ఐటీ హబ్ చరిత్రలోనే మోదీ అతిపెద్ద రోడ్ షో, భారీ సెక్యూరిటీ, లక్షల్లో ప్రజలు!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించాలని డిసైడ్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసీటు కూడా విలువైనదే అని అనుకున్నారు. బెంగళూరులో శనివారం జరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి కొన్ని వేల మంది పోలీసులను భద్రతా ఏర్పాట్లకు నియమించారు.
ఇప్పటికే జాతీయ నాయకులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. బెంగళూరులోని అన్ని నియోజక వర్గాలను కవర్ చేస్తూ ప్రధాని మోదీ అస్త్రాన్ని ఉపయోగించిన బీజేపీ హైకమాండ్ ఐటీ హబ్ లో వీలైనన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి కంటిమీద కునుకులేకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు 8, 000 మంది పోలీసులు నియమించారు. బెంగళూరు నగరంలో ఇంత వరకు ఇంత పెద్ద రోడ్ షో ఏ ప్రధాన మంత్రి నిర్వహించలేదని, ఆ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కింది.
బెంగళూరులోని కోణెణకుంటేలో శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో మొదలౌతుంది. అక్కడి నుంచి జేపీ నగర్, జయనగర్, జయనగర్ మెట్రో స్టేషన్, మాదవరావ్ సర్కిల్, సౌత్ ఎండ్ సర్కిల్ లో ప్రధాని మోదీ సందడి చెయ్యనున్నారు. అక్కడి నుంచి రమణ మహర్షి రోడ్డు, ఆర్ బీఐ లేఔట్, రోస్ గార్డెన్, శిర్సీ సర్కిల్, జేజే నగర్, బిన్నిమిల్ రోడ్డు, షాలిని గ్రౌండ్స్, అర్ముగం సర్కిల్ మీదుగా మోదీ రోడ్ షో నిర్వహిస్తారు.
బుల్ టెంపుల్ మెయిన్ రోడ్డు, రామక్రిష్ణ ఆశ్రమం రోడ్డు, ఉమా టాకీస్, టీఆర్ మిల్, చామరాజపేట్ మెయిన్ రోడ్డు, బాళేకాయ్ మండి రోడ్డు, కేపీ అగ్రహార, మాగడి రోడ్డు మెయిన్ రోడ్డు, చోళరపాళ్య. ఎంసీ సర్కిల్, వెస్ట్ కార్డ్ సర్కిల్, ఎంసీ లేఔట్, నాగరబావి మెయిన్ రోడ్డు, బీజీ ఎస్ గ్రౌండ్స్, హవనూరు సర్కిల్, బసవేశ్వర నగర్ 8వ మెయిన్, బసవేశ్వర నగర్ 15వ మెయిన్, శంకరమఠ, మోదీ ఆసుపత్రి రోడ్డు, మల్లేశ్వరం సర్కిల్, సంపిగే రోడ్డు, స్యాంకీ రోడ్ ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ రహదారుల్లో వాహన సంచారాన్ని బెంగళూరు ట్రాఫిక్ పోలీసు అధికారులు నిషేదించారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications