మాస్ లీడర్, ఒక్క సీన్ తో సామూహిక రాజీనామాలు, మాజీ డిప్యూటీ సీఎం దెబ్బకు ఢమాల్!
బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం కల్పిస్తూ బీజేపీ హైకమాండ్ 189 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తరువాత ఆ పార్టీ నాయకుల్లో అసమ్మతి తారాస్థాయికి చేరింది. మాజీ ఉప ముఖ్యమంత్రికి బీజేపీ హైకమాండ్ ఒక్కసారిగా హ్యాండ్ ఇవ్వడంతో బీజేపీ మేయర్ తో పాటు బీజేపీ కార్పోరేటర్లు సామూహిక రాజీనామాలు చెయ్యడం కలకలం రేపింది.
దెబ్బకు కార్పోరేషన్ లో కార్పోరేటర్ల మెజారిటీ మైనారిటీలో పడిపోయింది. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, శివమొగ్గ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈశ్వరప్పకు ఈసారి పోటీ చెయ్యడానికి అవకాశం రాకపోవడంతో ఆమ్యాటర్ ముందుగానే పసిగట్టిన ఈశ్వరప్ప ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని కేఎస్. ఈశ్వరప్ప ముందుగానే ప్రకటించారు.

కేఎస్. ఈశ్వరప్ప ఈ విషయం మీడియాకు చెప్పిన కొన్ని గంటల తరువాత రాత్రి బీజేపీ మొదటి జాబితాను విడుదల చెయ్యడం విశేషం. బీజేపీ అధికారంలోకి రావడంతో కోసం యడియూరప్పతో కలిసి పనిచేసిన కేఎస్. ఈశ్వరప్ప లాంటి నాయకుడికి అన్యాయం జరిగిందని శివమొగ్గలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
కేఎస్. ఈశ్వరప్పకు మద్దతుగా శివమొగ్గ మహానగర పాలికే (కార్పోరేషన్ ) మేయర్ (బీజేపీ)తో పాటు బీజేపీకి చెందిన 18 మంది కార్పోరేటర్లు బుధవారం సామూహికంగా రాజీనామాలు చేసి బీజేపీ హైకమాండ్ కు నిరసన వ్యక్తం చేశారు. ఈశ్వరప్పకు టిక్కెట్ ఇవ్వాలని శివమొగ్గలోని బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కేఎస్. ఈశ్వరప్ప మౌనంగా ఉండిపోయారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications