కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం, టార్గెట్ 28, మిత్రపక్షాలకు షాక్ ఇస్తున్న లీడర్స్!
బెంగళూరు: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కింద ఎన్‌డీఏ కూటమిని ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కోవడానికి సిద్దం అయ్యాయి. కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, డీఎంకే పార్టీలతో సహా ప్రధానంగా వామపక్షాలు కలిసి ఉన్నాయి. అయితే కర్నాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి
సీట్ల కేటాయింపుపై ప్రతిపక్ష పార్టీలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరి రానున్న రోజుల్లో ఈ పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి. అయితే కర్ణాటక విషయానికి వస్తే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తాయని ఇప్పటికే ఆ పార్టీ నాయకులు లీకులు ఇచ్చారు. కర్ణాటకలో ఆప్ (ఏఏపీ) ఉనికి ఉన్నప్పటికి ఈ నిర్ణయానికి రావడం ఖాయం. ఎందుకంటే కర్ణాటకలో ఆప్ ఉనికిని కలిగి ఉంది కానీ ఆ పార్టీ నాయకులకు గెలిచేంత బలం లేదని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త, ఎమ్మెల్సీ బీకే. హరిప్రసాద్ తెలిపారు. ఈ లెక్కల ప్రకారం కర్ణాటకలోని మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. కూటమి భాగస్వామ్య పక్షాలు ఇతర రాష్ట్రాల్లో తమ ఉనికికి అనుగుణంగా సీట్లు కేటాయించే విషయంలో చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు అంటున్నారు.
కర్ణాటకలో ఆప్ కొత్త పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తన అభ్యర్థులను 209 నియోజకవర్గాల్లో స్థానాల్లో) నిలబెట్టింది. అయితే కేవలం 0.6 శాతం ఓట్లను మాత్రమే ఆప్ సాధించగలిగింది. సీపీఐ, సీపీఐ (ఎం) 0.02 శాతం, 0.06 శాతం చొప్పున లాభపడ్డాయి. కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల కూటమిలోని పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతివ్వాల్సి ఉంటుంది.
దీనిపై మరికొద్ది రోజుల్లో నేతలు చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. బెంగళూరులో ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం రాష్ట్ర శాఖ సీనియర్ ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ మరణంతో ఆ సమావేశం రద్దు అయ్యింది. తరువాత రాహుల్ గాంధీ ఢిల్లీ వెళ్లిపోయారు.
మొత్తం మీద కర్ణాటకలో మంచి మెజారిటీ ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే ఊపుతో లోక్ సభ ఎన్నికల్లో 28 నియోజక వర్గాల్లో పోటీ చెయ్యాలని బలంగా నిర్ణయించుకుందని తెలిసింది. అయితే కాంగ్రెస్ కు దీటుగా సీట్లు పంపకాల్లో పోరడటానికి కర్ణాటకలో ఒక్క డీఎంకే పార్టీకి మాత్రమే అవకాశం ఉంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications