Tarakaratna: నందమూరి అభిమానులకు ప్రముఖుల మనవి, ఏం జరుగుతోంది, ఎప్పటికప్పుడు రిపోర్టు!

బెంగళూరు/హైదరాబాద్: నందమూరి తారకరత్న ఆరోగ్య విషయంలో చాలా మంది నటీ నటులతో పాటు నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నందమూరి తారకరత్నను చూడటానికి పలువురు తెలుగు సినీ పరీశ్రమకు చెందిన ప్రముఖలతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి వచ్చి వెలుతున్నారు.

ఇప్పటికే మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, బాలయ్య, కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, కల్యాణ్ రామ్ దంపతులు, పురందేశ్వరి, నారా లోకేష్ ,బాలయ్య కుమార్తె బ్రహ్మిణి తదితరులు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వచ్చి వెళ్లారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రి ముందు నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో గుమికూడి ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే ఆందోళనతో అక్కడే ఉంటున్నారు.

నందమూరి ఫ్యాన్స్

కుప్పంలో గుండెపోటుతో కుప్పకూలిపోయిన నందమూరి తారకరత్నను వెంటనే బెంగళూరుకు తరలించారు. బెంగళూరులో ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందుతుందని ఒక ఆశ, మరో వైపు కుప్పు నుంచి బెంగళూరు దగ్గరగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్ లో నందమూరి తారకరత్నను బెంగళూరుకు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు.

హడలిపోయిన నందమూరి, నారా ఫ్యామిలీ

హడలిపోయిన నందమూరి, నారా ఫ్యామిలీ

నారా లోకేష్ పాదయాత్ర మొదటి రోజు జరిగే సభలో పాల్గొనడానికి వెళ్లిన నందమూరి తారకరత్నకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. తారకరత్న అనారోగ్యానికి గురి కావడంతో నందమూరి ఫ్యామిలీ, నారా వారి ఫ్యామిలీ హడలిపోయింది. ఇక నందమూరి అభిమానులు సైతం ఆందోళనకు గురైనారు. తారకరత్నను వెంటనే బెంగళూరుకు తరలించారు.

అండగా నిలిచిన బెంగళూరు ఫ్యాన్స్

అండగా నిలిచిన బెంగళూరు ఫ్యాన్స్

రెండు రోజుల క్రితం జూనీయర్ ఎన్టీర్ దంపతులు, కళ్యాణ్ రామ్ దంపతులు బెంగళూరులోని హెచ్ఏఎల్ కు ప్రత్యేక విమానంలో వచ్చారు. కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ తో పాటు ప్రముఖ కన్నడ నిర్మాత, కేవీఎన్ ప్రోడెక్షన్స్ బిజినెస్ హెడ్ లోహిత్, కర్ణాటక రాష్ట్ర జూనీయర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్యం ఎయిర్ పోర్టు నుంచి ఆసుపత్రి వరకు వెళ్లారు.

జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి మళ్లీ బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వరకు వారి వెంటే ఉన్నారు. బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్ కు ఏంతో నమ్మకమైన వ్యక్తులు అయిన ప్రముఖ నిర్మాత లోహిత్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్యం ఎప్పటికప్పుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకుంటున్నారు.

పునీత్ రాజ్ కుమార్ ఫ్రెండ్

పునీత్ రాజ్ కుమార్ ఫ్రెండ్

నందమూరి తారకరత్నకు దేవుడు ఆశీర్వదిస్తున్నారని, ఆయన త్వరగా కోలుకుంటారని, ఎవ్వరూ ఆందోళన చెందనవసరం లేదని ప్రముఖ నిర్మాత, కేవీఎన్ ప్రొడెక్షన్స్ బిజినెస్ హెడ్ లోహిత్ నందమూరి అభిమానులకు మనవి చేశారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు స్నేహితుడు, అతి చిన్న వయసులో పునీత్ రాజ్ కుమార్ తో చక్రవ్యూహ సినిమా ను నిర్మించిన నిర్మాత లోహిత్ కూడా ఎప్పటికప్పుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

ఆందోనళ వద్దు ఫ్రెండ్స్

ఆందోనళ వద్దు ఫ్రెండ్స్

నందమూరి తారకరత్న ఆరోగ్యం విషయంలో ఆందోళన చెంది ఆసుపత్రి దగ్గర పగలు, రాత్రి అభిమానులు వేచి ఉండకూడదని, ఆయన త్వరగా కోలుకుంటారని, అభిమానులు ధైర్యంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్యం నందమూరి అభిమానులకు మనవి చేశారు. త్వరలో మన ఇంటి బిడ్డ కోలుకుంటాడని మాణిక్యం ఆశాభావం వ్యక్తం చేశారు.

సాయికుమార్, రమాప్రభా

సాయికుమార్, రమాప్రభా

బెంగళూరులో ఐసీయూలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న కుటుంబ సభ్యులను ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ తో పాటు అలనాటి నటి రమాప్రభా పరామర్శించారు. మంగళవారం బెంగళూరు చేరుకున్న సాయికుమార్, రమాప్రభా ఆసుపత్రిలో నందమూరి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇదే సమయంలో చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చిన నందమూరి అభిమానులు ఆసుపత్రి ముందు గుమికూడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+