Student: నమాజ్ చేసి కాలేజ్ కు వెళ్లిన అబ్బాయి, ఫోన్ చేసి పిలిపించి పొడిచి చంపేశారు, ఆ రోజు ఏం జరిగింది?

బెంగళూరు: కాలేజ్ కు వెలుతున్న కొడుకును బాగా చదివించాలని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. కాలేజ్ కు వెళ్లి చదువుకుంటున్న యువకుడు అతని స్నేహితులతో కలిసి హ్యాపీగా తిరుగుతున్నాడు. ఇటీవల కాలేజ్ లో కల్చరల్ కార్యక్రమాలలో ఆ అబ్బాయి చురుకుగా పాల్గోన్నాడు. ఆ సందర్బంలో కాలేజ్ అబ్బాయిల మద్య గొడవ జరిగింది. తరువాత సర్దుకుపోయిన యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాలేజ్ అబ్బాయి నమాజ్ కు వెళ్లి ప్రార్థనలు చేసి తరువాత మళ్లీ కాలేజ్ కు వెళ్లాడు. కాలేజ్ లో ఉన్న యువకుడికి ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పి బయటకు పిలిపించి కాలేజ్ సమీపంలోనే దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

ఇంటర్ అబ్బాయి

ఇంటర్ అబ్బాయి

బెంగళూరు నగరంలోని కేజీ హళ్లిలో అర్బజ్ (18) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కేజీ హళ్లిలోని ఓ కాలేజ్ లో అర్బజ్ పీయూసీ (ఇంటర్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజ్ కు వెలుతున్న కొడుకు అర్బజ్ ను బాగా చదివించాలని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. కాలేజ్ కు వెళ్లి చదువుకుంటున్న అర్బజ్ అతని స్నేహితులతో కలిసి హ్యాపీగా తిరుగుతున్నాడు.

కాలేజ్ లో చిన్న గొడవ

కాలేజ్ లో చిన్న గొడవ

ఇటీవల కాలేజ్ లో రెండు రోజుల పాటు కల్చరల్ కార్యక్రమాలు జరిగాయి. ఆ కార్యక్రమాల్లో అర్బ, అతని స్నేహితులు చాలా చురుకుగా పాల్గోన్నాడు. ఆ సందర్బంలో కాలేజ్ అబ్బాయిల మద్య గొడవ జరిగింది. ఆ గొడవల్లో అర్బజ్ తో పాటు అతని స్నేహితులు ఉన్నారని తెలిసింది. తరువాత సర్దుకుపోయిన కాలేజ్ యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నమాజ్ చేసి కాలేజ్ కు వెళ్లిన యువకుడు

నమాజ్ చేసి కాలేజ్ కు వెళ్లిన యువకుడు

గురువారం కూడా అర్బజ్ తో పాటు అతని స్నేహితులతో కొందరు విద్యార్థులు గొడవపడ్డారు. ఆ సందర్బంలో కాలేజ్ లెక్చరర్స్ బుద్దిమాటలు చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిసింది. శుక్రవారం మద్యాహ్నం అర్బజ్ కాలేజ్ సమీపంలోని మసీదుకు వెళ్లి నమాజ్ చేశాడు. అర్బజ్ నమాజ్ కు వెళ్లి ప్రార్థనలు చేసి తరువాత మళ్లీ కాలేజ్ కు వెళ్లాడు.

ఫోన్ చేసి పిలిపించి చంపేశారు

ఫోన్ చేసి పిలిపించి చంపేశారు

శుక్రవారం మద్యాహ్నం 2.30 గంటల సమయంలో అర్బజ్ అతను చదువుతున్న కాలేజ్ మూడో అంతోస్తులో ఉన్నాడు. ఆ సందర్బంలో కొందరు కాలేజ్ అబ్బాయిలు అర్బజ్ కు ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పి బయటకు పిలిపించారు. కాలేజ్ కు 50 మీటర్ల సమీపంలోకి అర్బజ్ ను పిలుచుకుని వెళ్లి కత్తులతో దారుణంగా పొడిచేశారు. తీవ్రగాయాలైన అర్బజ్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అర్బజ్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని కేజీ హళ్లి పోలీసులు తెలిపారు.

ఏం జరిగింది ?, కూపీలాగుతున్న పోలీసులు

ఏం జరిగింది ?, కూపీలాగుతున్న పోలీసులు

అర్బజ్ ను హత్య చేసిన వారి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా అర్బజ్ చదువుతున్న కాలేజ్ కు శనివారం సెలవు ప్రకటించారు. మొత్తం మీద చిన్న విషయంలో ఇంటర్ చదువుతున్న అర్బజ్ హత్యకు గురి కావడంతో కేజీ హళ్లి ప్రాంతంతో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+