Marriage: కొత్త పెళ్లికూతురిని చంపేసి శవాన్ని భద్రంగా గోనెసంచిలో మూటకట్టిన భర్త, మ్యాటర్!

బెంగళూరు/మంగళూరు: రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్న యువకుడు రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. భార్యను అద్దె ఇంటికి తీసుకు వచ్చాడు. రెండు నెలల తరువాత తాను ఊరికి వెళ్లి వస్తానని రెస్టారెంట్ యజమానికి చెప్పి వెళ్లాడు. యువకుడు నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కింటివాళ్లు ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు.

పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా ఇంటిలోని ఓ మూలలో గోనెసంచి కనపడింది. గోనెసంచి తీసి చూడగా అందులో ఓ యువతి శవం బయటపడింది. కొత్త పెళ్లికూతురిని ఆమె భర్త చంపేసి శవాన్ని భద్రంగా గోనెసంచిలో మూటకట్టి పరారైనాడు.

రెస్టారెంట్ లో ఉద్యోగం

రెస్టారెంట్ లో ఉద్యోగం

పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సూళ్య (మంగళూరు దగ్గర)లోని ఓ రెస్టారెంట్ లో వంట మాస్టర్ గా ఉద్యోగంలో చేరాడు. చాలాకాలం నుంచి అదే రెస్టారెంట్ లో ఇమ్రాన్ ఉద్యోగం చేస్తున్నాడు. రెస్టారెంట్ నిర్వహకులు ఇచ్చి రూమ్ లో కొంతకాలం ఇమ్రాన్ ఉండేవాడు.

రెండు నెలల క్రితం పెళ్లి

రెండు నెలల క్రితం పెళ్లి

పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఇమ్రాన్ సూళ్యలోని బీరమంగళ ప్రాంతంలో అద్దె ఇంటిని తీసుకున్నాడు. మూడు నెలల క్రితం ఇమ్రాన్ పశ్చిమ బెంగాల్ వెళ్లాడు. రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఓ యువతిని సూళ్యాకు తీసుకువచ్చి ఈమె నా భార్య అని ఇంటి యజమానికి, చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి పరిచయం చేశాడు.

యజమానికి ఏం చెప్పాడంటే?

యజమానికి ఏం చెప్పాడంటే?

రెండు నెలలు ఇమ్రాన్, అతని భార్య అదే ఇంటిలో ఉంటున్నారు. మూడు రోజుల క్రితం తాను ఊరికి వెళ్లి వస్తానని రెస్టారెంట్ యజమానికి ఇమ్రాన్ చెప్పాడు. యజమానికి దగ్గర డబ్బులు తీసుకున్న ఇమ్రాన్ ఇంటికి వెళ్లాడు. ఇమ్రాన్ నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కింటివాళ్లు ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు.

 గోనెసంచిలో భార్య శవం మూటకట్టి ఎస్కేప్

గోనెసంచిలో భార్య శవం మూటకట్టి ఎస్కేప్

పోలీసులు ఇమ్రాన్ ఉంటున్న ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఇంటిలోని ఓ మూలలో గోనెసంచి కనపడింది. గోనెసంచి తీసి చూడగా అందులో 22 ఏళ్ల యువతి శవం బయటపడింది. కొత్త పెళ్లికూతురిని ఆమె భర్త ఇమ్రాన్ హత్య చేసి శవాన్ని భద్రంగా గోనెసంచిలో మూటకట్టి పరారైనాడని వెలుగు చూసింది.

భార్యను రెండు నెలలకే చంపేసిన భర్త

భార్యను రెండు నెలలకే చంపేసిన భర్త

రాత్రి ఇమ్రాన్ ఒక్కడే బ్యాగ్ ఎత్తుకుని ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు తెలుసుకున్నారు. సూళ్యా నుంచి మంగళూరు వెళ్లి అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ కు రైలులో బయలుదేరి ఉంటాడని పోలీసులు అంటున్నారు. వివాహం జరిగిన రెండు నెలలకే భార్యను హత్య చేసిన ఇమ్రాన్ దర్జాగా వెళ్లిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+