Social Media: ఇంటర్నెట్ ఇన్వెస్ట్మెంట్, 10 మంది అమ్మాయిలతో ఎంజాయ్, కర్మ+గ్రహాలు ?!
బెంగళూరు/ తుమకూరు: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో అమాయకులైన అమ్మాయిలకు వలవేశాడు. తాను ఐఏఎస్, కేఏఎస్ పరీక్షలు రాయడానికి శిక్షణ తీసుకుంటున్నానని అమ్మాయిలను నమ్మించాడు. ఖరీదైన కార్ల ముందు, పెద్దపెద్ద భవనాలు, మాల్స్, కార్పోరేట్ కంపెనీల ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసి అమ్మాయిలను ఆకర్షించాడు. బ్యూటీపార్లల్ బ్యూటీతో సహజీవనం చేస్తున్న కేటుగాడు ఇప్పటి వరకు ప్రేమ పేరుతో 10 మందిని లొంగదీసుకుని వారితో ఎంజాయ్ చేసి చేతికి చిక్కింది లాక్కొంటున్నాడు. ఇంటర్ విద్యార్థినితో గేమ్స్ ఆడిన ఆ కిలాడి పోలీసులకు చిక్కడంతో అసలు విషయం తెలుసుకున్న అతనితో టచ్ లో ఉన్న అమ్మాయిలకు, వీడి స్టోరీ తెలుసుకున్న సామాన్య ప్రజలకు మైండ్ బ్లాక్ అయ్యింది.

దివాకర్ పేరు బాగలేదని హర్షా
కర్ణాటకలోని తుమకూరు జిల్లా తురువేకెరెలో దివాకర్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దివాకర్ పేరు బాగాలేదని హర్షా అనే నిక్ నేమ్ తగిలించుకున్నాడు. దివాకర్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటున్నాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో అనేక పోస్టులు పెడుతున్నాడు.

ఇంటర్ చదవి ఐఏఎస్ బిల్డప్
దివాకర్ పీయూసీ (ఇంటర్) వరకు చదివాడు. సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిలకు రిక్వెస్ట్ పెట్టి వాళ్లతో పరిచయం పెంచుకున్నాడు. అయితే తాను ఐఏఎస్, కేఏఎస్ పరీక్షలు రాయడానికి శిక్షణ తీసుకుంటున్నానని, కచ్చితంగా తాను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతానని, ఆ నమ్మకం తనకు ఉందని పరిచయం అయిన అమాయకులైన అమ్మాయిలకు దివాకర్ మాయమాటలు చెప్పాడు.

ఫోజులు చూసి పడిపోయిన అమ్మాయిలు
దివాకర్ బెంగళూరు చేరుకుని నివాసం ఉంటున్నాడు. బెంగళూరులో ఖరీదైన కార్ల ముందు, పెద్దపెద్ద భవనాలు, మాల్స్, కార్పోరేట్ కంపెనీల ముందు నిలబడిన దివాకర్ సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసి అమ్మాయిలను ఆకర్షించాడు. తాను శ్రీమంతుడు అంటూ చాలా మంది అమ్మాయిలను పరిచయం చేసుకున్నాడు. తరువాత వాళ్ల ఫోన్ నెంబర్లు తీసుకుని పదేపదే ఫోన్లు చేస్తూ బాతాకాని పెట్టుకున్నాడు.

10 మంది అమ్మాయిలతో జల్సా
సోషల్ మీడియాలో పరిచయం అయిన కొందరు అమాయకులైన అమ్మాయిలను నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఇప్పటి వరకు 10 మంది అమ్మాయిలను లొంగదీసుకున్నాడు. మాయమాటలతో నేరుగా కలిసిన సమయంలో వారితోనే డబ్బులు ఎక్కువ ఖర్చుపెట్టించాడు. చివరికి రహస్య ప్రాంతాలకు పిలుచుకుని వెళ్లి ఆ పది మంది అమ్మాయిలతో జల్సా చేసి కామం తీర్చుకున్నాడని వెలుగు చూసింది.

బ్యూటీపార్లల్ బ్యూటీతో సహజీవనం
బెంగళూరుకు చెందిన ఓ బ్యూటీపార్లల్ బ్యూటీ కూడా దివాకర్ వలలో పడిపోయింది. సొంతంగా బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్న ఆ అమ్మాయి ఇంటిని అద్దెకు తీసుకుని దివాకర్ తో సహజీవనం చేసి అతని అవసరాలకు డబ్బులు ఇచ్చింది. చాలాకాలం దివాకర్, బ్యూటీపార్లల్ బ్యూటీ ఒకే ఇంటిలో ఉంటూ సహజీవనం చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే దివాకర్ అసలు స్వరూపం తెలుసుకున్న బ్యూటీపార్లల్ అమ్మాయి అతనికి దూరం అయ్యింది.

ఇంటర్ అమ్మాయి దెబ్బతో ఫినిష్
ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయిని దివాకర్ అతని మాయమాటలతో లొంగదీసుకున్నాడు. తరువాత అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆమెతో ఎంజాయ్ చేసి ఇంతకాలం కామం తీర్చుకున్నాడు. కొంతకాలంగా దివాకర్ అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వేరే ఫోన్ నెంబర్ ఉపయోగిస్తున్నాడు. తాను మోసపోయానని గుర్తించిన ఇంటర్ అమ్మాయి పోలీసు కేసు పెట్టడంతో దివాకర్ అసలు బండారం బయటపడింది.

విమానం ఎక్కించిన పోలీసులు
ఇంటర్ అమ్మాయి ఫిర్యాదు చెయ్యడంతో బ్యాడరహళ్ళి పోలీసులు దివాకర్ ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో దివాకర్ చెబుతున్న విషయాలు తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఇప్పటి వరకు దివాకర్ వలలో 10 మందికి పైగా అమ్మాయిలు పడ్డారని, వారి జీవితాలు నాశనం అయ్యాయని పోలీసులు అంటున్నారు. దివాకర్ ను మరింత విచారణ చెయ్యడానికి పోలీసులు అతన్ని విమానం ఎక్కించి వివరాలు సేకరిస్తున్నారు.
Recommended Video

ఇంటర్నెట్ ఇన్వెస్ట్ మెంట్
మొత్తం మీద ఇంటర్ చదివినిన దివాకర్ కేవలం ఇంటర్నెట్ బిల్ ఇన్వెస్ట్ మెంట్ పెట్టి 10 మంది అమ్మాయిలను వలలో వేసుకుని ఎంజాయ్ చేశాడని వెలుగు చూడటంతో అతడి వలలో పడిన అమ్మాయిల మైండ్ బ్లాక్ అయ్యింది. దివాకర్ బాధితులు ఇంకా ఎవరైనా అతని మీద కేసు పెడితో వారి వివరాలు సీక్రెట్ గా పెడుతామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications