అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు.

చివరికి ప్రియురాలు మాత్రం చేతులు ఎత్తేసింది. 9 ఏళ్ల నుంచి ప్రేమించిన నా ప్రియురాలు నన్ను మోసం చేసింది, నాతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టించింది అంటు ఓ పేపర్ లో లెక్కలు మొత్తం రాసిపెట్టాడు. నా ఆత్మహత్యకు నా ప్రియురాలు కారణం, నాకు అంత్యక్రియులు ఆమె చెయ్యాలి అంటూ వాయిస్ మెసేజ్ అందరికి పంపించిన ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

9 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు

9 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు

కర్ణాటకలోని కాఫీనాడు చిక్కమగళూరు జిల్లాలోని ఎన్ఆర్ పురంలో చేతన్ (31) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చేతన్ నివాసం ఉంటున్న ఊరిలోనే గానవి అనే యువతి నివాసం ఉంటున్నది. ఎన్ఆర్ పురంలోనే నివాసం ఉంటున్న చేతన్, గానవికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. చిన్నప్పటి స్నేహితులు అయిన చేతన్, గానవి 9 సంవత్సరాల నుంచి ప్రేమించుంటున్నారు.

పెళ్లికి ముందే?

పెళ్లికి ముందే?

పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు చేతన్, గానవి శారీరక సంబంధం పెట్టుకున్నారు. కొన్ని ఏళ్ల నుంచి ప్రేమికులు గానవి, చేతన్ ఎంజాయ్ చేశారు. పెళ్లి చేసుకోవాలని ముందే డిసైడ్ కావడంతో ప్రియుడు చేతన్ అతని ప్రియురాలు గానవి ఏమి అడిగినా తీసిస్తూ ఇప్పటి వరకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.

ప్రియుడికి హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు

ప్రియుడికి హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు

ఇటీవల ప్రియుడు చేతన్ కు హ్యాండ్ ఇచ్చిన అతని ప్రియురాలు గానవి వేరే యువకుడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. తన ప్రియురాలు గానవి హ్యాండ్ ఇచ్చిందని ఆమె ప్రియుడు చేతన కొన్ని నెలల నుంచి ఆవేదన చెందుతున్నాడు. గానవిని పెళ్లికి ఒప్పించాలని చేతన్ అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు. చివరికి గానవి ఆమె ప్రియుడు చేతన్ ను పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పి చేతులు ఎత్తేసింది.

ప్రియురాలి కోసం రూ. లక్షలు ఖర్చు, లెక్కలురాసి పెట్టిన ప్రియుడు

ప్రియురాలి కోసం రూ. లక్షలు ఖర్చు, లెక్కలురాసి పెట్టిన ప్రియుడు

9 ఏళ్ల నుంచి ప్రేమించిన నా ప్రియురాలు గానవి నన్ను మోసం చేసింది, నా జీవితంతో చెలగాటం ఆడింది. నాతో ఇప్పటి వరకు రూ. 4 లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టించింది అంటూ చేతన్ ఓ పేపర్ లో లెక్కలు మొత్తం రాసిపెట్టాడు. నా ఆత్మహత్యకు నా ప్రియురాలు గానవి కారణం, నాకు అంత్యక్రియులు ఆమె చెయ్యాలి అంటూ వాయిస్ మెసేజ్ అందరికి పంపించిన చేతన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

మాయం అయిన ప్రియురాలు

మాయం అయిన ప్రియురాలు

చేతన్ అందరికి వాయిస్ మేసేజ్ పంపించి ఆత్మహత్య చేసుకోవడంతో అతని ప్రియురాలు గానవి మాయం అయ్యింది. చేతన్ కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు. సర్వసాధారణంగా ప్రియుడు మోసం చేస్తే అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం మనం చూస్తుంటాము, అయితే చిక్కమగళూరులో రివర్స్ లో ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+