Pushpa: పుష్పా-3 సినిమా చూపించిన కిలాడీ పోలీసులు, ఎర్రచందనం ఏం చేశారు, అల్లు అర్జున్ కే పోటీనా!
బెంగళూరు: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పా సినిమా ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ బాషల్లో పుష్పా సినిమా విడుదలై కలెక్షల వర్షం కురిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని ఓ కథ తయారు చేసుకుని, స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్పా సినిమా తెరకెక్కింది. ఎర్రచందనం చెట్లు కత్తిరించే ఓ రోజు కూలి ఎర్రచందనం స్మగ్లర్ గా ఎలా తయారైనాడు అనేది ఈ సినిమా ప్రధాన అంశం అనే విషయం తెలిసిందే. పుష్పా-2 సినిమా కూడా తెర మీదకు రానుంది.
అల్లు అర్జున్ పుష్పా-2 సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఇంకా చాలా లేటుగా సినిమా విడుదల చెయ్యాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేసుకుంటున్నది. అయితే ఇద్దరు పోలీసులు మాత్రం పుష్పా-3 సినిమాను సాటి పోలీసు అధికారులకు చూపించేశారు. పుష్పా సినిమాను తలతన్నేలా ఆ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లుగా అవతారం ఎత్తడం, వాళ్లు వేసిన స్కెచ్ గురించి తెలుసుకున్న ఐటీ హబ్ సిటీ పోలీసు కమీషనర్ తోపాటు సాటి పోలీసులు, ఎర్రచందనం స్మగ్లర్లు బిత్తరపోయారు.
Illegal
affair:
కండెక్టర్
లవ్
మ్యారేజ్,
భర్త
బస్సులో
విజిల్
వేస్తుంటే
భార్య
?,
పెళ్లికి
ముందే!

పుష్పా ప్రేక్షకుల కోసం తీసిన సినిమా..... అభిమానుల కోసం మాత్రమే
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్పా సినిమా తెరకెక్కింది. ఎర్రచందనం చెట్లు కత్తిరించే ఓ రోజు కూలి ఎర్రచందనం స్మగ్లర్ గా ఎలా తయారైనాడు అనేది ఈ సినిమా ప్రధాన అంశం అనే విషయం తెలిసిందే. పుష్పా-2 సినిమా కూడా తెర మీదకు రానుంది. పుష్పా సినిమా అల్లు అర్జున్ అభిమానులను ఆనంద పరచడానికి తీసి ప్రేక్షకుల కోసం విడుదల చేశారు.

పుష్పా-3 సినిమా చూపించిన పోలీసులు
అల్లు అర్జున్ పుష్పా-2 సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఇంకా చాలా లేటుగా సినిమా విడుదల చెయ్యాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేసుకుంటున్నది. అయితే బెంగళూరులోని ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ పుష్పా-3 సినిమాను సాటి పోలీసు అధికారులకు చూపించేశారు. పుష్పా సినిమాను తలతన్నేలా ఆ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లుగా అవతారం ఎత్తడం, వాళ్లు వేసిన స్కెచ్ గురించి తెలుసుకున్న ఐటీ హబ్ బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ తోపాటు సాటి బెంగళూరు పోలీసులు, ఎర్రచందనం స్మగ్లర్లు బిత్తరపోయారు.

క్రైమ్ బ్రాంచ్ లో స్కెచ్ లు
బెంగళూరులోని గిరినగర్ పోలీస్ స్టేషన్ లో, మహదేవపుర పోలీస్ స్టేషన్ లో మహతేష్, మోహన్ అనే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ గా ఉద్యోగం చేస్తున్నారు. గతంలో మోహన్, మహతేష్ ఇద్దరూ బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ)లో ఉద్యోగాలు చేశారు. సీసీబీలో ఉద్యోగాలు చేస్తున్న సమయంలో పరిచయం పెంచుకున్న పోలీసులు మోహన్, మహతేష్ తరువాత అక్కడే స్మగ్లింగ్ చెయ్యాలని స్కెచ్ వేశారు.

ఇది స్మగ్లింగ్ స్కెచ్ కు బ్రాక్ గ్రౌండ్
గతంలో బెంగళూరు సీసీబీ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లు మీద దాడులు చేశారు. ఆ సమయంలో మోహన్, మహతేష్ గౌడ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఎలా ఎర్రచందనం బెంగళూరు తెప్పిస్తున్నారు ?, ఎలా ఆ ఎర్రచందనం విక్రయిస్తున్నారు ?, ఎర్రచందనంలో ఎన్ని లక్షల రూపాయలు లాభం ఉంది ,ఇలా ఎర్రచందనంకు సంబంధించిన పూర్తి వివరాలు మొత్తం కానిస్టేబుల్స్ మోహన్, మహతేష్ గౌడ తెలుసుకున్నారు. తరువాత మోహన్, మహతేష్ గౌడ సీసీబీ నుంచి మహదేవపుర, గిరినగర పోలీస్ స్టేషన్లకు బదిలి అయ్యారు.

బెంగళూరు శివార్లలో ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాల నుంచి కాకుండా తమిళనాడులోని చెన్నై, వేలూరు, కోయంబత్తూరు తదితర ప్రాంతాల నుంచి బెంగళూరు రావాలంటే కచ్చితంగా హోస్ కోటే మార్గం నుంచి రావాలి. గత నెల డిసెంబర్ 15వ తేదీ నుంచి హోస్ కోటే మీదుగా టాటా ఏస్ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని హెడ్ కానిస్టేబుల్స్ మోహన్, మహతేష్ గౌడకు తెలిసింది. ఎలాగైనా ఎర్రచందనం కొట్టేయాలని ఈ ఇద్దరు పోలీసులు స్కెచ్ వేశారు.

కిలాడీ పోలీసులు
షిఫ్ట్ డిజైర్ కారులో బెంగళూరు నుంచి హెడ్ కానిస్టేబుల్స్ మోహన్, మహతేష్ గౌడ వెళ్లారు. పక్కా స్కెచ్ ప్రకారం ఎర్రచందనం తరలిస్తున్న టాటా ఏస్ వాహనం పట్టుకున్నారు. పోలీసు ఐడీ కార్డులు చూపించి టాటా ఏస్ వాహనం డ్రైవర్ ను పట్టుకుని చితకబాదేసి ఎర్రచందనం ఉన్న వాహనంతో సహ ఇద్దరు పోలీసులు మోహన్, మహతేష్ గౌడ అక్కడి నుంచి చెక్కేశారు.

ఆలోచించి లేటుగా వెళ్లిన డ్రైవర్
ఎర్రచందనం వాహనం డ్రైవర్ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడానికి భయపడ్డాడు. తన మీద స్మగ్లింగ్ కేసు నమోదు అవుతుందని అప్పట్లో అతను హోస్ కోటే పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదు. రెండు వారాల తరువాత ఎర్రచందనం పోతేపోయింది, కనీసం వాహనం అయినా రిలీజ్ చేయించుకోవాలని హోస్ కోటే పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఆ సమయంలో టాటా ఏస్ వాహనం డ్రైవర్ జరిగిన స్టోరీ మొత్తం చెప్పడంతో హోస్ కోటే పోలీసులు హడలిపోయారు.

పోలీసులే స్మగర్లు అని తెలిసి షాక్
హోస్ కోటే పోలీసుల విచారణలో షిప్ట్ కారు నెంబర్ బయటకు వచ్చింది. ఆ కారు కానిస్టేబుల్ మోహన్ ది అని తెలుసుకున్న పోలీసులు మొదట ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పోలీసు అధికారుల సూచనమేరకు మొదట మోహన్, మహతేష్ గౌడ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగారు. చివరికి ఎర్రచందనం ఉన్న టాటా ఏస్ వాహనంతో పారిపోయింది హెడ్ కానిస్టేబుల్స్ అని పోలీసు అధికారలు విచారణలో వెలుగు చూసింది.

ఐజీపీ చంద్రశేఖర్ ఎంట్రీతో సీన్
బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ వంశీకృష్ణ విచారణ జరిపి నివేదిక కేంద్ర విభాగం ఐజీపీ చంద్రశేఖర్ కు సమర్పించారు. ఐజీపీ చంద్రశేఖర్ విచారణలో హోడ్ కానిస్టేబుల్ మోహన్, మహతేష్ గౌడ కొట్టేసిన ఎర్రచందనం విక్రయించి చేతులు దులుపుకున్నారని వెలుగు చూసింది. ఐజీపీ చంద్రశేఖర్ బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కమల్ పంత్ కు నివేదిక సమర్పించారు.
Recommended Video

పోలీసుల మీద ఎర్రచందనం స్మగ్లింగ్, దోపిడీ కేసులు
బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ హెడ్ కానిస్టేబుల్ మోహన్, మహతేష్ గౌడను సస్పెండ్ చేశారు. హెడ్ కానిస్టేబుల్స్ మోహన్, మహతేష్ గౌడ మీద ఎర్రచందనం దోపిడీ చేశారని కేసులు నమోదు చేశారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ పుష్పా సినిమాకు దీటుగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని వెలుగు చూడటంతో కర్ణాటక పోలీసులు బిత్తరపోయారు.