భర్తకు పాదపూజ చేసిన నటి ప్రణీత- స్పెషాలిటీ ఇదే
బెంగళూరు: ఇవ్వాళ- సోమవాతి అమావాస్య. కర్ణాటకలో ఆటి అమావాస్యగా, భీమన అమావాస్యగా జరుపుకొంటారు. ప్రత్యేకించి- తుళునాడుకు ఇది పెద్ద పండగ. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాల్లో భీమన అమావాస్యను పెద్ద ఎత్తున జరుపుకొంటారు. కుందాపుర, ఉడుపి, కర్కళ, బేల్తంగడి, మంగళూరు, పుత్తూరు, కేరళలోని కాసర్‌గాడ్.. ప్రాంతాల్లో ఆలయాలన్నీ కిటకిటలాడాయి.
బెంగళూరులో కూడా ఈ తెల్లవారు జాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలను సందర్శించారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. కర్ణాటకతో పాటు ఏపీ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సోమావతి అమావాస్యను భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. పుణ్యస్నానాలను ఆచరిస్తారు. పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు.

ఈ పండగను ఇవ్వాళ ప్రముఖ నటి ప్రణీత సుభాష్.. భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. భర్త నితిన్ రాజు, కుమార్తె అర్ణతో కలిసి ప్రస్తుతం ఆమె ముంబైలో నివసిస్తోన్నారు. కన్నడలో రామన అవతార, మలయాళంలో దిలీప్ 148 సినిమాల్లో నటిస్తోన్నారు. ఈ రెండూ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. భీమన అమావాస్య పండగను సంప్రదాయబద్ధంగా జరుపుకొన్నారు ప్రణీత.
ఈ సందర్భంగా ఆమె భర్త నితిన్ రాజుకు పాద పూజ చేశారు. పాదాలకు పసుపు, కుంకుమ రాసి, పూలు చల్లారు. భక్తితో ప్రణమిల్లారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఆమె తన అధికారిక ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సనాతన ధర్మంలో ఈ పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, దీన్ని ఆచరించడం తన బాధ్యతగా పేర్కొన్నారు.
సంప్రదాయాలను తప్పకుండా అనుసరించడం అంటే సనాతన ధర్మాన్ని కాపాడుకున్నట్టేనని ప్రణీత సుభాష్ పేర్కొన్నారు. హిందూ సంప్రదాయాల్లో అనేక ఆచారాలు ఉన్నాయని, ప్రతి సంప్రదాయానికీ, ఒక్కో కథ ఉందని వ్యాఖ్యానించారు. దీన్ని ఆచరించడం వల్ల హైందవ ధర్మాన్ని ముందు తరానికి తీసుకెళ్లనిట్టవుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications