Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Drug mafia: ప్రముఖ నటి ఇంటిలో క్రైమ్ బ్రాంచ్ సోదాలు, క్లోజ్ ఫ్రెండ్ అరెస్టు, ముంబాయి దెబ్బకు మటాష్!

బెంగళూరు/ ముంబాయి: డ్రగ్స్ మాఫియా కేసుకు సంబంధించి స్యాండిల్ వుడ్ స్టార్, బహుబాష నటి రాగిణి ద్వివేదికి బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు శుక్రవారం రిలీజ్ సినిమా చూపించారు. కోర్టు సెర్చ్ వారెంట్ తో ఉదయం ఒక్కసారిగా నటి రాగిణి ద్వివేది ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన సీసీబీ పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు.

ఇప్పటికే నటి రాగిణి ద్వివేది క్లోజ్ ఫ్రెండ్ రవిశంకర్ ను అరెస్టు చేసిన సీసీబీ పోలీసులు అతను ఇచ్చిన సమాచారం మేరకు రాగిణి ద్వివేది ఇంట్లో సోదాలు చేస్తున్నారు. గురువారం విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్న నటి రాగిణి ద్వివేదికి సీసీబీ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు తరువాత అనేక మంది సెలబ్రిటీలకు చెమటలు పడుతున్నాయి.

 అపార్ట్ మెంట్ లో నటి రాగిణి

అపార్ట్ మెంట్ లో నటి రాగిణి

బెంగళూరు సిటీలోని యలహంక సమీపంలోని జ్యూడీషియల్ లేఔట్ లోని అనన్యా అపార్ట్ మెంట్స్ లో ఫేమస్ నటి రాగిణి ద్వివేది నివాసం ఉంటున్నారు. శుక్రవారం బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనన్యా అపార్ట్ మెంట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి నటి రాగిణి ద్వివేది నివాసం ఉంటున్న ఫ్లాట్ తలుపులు తట్టారు. తలుపులు తీసిన రాగిణి ద్వివేది కుటుంబ సభ్యులు క్రైమ్ బ్రాంచ్ పోలీసులను చూసి షాక్ కు గురైనారు.

నటి నాలుగు మొబైల్స్ సీజ్

నటి నాలుగు మొబైల్స్ సీజ్

నటి రాగిణి ద్వివేది ఇంటిలోకి ప్రవేశించిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇంటిలో ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నటి రాగిణి ద్వివేది ఉపయోగిస్తున్న నాలుగు మొబైల్ ఫోన్లను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు మొబైల్స్ లోని కాల్ డేటాను సీసీబీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిసింది.

నోటీసులు ఇచ్చినా ఢుమ్మా

నోటీసులు ఇచ్చినా ఢుమ్మా

డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో నటి అనికాను ఎన్ సీబీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నటి అనికా ఇచ్చిన సమాచారంతో స్యాండిల్ వుడ్ కు చెందిన కొందరు ప్రముఖులకు డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయని ఎన్ సీబీ, బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విచారణకు హాజరుకావాలని నటి రాగిణి ద్వివేదికి బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే గురువారం నటి రాగిణి ద్వివేది పోలీసుల ముందు విచారణకు హాజరుకాలేదు.

హీరోయిన్ క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడా?

హీరోయిన్ క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడా?

ప్రముఖ నటి రాగిణి ద్వివేది క్లోజ్ ఫ్రెండ్ రవిశంకర్ ను విచారణ చేసిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం అతన్ని అరెస్టు చేశారు. తాను ఆనారోగ్యంతో బాధపడుతున్నానని, సోమవారం విచారణకు హాజరౌతానని గురువారం నటి రాగిణి ద్వివేది ఆమె న్యాయవాదుల సహాయంతో బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నటి రాగిణి విచారణకు హాజరుకాకపోవడంతో బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అనుమానం మరింత ఎక్కువ అయ్యిందని తెలిసింది.

కోర్టులో సెర్చ్ వారెంట్ జారీ

కోర్టులో సెర్చ్ వారెంట్ జారీ

డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు న్యాయస్థానం (కోర్టు)ను ఆశ్రయించారు. నటి రాగిణి ద్వివేది ఇంటిలో సోదాలు చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని సీసీబీ పోలీసులు కోర్టులో మనవి చేశారు. నటి రాగిణి ద్వివేది ఇంటిలో సోదాలు చెయ్యడానికి కోర్టు సెర్చ్ వారెంట్ జారీ చెయ్యడంతో శుక్రవారం ఉదయం సీసీబీ పోలీసులు ఆమె ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చారు.

Recommended Video

    COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
    అవును నిజమే..... సందీప్ పాటిల్ IPS

    అవును నిజమే..... సందీప్ పాటిల్ IPS

    బెంగళూరు నగరంలోని యలహంక సమీపంలోని జ్యుడీషియల్ లేఔట్ లోని అనన్యా అపార్ట్ మెంట్ లోని నటి రాగిణి ద్వివేది ఫ్లాట్ లో సోదాలు చేస్తున్నామని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ అడిషనల్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేమని, విచారణ పూర్తి అయిన తరువాత అన్ని వివరాలు వెళ్లడిస్తామని బెంగళూరు సీసీబీ విభాగం జాయింట్ పోలీసు కమిసనర్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. నటి రాగిణి ద్వివేది ఇంటిలో పోలీసులు సోదాలు చెయ్యడంతో డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉన్న మరికొంత మంది సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+