Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Shock: మాజీ మంత్రి కిడ్నాప్ కేసులో ట్విస్ట్, కిడ్నాప్ కింగ్ పిన్ కొడుకేనా ?, కారులో అమ్మాయిల దుస్తులు, హనీట్రాప్ ?

బెంగళూరు/ కోలారు/ చింతామణి: కర్ణాటక మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ ను కిడ్నాప్ చేసిన నిందితులు మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి ముప్పుతిప్పలు పెట్టి వదిలేశారు. రూ. 30 కోట్లు ఇస్తే వదిలేస్తాం, లేదంటే లేపేస్తాం అంటూ కిడ్నాపర్లు బెదిరించారు. ఇనుప రాడ్లు, కర్రలతో మూడు రోజులు మాజీ మంత్రిని చిత్రహింసలకు గురి చేశారు. తరువాత చేతికి చిక్కిన డబ్బులు లాక్కొని ఆయన్న నిర్జనప్రదేశంలో వదిలేసి వెళ్లిపోవడం కలకలం రేపింది. అయితే మాజీ మంత్రి కిడ్నాప్ కేసులో ఆయన కొడుకు పాత్ర ఉంది ? అని ఓ కన్నడ దినపత్రిక కథనం ప్రచురించడం కలకలం రేపింది. మాజీ మంత్రి కారులో అమ్మాయిలు వేసుకునే పంజాబీ డ్రెస్ దుప్పాటాలు చిక్కడంతో హనీట్రాప్ జరిగిందా అంటూ కథ మరో కొత్త మలుపు తిరిగింది. ఆర్థిక లావాదేవీల కారణంగా ఏమైనా కిడ్నాప్ జరిగిందా ; అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

 పక్కా స్కెచ్ తో ఎంట్రీ

పక్కా స్కెచ్ తో ఎంట్రీ

కోలారు సమీపంలోని బెగ్లిహోసహళ్ళి ప్రాంతంలో మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కు సొంత ఫామ్ హౌస్ ఉంది. నవంబర్ 25వ తేదీన వర్తూరు ప్రకాష్ కోలారు సమీపంలోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో కారు డ్రైవర్ సునీల్ తో పాటు వర్తూరు ప్రకాష్ ఆయన కారులో బెంగళూరుకు బయలుదేరారు. రెండు కార్లలో 8 మంది దుండగులు ముఖాలకు మాస్కులు వేసుకుని వెళ్లి మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కారును, ఆయన కారు డ్రైవర్ సునీల్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

 డబ్బులు ఇచ్చిన మాజీ మంత్రి

డబ్బులు ఇచ్చిన మాజీ మంత్రి

మాకు రూ. 30 కోట్లు ఇవ్వకుంటే నిన్ను చంపేస్తామని కిడ్నాపర్లు మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ ను బెదిరించారని సమాచారం. డబ్బులు ఇవ్వడానికి మాజీ మంత్రి నిరాకరించడంతో మూడు రోజుల పాటు ఆయన్ను ఇనుప రాడ్లతో దాడి చేసి చిత్రహింసలు పెట్టారని తెలిసింది. మాజీ మంత్రి కారు డ్రైవర్ సునీల్ ను సైతం కిడ్నాపర్లు చితకబాదేశారని తెలిసింది. అనంతరం డబ్బులు ఇవ్వడానికి మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ అంగీకరించాడని తెలిసింది. ఇదే సమయంలో కిడ్నాపర్లకు మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ అనుచరుడు రూ. 48 లక్షలు సమర్పించుకున్నాడని వెలుగు చూసింది.

పోలీసుల భయమా ? డబ్బు వచ్చిందనా

పోలీసుల భయమా ? డబ్బు వచ్చిందనా

మూడు రోజులు మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ ను చిత్రహింసలకు గురి చేసిన కిడ్నాపర్లు పోలీసులకు చిక్కిపోతామనే భయంతో చివరి ఆయన్ను హోస్ కోటే సమీపంలోని శివనాపుర గ్రామం సమీపంలో అర్దరాత్రి వదిలేసి ఆయన కారు ఎత్తుకుని వెళ్లిపోయారు. స్థానికుల సహాయంతో బెంగళూరులోని కేఆర్ పురం చేరుకున్న మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ అక్కడి సత్యసాయి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తరువాత ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ ఆయన కారు చిక్కే వరకు పోలీసులకు మాత్రం ఫిర్యాదు చెయ్యకపోవడం అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

కారులో అమ్మాయిల దుస్తులు, హనీట్రాప్ ?

కారులో అమ్మాయిల దుస్తులు, హనీట్రాప్ ?

డిసెంబర్ 1వ తేదీ రాత్రి బెంగళూరులోని బెళ్లందూరులోని స్మశానవాటికలో మాజీ మంత్రి వర్తూరు ప్రకాస్ పార్చనూర్ కారు గుర్తించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ బెళ్లందరూరు చేరుకుని అక్కడి పోలీసులకు తానను కిడ్నాప్ చేశారని కేసు పెట్టారు. మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ అనుచరుడు నయాజ్ అనే వ్యక్తి కోలారు సమీపంలోని కాఫీ డే దగ్గర కిడ్నాపర్లకు రూ. 48 లక్షలు ఇచ్చాడని, రెండు రోజుల తరువాత తనను వదిలేశారని మాజీ మంత్రి పోలీసులకు చెప్పారు. అయితే మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కారులో అమ్మాయిలు వేసుకునే దుప్పటాతో పాటు కారం పొడి చిక్కడంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు. మాజీ మంత్రిని కిడ్నాప్ చెయ్యడానికి ఏమైనా హనీట్రాప్ జరిగిందా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

 మాజీ మంత్రి రెండో పెళ్లి

మాజీ మంత్రి రెండో పెళ్లి

మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయారు. కొన్ని సంవత్సరాల క్రితం మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కోలారు జిల్లాలోని టేకాల్ ప్రాంతంలో ఓ ఫామ్ హౌస్ కొనుగోలు చేశారు. ఫామ్ హోస్ చూసుకోవడానికి ఆయన ఓ మహిళను నియమించారు. మొదట టీచర్ గా ఆమె అందరికీ పరిచయం అయ్యిందని, తరువాత ఆమెను మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ రెండో పెళ్లి చేసుకున్నాడని ఓ కన్నడ దినపత్రిక కథనం ప్రచురించింది.

కిడ్నాప్ చేసింది కొడుకేనా ?


మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ పెళ్లి చేసుకున్న మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారని కన్నడ దినపత్రిక వివరించింది. మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ భార్య మొదటి కొడుకు కిడ్నాప్ చేశాడని పోలీసులు ఎక్కువగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ బెంగళూరు-మదనపల్లె రహదారిలోని చింతామణి సమీపంలో కొన్ని భూములు కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేశాడని, ఆ కారణంతో ఎవరైనా కిడ్నాప్ చేశారా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Recommended Video

    Indian-American Mala Adiga Appointed As Jill Biden's Policy Director
     ఒక్క రూపాయి బాకీ లేదు

    ఒక్క రూపాయి బాకీ లేదు

    తన కారుతో కిడ్నాపర్లు పరారైన తరువాత మూడు రోజులకు పోలీసులకు చిక్కింది. ఆ మద్య కాలంలో అమ్మాయిలతో వారు తిరిగి ఉండవ వచ్చు. నా కారులో అమ్మాయిల దుప్పాటా చిక్కే అవకాశం లేదు అని మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ అంటున్నారు. తాను ఎవర్వి దగ్గర ఒక్క రూపాయి అప్పు చెయ్యలేదని, ఎవ్వరికి తాను డబ్బులు బాకీ లేనని మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ అంటున్నారు. మహారాష్ట్రకు చెందిన కొందరితో మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ డైరీ ఫామ్ విషయంలో గొడవపడ్డాడని ఓ కన్నడ దినపత్రిక కథనం ప్రచురించింది. కిడ్నాపర్లు కన్నడ, తమిళ బాష మాట్లాడారని, బెంగళూరు బాస్ చెబితే నిన్ను వదిలేస్తామని మాజీ మంత్రితో అన్నారని వెలుగు చూసింది. కిడ్నాపర్లు మాట్లాడిన ఆ బెంగళూరు బాస్ ఎవరు ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+