Riots: వీరసావార్కర్, టిప్పుసుల్తాన్ ఫెక్సీల దెబ్బ, యువకులకు కత్తిపోట్లు, విద్యాసంస్థలు బంద్, నిషేధాజ్ఞలు!
బెంగళూరు/శివమొగ్గ: స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఊరువాడా, చిన్నాపెద్ద అని తేడా లేకుండా సోమవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అయితే కొంత మంది స్వార్థం కోసం చేసిన పనికి కొందరి ప్రాణం మీదకు వచ్చింది. వీర సావార్కర్, టిప్పుసుల్తాన్ ఫోటోలు, ఫెక్సీల కారణంగా గొడవలు జరగడంతో ఇద్దరు యువకులను దారుణంగా పొడిచేశారు. కొంతమంది గాయాలై ఆసుపత్రిపాలైనారు.
ఈ గొడవల దెబ్బకు ఊరు మొత్తం దుకాణాలు మూసి వేయేడంతో బంద్ వాతావరణం నెలకోనడంతో నిషేధాజ్ఞలు విధించారు. స్కూల్స్, కాలేజ్ లు మూసివేసి సెలవులు ప్రకటించారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయంతో ఇరు వర్గాల ప్రజలు హడలిపోతున్నారు.

సావార్కర్, టిప్పుసుల్తాన్
స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. చిన్నాపెద్ద అని తేడా లేకుండా సోమవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సొంత ఊరుశివమోగ్గ నగరంలో వీర సావార్కర్, టిప్పుసుల్తాన్ ఫోటోలు, ఫెక్సీల కారణంగా గొడవలు మొదలైనాయి.

ఊరేగింపులు.....ఉద్రిక్త పరిస్థితులు
సోమవారం శివమొగ్గలో స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవాల ఊరేగింపు ఘనంగా జరిగింది. స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్బంగా ఓ వర్గం వారు వీర సావార్కర్ ఫోటోలు, ఫెక్సీలు, మరో వర్గం వాళ్లు టిప్పు సుల్తాన్ ఫోటోలు, పెక్సీలు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల వాళ్లు వేర్వేరు ఫోటోలుతో ఫెక్సీలు ఏర్పాటు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

యువకులను పొడిచిపారేశారు
వీర సావార్కర్, టిప్పుసుల్తాన్ ఫోటోలు, ఫెక్సీల కారణంగా గొడవలు జరగడంతో శివమొగ్గలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రేమ్ సింగ్ (20), ప్రవీణ్ అనే ఇద్దరు యువకులను దారుణంగా పొడిచేశారు. తీవ్రగాయాలైన ప్రేమ్ సింగ్, ప్రవీణ్ ను మెగ్గాస్ ఆసుపత్రికి తరించారు. విషయం తెలుసుకున్న ఓ వర్గం వారు గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నిషేధాజ్ఞలు... విద్యాసంస్థలు బంద్
కొంతమంది గాయాలై ఆసుపత్రిపాలైనారు. ఈ గొడవల దెబ్బకు ఊరు మొత్తం దుకాణాలు మూసి వేయేడంతో బంద్ వాతావరణం నెలకోనడంతో నిషేధాజ్ఞలు విధించారు. స్కూల్స్, కాలేజ్ లు మూసివేసి సెలవులు ప్రకటించారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయంతో ఇరు వర్గాల ప్రజలు హడలిపోతున్నారు.












Click it and Unblock the Notifications