Problems: పెళ్లి సమస్య, అటవి శాఖలో ఉద్యోగం ఊడింది, లిక్కర్ కు బానిస, ఫ్రెండ్స్ చేసిన పనికి!

బెంగళూరు/ చామరాజనగర్: వివాహం చేసుకోవాలని ఓ యువకుడు చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అటవి శాఖలో ఉద్యోగం చేస్తున్న యువకుడికి ఎక్కడా పెళ్లి కూతురు సెట్ కాలేదు. తనతో పాటు పుట్టిన సోదరులు, సోదరికి పెళ్లి అయినా తనకు మాత్రం వివాహం కాలేదని ఆవేదన చెందిన యువకుడు మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. మద్యం సేవించి ఉద్యోగానికి వెళ్లడం మొదలు పెట్టాడు. పగలే తాగిసి ఆఫీసుకు వెలుతున్న యువకుడికి అటవి శాఖలో ఉద్యోగం ఊడిపోయింది.

తరువాత ఐటీ హబ్ లోని ఓ ఫ్యాక్టరీలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగంలో చేరాడు అక్కడ కూడా సార్ సేమ్ టూ సేమ్ గా ప్రవర్తించాడు. ఫ్యాక్టరీలో ఆ యువకుడి చేష్టలు చూసిన యాజమాన్యం విసిగిపోయింది. చివరికి ఫ్యాక్టరీలో కూడా ఉద్యోగం వదిలేసి సొంత ఊరికి వెళ్లిపోయిన యువకుడిని నీకు జీవితంలో పెళ్లికాదని స్నేహితులు ఆటపట్టించారు. రాత్రి రూమ్ లోకి వెళ్లిన యువకుడు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.

 అటవి శాఖలో ఉద్యోగం

అటవి శాఖలో ఉద్యోగం

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని హోనూరు పట్టణంలో వినోద్ (34) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వివాహం చేసుకోవాలని అనుకున్న వినోద్ చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అటవి శాఖలో ఉద్యోగం చేస్తున్న వినోద్ కు ఎక్కడా పెళ్లి కూతురు సెట్ కాలేదు.

ఐదు మంది అన్నలు, ఒక చెల్లెలు

ఐదు మంది అన్నలు, ఒక చెల్లెలు

వినోద్ కు ఐదు మంది అన్నలు, ఒక చెల్లెలు ఉన్నారు. వినోద్ అన్నలకు, చెల్లెలికి పెళ్లి అయిపోయింది. వినోద్ కు మాత్రం ఎక్కడా పెళ్లి సెట్ కాలేదు. తనతో పాటు పుట్టిన సోదరులు, సోదరికి పెళ్లి అయినా తనకు మాత్రం వివాహం కాలేదని ఆవేదన చెందిన వినోద్ విపరీతంగా మద్యం సేవించడానికి బానిస అయ్యాడు.

ఉద్యోగం ఊడిపోయింది

ఉద్యోగం ఊడిపోయింది

వినోద్ ఉదయమే మద్యం సేవించి ఉద్యోగానికి వెళ్లడం మొదలు పెట్టాడు. పగలే తాగిసి ఆఫీసుకు వెలుతున్న వినోద్ కు అటవి శాఖలో ఉద్యోగం ఊడిపోయింది. తరువాత ఐటీ హబ్ బెంగళూరు చేరుకున్న వినోద్ అక్కడ ఓ ఫ్యాక్టరీలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగంలో చేరాడు అక్కడ కూడా వినోద్ సేమ్ టూ సేమ్ గా ప్రవర్తించాడు. ఫ్యాక్టరీలో వినోద్ చేష్టలు చూసిన యాజమాన్యం విసిగిపోయి అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేసింది.

విషం తాగేశాడు.... ఆసుపత్రిలో?

విషం తాగేశాడు.... ఆసుపత్రిలో?

చివరికి ఫ్యాక్టరీలో కూడా ఉద్యోగం పోవడంతో సొంత ఊరికి వెళ్లిపోయిన వినోద్ రోజూ మద్యం సేవిస్తూ కాలం గడిపాడు. నీకు జీవితంలో పెళ్లికాదని స్నేహితులు వినోద్ ను ఆటపట్టించారు. రాత్రి రూమ్ లోకి వెళ్లిన వినోద్ విషం సేవించాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వినోద్ ను చామరాజనగర జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై వినోద్ చనిపోయాడు. వివాహం కాలేదని వినోద్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి సిద్దయ్య చెప్పారని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+