Super Sketch: హోటల్ లో పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఉన్నారు రండి, బిల్డర్ కు రూ. 13 లక్షలు, పాపం !
బెంగళూరు/ ముంబాయి: ప్రముఖ నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికిదారేది సినిమా ఫేమ్ ప్రణీత పేరుతో ఓ ప్రముఖ బిల్డర్ సంస్థ యజమానికి కుచ్చుటోపీ పెట్టారు. బహుబాష నటి ప్రణీత హోటల్ లో ఉన్నారని, మీరు అక్కడికి వస్తే మీరు అనుకున్న పని పూర్తి అవుతుందని నమ్మించి బిల్డర్ అమర్ నాథ్ రెడ్డిని స్టార్ హోటల్ కు తీసుకెళ్లారు. అంతే మాయమాటలు చెప్పి మస్కా కొట్టి బిల్డర్ దగ్గర రూ. 13. 50 లక్షలు తీసుకుని అతన్ని అదే హోటల్ లో వదిలేసి మాయం అయిపోవడంతో కథ రసవత్తరంగా మారింది.

ఫేమస్ హీరోయిన్
ప్రముఖ కన్నడ నటి ప్రణీత సుభాష్ కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికిదారేది సినిమాలో నటించిన ప్రణీత కిర్రాకు కిర్రాకు అంటూ కుర్రకారును ఆకట్టుకుంది. ఇక తెలుగులో ప్రముఖ హీరోలతో పాటు బాలీవుడ్, తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తున్న ప్రణీత అన్ని బాషాల్లో తనకుంటే ప్రత్యేకంగా అభిమానులను సంపాధించుకుంది.

బిల్డర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ చేస్తాం
కే. అమరనాథ్ రెడ్డి అనే ఆయన ఎస్ బీ గ్రూప్ అండ్ డెవలపర్స్ కంపెనీని నిర్వహిస్తున్నారు. తమ ఎస్ బీ గ్రూప్ సంస్థకు బహుబాష నటి ప్రణీతను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవాలని, మా కంపెనీని డెవలప్ చేసుకోవాలని ఆ సంస్థ నిర్వహకులు అమరనాథ్ రెడ్డి ప్రయత్నాలు చేశారని తెలిసింది. ఈ విషయాన్ని అమరనాథ్ రెడ్డి ఆయన స్నేహితులు, సన్నిహితుల దగ్గర చెప్పారని సమాచారం.

హోటల్ లో ప్రణీత ఉన్నారు వచ్చేయండి
బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రముఖ హోటల్ లో హీరోయిన్ ప్రణీత ఉన్నారని, మీరు అక్కడికి వస్తే మీరు అనుకున్న పని పూర్తి చేయిస్తామని మహమ్మద్ జునాయత్, వర్షా అనే ఇద్దరు వ్యక్తులు బిల్డర్ అమరనాథ్ రెడ్డికి చెప్పారు. హమ్మయ్య, మా కంపెనీకి మంచి రోజులు వచ్చాయి అంటూ అమరనాథ్ రెడ్డి జనాయత్, వర్షా చెప్పిన హోటల్ లోకి వెళ్లారు.

రూ. 13. 50 లక్షలకు డీల్
మీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా పని చెయ్యడానికి హీరోయిన్ ప్రణీత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, మీరు డబ్బులు ఇస్తే అగ్రిమెంట్ కాగితాల మీద ఆమె సంతకాలు చేస్తారని జనాయత్, వర్షా బిల్డర్ అమరనాథ్ రెడ్డికి చెప్పారు. వెంటనే బిల్డర్ అమరనాథ్ రెడ్డి రూ. 13. 50 లక్షలు జనాయత్, వర్షాలకు ఇచ్చారు. హోటల్ లోని గదిలో ఉన్న ప్రణీత దగ్గరకు వెళ్లి సంతకాలు చేయించుకుని వస్తామని చెప్పిన జనాయత్, వర్షా అక్కడి నుంచి మాయం అయ్యారు.

గంటలో గోవిందా గోవింద
హోటల్ లోని గదిలో ప్రణీత దగ్గర అగ్రిమెంట్ కాగితాల మీద సంతకాలు చేయించుకుని వస్తామని చెప్పి వెళ్లిన వారు గంట సేపు అయినా వారి ఆచూకిలేకపోవడంతో అమరనాథ్ రెడ్డి ఆందోళన చెందాడు. వెంటనే జనాయత్, వర్షాలను ఫోన్ చేస్తే వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వచ్చాయి. హోటల్ లో గంటల గంటలు వేచి చూసిన బిల్డర్ అమరనాథ్ రెడ్డి మోసం జరిగిందిని గుర్తించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తరువాత సార్ మోసం చేశారు అంటూ హైగ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫ్రెండ్ చెప్పాడని డీలింగ్
తనకు తన స్నేహితుడు ప్రశాంత్ అనే వ్యక్తి ద్వారా జనాయత్, వర్షా పరిచయం అయ్యారని, వారు ఇలా మోసం చేస్తారని తాను ఊహించలేదని బిల్డర్ అమరనాథ్ ఫిర్యాదు చేశారని, కేసు విచారణలో ఉందని బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసులు తెలిపారు. ఈనెల 10వ తేదీన ప్రముఖ హోటల్ లో ఈ హైడ్రామా జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు.

బాలీవుడ్ సినిమా షూటింగ్ లో ప్రణీత !
ప్రస్తుతం ప్రణీత ఓ బాలీవుడ్ సినిమాలో నటించడానికి కునూమనాలికి వెళ్లిందని, ఆమె బెంగళూరులో లేరని వెలుగు చూసింది. బాలీవుడ్ సినిమాలో శిల్పశెట్టి, అనుపమ్ ఖేర్ తదితరులతో కలిసి బహుబాష నటి ప్రణీత నటిస్తోంది. మొత్తం మీద మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తామని బిల్డర్ అమరనాథ్ రెడ్డిని నమ్మించి నిలువునా ముంచేశారని వెలుగు చూడటంతో హీరోయిన్ ప్రణీత అభిమానులు షాక్ కు గురైనారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications