New Year: ఐటీ హబ్ లో హైఅలర్ట్, ఇంటలిజెన్స్ వార్నింగ్ తో, లాడ్జ్ లు మొత్తం సోదాలు, రాత్రి !
బెంగళూరు: కరోనా కారణంగా గత రెండేళ్లుగా సిలికాన్ సిటీలో నూతన సంవత్సర వేడుకలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త సంవత్సరాన్ని వైభవంగా స్వాగతం చేసుకోవాలని యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం నుంచి హెచ్చరిక వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
బెంగళూరు నగరంలో అనుమానితులను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కొన్ని సంఘ వ్యతిరేక కార్యకలాపాలు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. బెంగళూరులో నిఘా పెంచిన పోలీసులు డేగ కన్ను వేశారు. బెంగళూరు నగరంలో అనుమానాస్పదంగా కనిపించే వారిపై నిఘా ఉంచాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కార్యాలం ఆదేశించారు.

బెంగళూరులోని సంబంధిత పోలీస్ స్టేషన్‌లోని అన్ని హొయసలు పోలీసులు, చిరుత పోలీసులు వారివారి పోలీస్ స్టేషన్ పరిధిలో చురుకుగా పెట్రోలింగ్ విధులు నిర్వహించాలని, పెట్రోలింగ్ పాయింట్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కనిపిస్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ సూచించారు.
ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకల సందర్బంగా బెంగళూరులోని అశోకనగర్ పోలీస్ స్టేషన్, కబ్బన్ పార్క్ పరిధిలో (ఎంజీ రోడ్డు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లు) ఒకదాని తర్వాత ఒకటి కేసులు నమోదవుతున్నాయి. బెంగళూరు సెంట్రల్ డివిజన్ పరిధిలోనే ఎక్కువగా పబ్‌లు, లేడీస్ బార్‌లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు సెంట్రల్ విభాగం పోలీసులపై ఒత్తిడి పెరగడంతో ఆ ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దింపే అవకాశం ఉంది.
అదేవిధంగా ప్రతి ఏరియాలోని లాడ్జీలకు వచ్చి బస చేసిన వారి వివరాల సేకరించే పనిని బెంగళూలరు పోలీసులు మొదలుపెట్టారు. బెంగళూరులోని అన్ని పోలీసు డివిజన్ల కంటే సెంట్రల్ డివిజన్ పోలీసులకు ఎక్కువ బాధ్యత పెరిగింది. బెంగళూరు సెంట్రల్ లో చాలా గ్రాండ్ గా న్యూఇయర్ వేడుకలు జరుగుతాయి. ఇదే పరిధిలో ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్లు ఉన్నాయి. బెంగళూరులో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసుు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా బెంగళూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications