డీకే శివకుమార్ మీద పగతోనే ఇంత చేశారు. సిద్దరామయ్య వర్గం లీడర్ షాకింగ్ కామెంట్స్!

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరు ? అని పేరు ప్రకటించడానికి నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్ హైకమాండ్ కు సొంత పార్టీ నాయకులతో పెద్ద తలనొప్పి ఎదురైయ్యింది. సీఎం సీటు నీకా ?, నాకా ? అంటూ సిద్దరామయ్య, డీకే శివకుమార్ పోట్లాడుకుంటున్న సమయంలో లేనిపోని లీకులు భలే జోరుగా బయటకు వస్తున్నాయి.

ఇలాంటి సమయంలో సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఏం చెయ్యాలో తెలీక సతమతం అవుతున్నది. ఇదే సమయంలో కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ ను సీబీఐ డైరెక్టర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ అయోమయంలో పడిపోయింది.

Senior Congress MLA Rajanna made sensational comments about CBI Director Praveen Sood and DK Shivakumar

కేవలం డీకే శివకుమార్ ను టార్గెట్ చేసుకుని కేంద్రంలోని బీజేపీ పెద్దలు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ ను సీబీఐ డైరెక్టర్ గా నియమించారని, డీకే శివకుర్ మీద పగ తీర్చుకోవడానికి కేంద్రంలోని కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నారని తుమకూరు జిల్లాలోని మధుగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్, రాజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

డీకే శివకుమార్ మీద పగ తీర్చుకోవాలని కేంద్రంలోని పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజన్న పక్కా సిద్దరామయ్య అనుచరుడు. త్వరలో మా నాయకుడు సిద్దరామయ్య కర్ణాటక సీఎం అవుతారని, అందులో ఎలాంటి అనుమానం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజన్న అంటున్నారు.

Senior Congress MLA Rajanna made sensational comments about CBI Director Praveen Sood and DK Shivakumar

అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజన్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ వైపు ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు. మొత్తం మీద కర్ణాటక రాజకీయాల గురించి ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు. క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో అంటూ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+