Swamiji: స్వామీజీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్, డెత్ నోట్ లో ఓ పేజీ మాయం ?, ఫోన్లు చేసిన ఆ లేడీ ఎవరు!

బెంగళూరు/మాగడి: ప్రముఖ మఠాధిపతి ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. రాత్రి మఠంలోని తన గదిలోకి వెళ్లిన స్వామీజీ ఉదయం అదే గదిలో శవమై కనిపించారు. గదిలోని కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మఠానికి చెందిన భక్తులు హడలిపోయారు. స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు మూడు పేజీల డెత్ నోట్ రాశారని పోలీసులు అంటున్నారు.

స్వామీజీ డెత్ నోట్ లోని వివరాలను పోలీసులు బయటకు చెప్పలేదు. అయితే స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు ఐదు పేజీల డెత్ నోట్ రాశారని, అందులో మొదటి పేజీ, చివరి మూడు పేజులు పోలీసులకు చిక్కాయని, మధ్యలో మరో పేజీ మాయం అయ్యిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

ఫేమస్ మఠం

ఫేమస్ మఠం

బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని మాగడి తాలుకాలో కంచుగల్ బండే మఠం ఉంది. కుంచుగల్ బండే మఠం మఠాధిపతిగా బసవలింగ స్వామీజీ (45) పని చేస్తున్నారు. కంచుగల్ బండే మఠానికి రామనగర జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో మంచి పేరు ఉంది. ఇటీవల కంచుగల్ బండే మఠం 25 సంవత్సరాల వార్షికోత్సవాలు మఠాధిపతి బసవలింగ స్వామీజీ ఆధ్వర్యంలో చాలా ఘనం నిర్వహించారు.

ఆత్మహత్య చేసుకున్న స్వామీజీ

ఆత్మహత్య చేసుకున్న స్వామీజీ

కంచుగల్ బండే మఠాధిపతి బసవలింగ స్వామీజీ భక్తుల దగ్గర మంచి పేరు సంపాధించుకున్నారు. మఠాధిపతి బసవలింగ స్వామీజీ నిత్యం సమాజసేవ చేస్తూ భక్తులకు దగ్గర అయ్యారు. రాత్రి మఠంలోని తన గదిలోకి వెళ్లిన బసవలింగ స్వామీజీ ఉదయం అదే గదిలో ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించడంతో కంచుగల్ బండే మఠంలోని భక్తులు, సిబ్బంది హడలిపోయారు.

డెత్ నోట్ కలకలం

డెత్ నోట్ కలకలం

కంచుగల్ బండే మఠంలో మఠాధిపతి బసవలింగ స్వామీజీ బసచేసే గదిలోని కిటికీకి ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మఠానికి చెందిన భక్తులు హడలిపోయారు. బసవలింగ స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు మూడు పేజీల డెత్ నోట్ రాశారని పోలీసులు అన్నారు. బసవలింగ స్వామీజీ డెత్ నోట్ లోని వివరాలను పోలీసులు బయటకు చెప్పలేదు.

ఆ లేడీ ఎవరు

ఆ లేడీ ఎవరు

బసవలింగ స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు ఐదు పేజీల డెత్ నోట్ రాశారని, అందులో మొదటి పేజీ, చివరి మూడు పేజులు పోలీసులకు చిక్కాయని, మధ్యలో మరో పేజీ మాయం అయ్యిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. బసవలింగ స్వామీజీ రాసిన డెత్ నోట్ లో ఓ మహిళ పేరు ప్రస్తావించారని, ఆమె టార్చర్ ఎక్కువ అయ్యిందని స్వామీజీ డెత్ నోట్ లో రాశారని ప్రముఖ కన్నడ టీవీ చానల్ న్యూస్ ప్రసారం చేసింది.

25 ఏళ్లుగా కాపాడుకుంటున్నా

25 ఏళ్లుగా కాపాడుకుంటున్నా

25 సంవత్సరాలుగా తాను ఎంతో కష్టపడి మఠం బాగోగులు చూసుకుంటున్నానని, భక్తుల దగ్గర ఇంతకాలం మంచి పేరు తెచ్చుకున్నానని, ఇటీవల గుర్తు తెలియని మహిళతో పాటు కొందరు వ్యక్తులు తనకు ఫోన్లు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని, కనపడని శత్రువులు తనకు ఎక్కువ అయ్యారని స్వామీజీ మొదటి పేజీలో రాశారని తెలిసింది.

ఆ పేజీ ఏమైయ్యింది?

ఆ పేజీ ఏమైయ్యింది?

తరువాత పేజీ మాయం కావడంతో అసలు ఏం జరిగింది ? అని అంతు చిక్కక బసవలింగ స్వామీజీ శిష్యులు అందోళన చెందుతున్నారు. మొత్తం మీద స్వామీజీ డెత్ నోట్ లో ఒక పేజీ మిస్ కావడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. మఠంలో స్వామీజీ గదిలో డెత్ నోట్ లోని ఒక పేజీ ఏవరైనా మాయం చేశారా ? అని రామనగర జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+