Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన బీబీసీ, గ్రేట్!
బెంగళూరు: శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త దేశంలోని దాదాపు అన్ని బాషల మీడియాలో, విదేశాల్లోని మీడియాలో ప్రసారం అయ్యింది. తక్కువ వయసులో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (46) మరణ వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రపంచ ప్రసిద్ది చెందిన బీబీసీ న్యూస్ లో పలువురు నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశాలు దాటుకుని పునీత్ రాజ్ కుమార్ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఇక బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో శనివారం రాత్రి వరకు సుమారు 30 లక్షల మంది అభిమానులు పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించి ఆయన పార్థీవ దేహాన్ని చివరిసారి దర్శించుకున్నారని కన్నడ మీడియా, బందోబస్తులో ఉన్న పోలీసులు అంచనా వేశారు. కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించిన వారు లక్షలాది మంది ఉన్నారు. డాక్టర్ రాజ్ కుమార్ తరువాత ఆయన ముద్దుల కొడుకు పునీత్ రాజ్ కుమార్ ను చూడటానికి అంత పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారని వెలుగు చూసింది.

దేశంలోని అన్ని బాషల టీవీ చానల్స్, ప్రింట్ మీడియాలో!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (46) శుక్రవారం గుండెపోటుతో బెంగళూరులో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త దేశంలోని దాదాపు అన్ని బాషల టీవీ చానల్స్ లో, ప్రింట్ మీడియాలో వార్తలు వచ్చాయి. పునీత్ రాజ్ కుమార్ మరణవార్త దేశంలోని అన్ని టీవీ చానల్స్ లో లైవ్ లో ప్రసారం చేస్తున్నాయి.

ప్రపంచ ప్రసిద్ది చెందిన బీబీసీ న్యూస్
ప్రపంచంలో బీబీసీ న్యూస్ చానల్ కు ఎంత పేరు ఉంది అనే విషయం మీడియా గురించి తెలిసిన వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను బీబీసీ న్యూస్ చానల్ ప్రసారం చేసింది. పునీత్ రాజ్ కుమార్ అతని చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానులను సంపాధించుకుని అందరికి దూరం అయ్యారని బీబీసీ న్యూస్ తెలిపింది.

ఆశ్చర్యం వ్యక్తం చేసిన అంతర్జాతీయ సినీ విశ్లేషకులు
బీబీసీ న్యూస్ చానల్ న్యూస్ రీడర్ అంతర్జాతీయ సినీ విశ్లేషకులను పునీత్ రాజ్ కుమార్ గురించి చర్చ జరిపారు. ఈ సందర్బంగా భారతదేశంలో అతని తక్కువ వయసులో ఇన్ని కోట్ల మంది అభిమానులు పునీత్ రాజ్ కుమార్ సంపాదించుకోవడం నిజంగా గ్రేట్ అని, నమ్మడానికి ఆశ్చర్యంగా ఉందని ఓ మహిళా సినీ విశ్లేషకురాలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కంఠీరవ స్టేడియంలో లక్షలాది మంది ఫ్యాన్స్ ను చూపించిన బీబీసీ న్యూస్
పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారని వార్తలు ప్రసారం చేసిన బీబీసీ న్యూస్ చానల్ ఇదే సమయంలో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రి ముందు గుమికూడిన ఆయన అభిమానులను, కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్ కుమార్ ను చివరిసారి చూసుకుని నివాళులు అర్పించడానికి వచ్చిన లక్షలాది మంది అభిమానుల వీడియోలను ప్రసారం చేసింది.

పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ గ్రేట్
పునీత్ రాజ్ కుమార్ మరణించాని వార్త జీర్ణించుకోలేని ఆయన అభిమానులు ముగ్గురు ప్రాణాలు వదిలేశారు. మరో ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా మరో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంత తక్కువ వయసులో పునీత్ రాజ్ కుమార్ ఇన్ని కోట్ల మంది అభిమానులను సంపాధించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని, ఆయన మంచితనం వలనే అదిసాధ్యం అయ్యిందని బీబీసీ న్యూస్ చానల్ లో పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తంమీద మొదటిసారి శ్యాండిల్ వుడ్ కు చెందిన పునీత్ రాజ్ కుమార్ గురించి బీబీసీలో వార్తలు ప్రసారం అయ్యాయి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications