Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sadist wife: యువతి మీద అత్యాచారం చేసిన దొంగ స్వామిజీ, వీడియో తీసి ఎంజాయ్ చేసిన భార్య, పెళ్లి రద్దుతో!

బెంగళూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. సంసారం చేస్తున్న వ్యక్తి స్వామీజీ అవతారం ఎత్తాడు. సమస్యలతో ఉన్న వారికి సమస్యలు పరిష్కరిస్తాని నమ్మించాడు. అయితే కొందరి సమస్యలు పరిష్కారం కావడంతో ఆ స్వామిజీ ఫేమస్ అయిపోయాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లిలో ఓ యువతితో పరిచయం అయ్యింది. తరువాత ఆమె జాతకం చూసిన స్వామిజీ నీకు వివాహం అయిన వెంటనే నీ భర్త చనిపోతాడని, అలా జరగకుండా ఉండాలంటే ప్రత్యేక పూజలు చెయ్యాలని చెప్పాడు.

పూజలు చెయ్యడానికి వెళ్లిన యువతి మీద స్వామిజీ అత్యాచారం చేశాడు. ఆ సందర్బంలో స్వామిజీ భార్య అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియో తీసింది. అప్పటి నుంచి యువతిని బ్లాక్ మెయిల్ చేసి ఆమె మీద అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఇటీవల యువతి పెళ్లి ఫిక్స్ అయ్యింది.

నిశ్చితార్థం ఒక్కరోజు ముందు యువతి పెళ్లి రద్దు అయ్యింది, యువతి పెళ్లి రద్దు కావడానికి స్వామీజీ, అతని భార్య కారణం అని వెలుగు చూడటం కలకం రేపింది. పెళ్లి కొడుక్కి స్వామీజీ, అతని భార్య ఏం చెప్పారు ?, ఎలాంటి వీడియోలు చూపించారు అని వెలుగు చూడటంతో అమ్మాయి కుటుంబ సభ్యులు హడలిపోయారు.

దొంగ స్వామిజీ

దొంగ స్వామిజీ

బెంగళూరులోని కేఆర్ పురంలో ఆనందమూర్తి అలియాస్ మూర్తి స్వామిజీ అలియాస్ ఆనందగురుజీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆనందమూర్తి లతా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. భార్య లతాతో సంసారం చేస్తున్న ఆనందమూర్తి స్వామీజీ అవతారం ఎత్తాడు. సమస్యలతో ఉన్న వారికి సమస్యలు పరిష్కరిస్తాని ఆనందమూర్తి పలువురు అమాయకులను నమ్మించాడు.

యువతిని వలలో వేసుకున్నాడు

యువతిని వలలో వేసుకున్నాడు

ఆనందమూర్తి దగ్గర జోతిష్యం, జాతకాలు చెప్పించుకున్న కొందరు అతను చెప్పినట్లు చెయ్యడంతో కొందదరి సమస్యలు పరిష్కారం కావడంతో ఆ స్వామిజీ ఫేమస్ అయిపోయాడు. ఐదు సంవత్సరాల క్రితం ఓ పెళ్లిలో ఓ యువతితో ఆనందమూర్తికి పరిచయం అయ్యింది. తరువాత ఆమె జాతకం చూసిన ఆనందమూర్తి స్వామిజీ నీకు వివాహం అయిన వెంటనే నీ భర్త చనిపోతాడని, అలా జరగకుండా ఉండాలంటే ప్రత్యేక పూజలు చెయ్యాలని ఆమెకు చెప్పాడు.

యువతి మీద అత్యాచారం..... వీడియో తీసిన శాడిస్టు భార్య

యువతి మీద అత్యాచారం..... వీడియో తీసిన శాడిస్టు భార్య

యువతికి ధైవభక్తి ఎక్కువ అని తెలుసుకున్న ఆనందమూర్తి ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని స్కెచ్ వేశాడు. పూజలు చెయ్యడానికి వెళ్లిన యువతి మీద ఆనందమూర్తి స్వామిజీ అత్యాచారం చేశాడు. ఆ సందర్బంలో ఆనందమూర్తి భార్య లతా భర్త యువతి మీద అత్యాచారం చేస్తుంటే సంతోషంగా నవ్వుకుంటూ వీడియో తీసింది.

వీడియో దెబ్బకు భయపడిపోయిన యువతి

వీడియో దెబ్బకు భయపడిపోయిన యువతి

ఈ విషయం బయటకు చెబితే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, జీవితంలో నీకు పెళ్లికాదని ఆనందమూర్తి బాధితురాలిని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు. నీ రేప్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకూడదంటే నా కోరికలు తీర్చాలని ఆనందమూర్తి ఆ యువతికి టార్చర్ పెట్టాడు. ఐదు సంవత్సరాల నుంచి యువతిని బ్లాక్ మెయిల్ చేసిన ఆనందమూర్తి ఆమె మీద అత్యాచారం చేస్తూనే ఉన్నాడు.

పెళ్లి కొడుక్కి రేప్ వీడియోలు చూపించిన శాడిస్టు

పెళ్లి కొడుక్కి రేప్ వీడియోలు చూపించిన శాడిస్టు

ఇటీవల యువతి పెళ్లి ఫిక్స్ అయ్యింది. నిశ్చితార్థం ఒక్కరోజు ముందు యువతి పెళ్లి రద్దు అయ్యింది, యువతి పెళ్లి రద్దు కావడానికి ఆనందమూర్తి స్వామీజీ, అతని భార్య లతా కారణం అని వెలుగు చూడటం కలకం రేపింది. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతరి మీద ఆనందమూర్తి రేప్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో, ఫోటోలను దొంగ స్వామీజీ, అతని భార్య లతా చూపించారు అని వెలుగు చూడటంతో అమ్మాయి కుటుంబ సభ్యులు హడలిపోయారు.

శాడిస్టు దంపతులు

శాడిస్టు దంపతులు

బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో కేఆర్ పురం పోలీసులు ఆనందమూర్తి, అతని భార్య లతా మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మొత్తం మీద పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన దొంగస్వామి జీ ఆనందమూర్తి, అతని భార్య లతా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+