డీకే శివకుమార్ మీద నమోదైన ఆ కేసు రద్దు, రెండు కేసులకు స్టే, తమిళనాడుతో!
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీద నమోదు అయిన కేసుల నుంచి ఆయన ఒక్కొక్క కేసు నుంచి విముక్తి పొందుతున్నారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్‌పై నమోదు అయిన ఒక కేసును కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది, అయితే మరో రెండు కేసుల్లో స్టే విధించింది. ప్రస్తుతానికి డీకే శివకుమార్ హైకోర్టు ఆదేశాలతో ఊపిరిపీల్చుకున్నారు. హైకోర్టు స్టే ఇవ్వకుంటే డీకేశీ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తమిళనాడు సరిహద్దులో మేకేదాటు డ్యామ్ నిర్మాణ ప్రాజెక్టును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో డీకే శివకుమార్ చేపట్టిన పాదయాత్రలో కరోనా నిబంధనలను ఉల్లంఘించి అంటువ్యాధులు వ్యాపింపజేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి డి.కే శివకుమార్ మీద బెంగళూరులోని ఉప్పరపేట పోలీస్ స్టేషన్‌లో గతంలో కేసు నమోదైంది. ఆ కేసును కొట్టివేస్తూ కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎం. నాగప్రసన్న ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి తనపై దాఖలైన ఫిర్యాదును రద్దు చేయాలని డీకే శివకుమార్ హైకోర్టును అభ్యర్థించారు. ఈ క్రమంలో డీకే. శివకుమార్ మీద దాఖలు చేసిన పిటిషన్‌ను ఆమోదించింది. అదే సమయంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణపై ప్రకృతి విపత్తు నిర్వహణ చట్టం కింద కనకపుర టౌన్ పోలీస్ స్టేషన్ లో, బెంగళూరులోని హలాసురు పోలీస్ స్టేషన్ నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల విచారణ వాయిదా వేసిన కోర్టు ఆ రెండు కేసుల్లో స్టే విధించింది.
తదుపరి చట్టపరమైన చర్యలను కోర్టు వాయిదా వేసింది. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్ననికలకు ముందు మండ్యలో ప్రజాధ్వని యాత్ర సందర్భంగా కార్యకర్తలపై రూ. 500 నోట్లు విసిరిన కేసుకు సంబంధించి మండ్య రూరల్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన పిటిషన్‌ర్ కేసును ఉపసంహరించుకున్నారు. కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టుకు పోలీసులు బి రిపోర్టు సమర్పించడంతో డీకే శివకుమార్ మీద నమోదు చేసిన కేసు ఉపసంహరించుకున్నారు.
మేకేదాటు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2022 జనవరి 9 నుంచి 10 రోజుల పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. నడక సమయంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, అంటువ్యాధి వ్యాప్తికి కారణమయ్యారనే ఆరోపణలపై కర్ణాటక అంటు వ్యాధుల నివారణ చట్టం కింద డీకే శివకుమార్ మీద కేసు నమోదు చేయబడింది.












Click it and Unblock the Notifications