Power Star: పవర్ స్టార్ సేవలకు వెలకట్టలేము, ప్రభుత్వం తరపున బర్త్ డే వేడుకలు, ఆరోజు, సీఎం !
బెంగళూరు: స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు ఇక ముందు ప్రేరణ దినోత్సవం ( Inspiration Day)గా జరుపుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. సినిమా రంగంతో పాటు అనేక రంగాల్లో పునీత్ రాజ్ కుమార్ ఎనలేని సేవలు అందించారని, ఆయన సమాజానికి చేసిన సేవను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, అందుకే ఆయన పుట్టిన రోజును ప్రేరణ దినోత్సవంగా జరుపుకోవాలని యువతకు మనవి చేస్తున్నామని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

స్యాండిల్ వుడ్ పవర్ స్టార్
కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ వారసుల్లో ఒకడిగా స్యాండిల్ వుడ్ లో అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్ నటుడిగా తనకంటే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి రాజ్ కుమార్, అన్న హ్యాట్రీక్ హీరో శివరాజ్ కుమార్ ప్రభావం తన మీద పడకుండా పునీత్ రాజ్ కుమార్ నటుడిగా, డ్యాన్సర్ గా తనకంటే మంచి క్రేజ్ సంపాదించుకుని పవర్ స్టార్ అయ్యాడు.

అభిమానుల గుండెల్లో అప్పు అయిన పవర్ స్టార్
స్యాండిల్ వుడ్ లో అతి తక్కువ కాలంలోనే పునీత్ రాజ్ కుమార్ అభిమానుల గుండెల్లో పవర్ స్టార్ అయిపోయాడు. పునీత్ రాజ్ కుమార్ ను ఆయన సన్నిహితులు, అభిమానులు ఎంతో ప్రేమగా అప్పు అని పిలుచుకుంటారు. నటనతో పాటు మంచి డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ కు అబ్బాయిలు, అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉందని కొత్తగా చెప్పనవసరం లేదు.

అభిమానులకు బ్లాక్ డే
గత ఏడాది అక్టోబర్ 29వ తేదీన జిమ్ చేస్తున్న సమయంలో పునీత్ రాజ్ కుమార్ కుప్పకూలిపోయాడు. వెంటనే పునీత్ రాజ్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై పునీత్ రాజ్ కుమార్ ఈలోకం విడిచి వెళ్లిపోయారు. లక్షలాది మంది పునీత్ రాజ్ కుమార్ ను చివరిసారి దర్శించుకుని ఆయనకు నివాళి అర్పించారు.

పునీత్ రాజ్ కుమార్ యువతకు ఆదర్శం
మార్చి 17వ తేదీ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు. పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజును ఇక ముందు ప్రేరణ దినోత్సవంగా జరుపుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ప్రకటించారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు ఇక ముందు ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరపున Inspiration Day గా జరుపుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

పవర్ స్టార్ సేవలు వెల కట్టలేనివి, మరిచిపోలేము: సీఎం బోమ్మయ్
కన్నడ సినిమా రంగంతో పాటు అనేక రంగాల్లో పునీత్ రాజ్ కుమార్ ఎనలేని సేవలు అందించారని, ఆయన సమాజానికి చేసిన సేవను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, అందుకే ఆయన పుట్టిన రోజును ప్రేరణ దినోత్సవంగా జరుపుకోవాలని యువతకు మనవి చేస్తున్నామని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. ఇక ముందు కర్ణాటక ప్రభుత్వం లాంచనాలతో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దం అయ్యింది.












Click it and Unblock the Notifications