Swamiji: హైడ్రామా, జైల్లో స్వామీజీకి ఛాతిలో నొప్పి, ఖైదీనెంబర్ 2261, జిల్లా ఆసుపత్రిలో చికిత్స, మురుగా!
బెంగళూరు/చిత్రదుర్గ: అక్కమ్మదేవి విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరును అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపించారు. తన మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణను చిత్రదుర్గ కోర్టు వాయిదా వేసిన రోజే శివమూర్తి మురుగా శరణరును పోలీసులు అరెస్టు చేశారు.
చిత్రదుర్గా జిల్లా జైలుకు తరలించిన కొన్ని గంటల్లోనే స్వామీజీకి ఛాతి నొప్పి రావడంతో ఆయన్ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఆసుపత్రి చుట్టూ పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా జైలులో స్వామీజీ శివమూర్తి మురుగా శరణరుకు అధికారులు ఇప్పటికే ఖైదీనెంబర్ 2261 కేటాయించేశారు.

కర్ణాటకలో కలకలం
చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు కర్ణాటకలో మంచి పేరుప్రతిష్టలు ఉన్నాయి. మురుగా మఠం ఆధీనంలోని అక్కమదేవి విద్యాసంస్థల్లో చదువుకుంటూ హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు మైనర్ అమ్మాయిలు శివమూర్తి మురగా శరణరు మామీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఇటీవల కేసు పెట్టడం కర్ణాటకలో కలకలం రేపింది.

అమ్మాయిల స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న కోర్టు
బాధితులు అయిన అమ్మాయిలు, వాళ్ల తల్లిదండ్రులు హాజరైనారు. అమ్మాయిల తరుపున కర్ణాటక హైకోర్టు న్యాయవాది శ్రీనివాస్ హాజరైనారు. ఆ సందర్బంలో న్యాయమూర్తి జస్టిస్ కోమలా మిగిలిన న్యాయవాదులు అందరిని బయటకు పంపించేశారు. అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యుల నుంచి న్యాయమూర్తి జస్టిస్ కోమలా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత అమ్మాయిల నుంచి వివరాలు సేకరించిన న్యాయమూర్తి జస్టిస్ కోమలా స్వామీజీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేశారు.

బెయిల్ వస్తుందని ఊహించుకున్న స్వామీజీ
మైనర్ అమ్మాయిలు కేసు పెట్టడంతో డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు తరపు న్యాయవాది కేఎన్, విశ్వనాథ్ ఆగస్టు 29వ తేదీన స్వామీజీకి ముందస్తు జామీను మంజూరు చెయ్యాలని చిత్రదుర్గాలోని సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.. శుక్రవారం తనకు బెయిల్ వస్తుందని డాక్టర శివమూర్తి మురుగా శరణరు స్వామీజీ ఊహించుకున్నారు.

అర్దరాత్రి ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు
అక్కమ్మదేవి విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరును అరెస్టు చేసిన పోలీసులు చిత్రదుర్గా జిల్లా జైలుకు పంపించడం హాట్ టాపిక్ అయ్యింది.

స్వామీజీకి టూత్ పేస్ట్, సబ్బు, బట్టలు
గురువారం అర్దరాత్రి చిత్రదుర్గా జిల్లా ఆసుపత్రిలో శివమూర్తి మురుగా శరణరు స్వామీజీకి వైద్యపరీక్షలు చేయించిన తరువాత ఆయన్ను శుక్రవారం వేకువ జామున 3 గంటలకు చిత్రదుర్గా జిల్లా జైలుకు తరలించారు. శుక్రవారం ఉదయం స్వామీజీ శిష్యులు జైలుకు వెళ్లి ఆయనకు టూత్ పేస్ట్, బ్రెష్, సబ్బు, దుస్తులు ఇచ్చారు. శిష్యులు జైలుకు వెళ్లిన కొంత సమయానికి స్వామీజీ అనారోగ్యానికి గురైనారు.

ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చికిత్స.... ఖైదీనెంబర్ 2261
చిత్రదుర్గా జిల్లా జైలుకు తరలించిన కొన్ని గంటల్లోనే స్వామీజీకి ఛాతి నొప్పి రావడంతో ఆయన్ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. మఠాధిపతి శివమూర్తి మురగాకు ఛాతీ నొప్పి రావడంతో మొదట ఈసీజీ తీశామని, వైద్యపరీక్ష్లలు చేస్తున్నామని చిత్రదుర్గా జిల్లా ఆసుపత్రి వైద్యులు అంటున్నారు, చిత్రదుర్గా జిల్లా ఆసుపత్రి చుట్టూ పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా జైలులో స్వామీజీ శివమూర్తి మురుగా శరణరుకు అధికారులు ఇప్పటికే ఖైదీనెంబర్ 2261 కేటాయించేశారు.












Click it and Unblock the Notifications